రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Jul 20, 2020, 5 tweets

తిరుపతి గంగమ్మ జాతర - సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు

సిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతరకు, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?

రాయలసీమలో అత్యంత వైభవంగా జరిగే పండుగలు / జాతరాలలో తిరుపతి గంగమ్మ జాతర ముందువరసలో ఉంటుంది.

తాతయ్యకుంట గంగమ్మ తిరుపతి గ్రామదేవత. తిరుపతిని నిత్యం కాపాడే తల్లి.

అయితే గంగమ్మ తిరుపతి చేరుకోవడం వెనుక ఒక కథ ఉంది. అమ్మవారు మొదట కడప ప్రాంతంలోని ఒక ఊరిలో ఉండేవారట. ఆ ఊరిలో భయంకర వ్యాధులు ప్రబలి ఏటా అనేక మంది మరణిస్తుండగా, అమ్మవారు ఏడాదికి ఒకరిని నరబలి ఇస్తే, మరణాలు ఆగిపోతాయని

చెప్పగా గ్రామస్థులు అంగీరకరించారట. ఏటా గంగమ్మ జాతర సమయంలో బయటి వ్యక్తులు ఎవరైనా ఆ ఊరి వెంట వెళుతూ ఉంటే వారిని బలిచ్చేవారట. ఒకయేట తాతాచార్యులు చిక్కినారట.
జాతరలో పూనకం వచ్చిన ఒక వ్యక్తి బలి బలి అని తాతాచార్యుల మీదకి రాగా, ఆచార్యుల వారు బాగా ఎర్రగా కాల్చిన శంఖు చక్ర ముద్రలు

ఆ పూనకం పూనిన వ్యక్తి వీపు భాగాన అంటించినారట.

తరువాత తాతాచార్యులు వారు గంగమ్మకు శిష్యత అనుగ్రహించి అక్కడి నుండి తోడ్కొని వచ్చి తిరుపతిలో నిలిపినారట. 'అన్నమాచార్య చరిత్ర పీఠిక' పుస్తకంలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి ఈ కథను పేర్కొన్నారు.

తాతాచార్యులు వైష్ణవాచార్యులు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు. ఈ తాతాచార్యులు వంశస్తులే శివతాండవ కర్త, సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు.

అందుకు అమ్మవారు తాతయ్యగుంట గంగమ్మ అయినారని ప్రతీతి.

#సీమచరిత్ర #Rayalaseema_Temples #Chittoor_Temples #Ravishing_Rayalaseema

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling