రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Jul 28, 2020, 8 tweets

రక్షా బంధన్ - రాఖీ పూర్ణిమ - రాయలసీమ దేవాలయాలు

సోదర - సోదరి బాంధవ్యాలు, ఆడబిడ్డకు సారె పెట్టే సంప్రదాయాలు మానవులలోనే కాదు దేవుళ్లలోనూ చూడొచ్చు. అటువంటి కొన్ని ఆలయాలు రాయలసీమలో

మోపూరు భైరవేశ్వర ఆలయం (భైరవుడి సోదరి అక్కపప్పూరమ్మ ) - కడప జిల్లా

భైరవాచలం మెట్ల మార్గం ప్రారంభంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్కపప్పూరమ్మ ఆలయం ఉంటుంది. భైరవేశ్వర స్వామి విగ్రహం రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో అక్కపప్పూరమ్మ తలపై చేయి పెట్టగా,

ఆగ్రహించిన భైరవేశ్వరుడు భైరవాచలం వదిలి వెళ్లాలని ఆదేశించాడని అందుకే అక్కపప్పూరమ్మ ఆలయం కింద ఉందని చెబుతారు.అయితే స్వామి తరువాత శాంతించి అక్కపప్పూరమ్మకు తొలి పూజ భాగ్యం కల్పించాడని స్థల పురాణం.

చిత్రం : నల్లచెరువుపల్లిలో అక్కపప్పూరమ్మ ఆలయం

బోయకొండ గంగమ్మ - చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారిని బోయకొండ గంగమ్మ/ చౌడేపల్లి గంగమ్మ అని కొలుస్తారు. బోయకొండ గంగమ్మ తల్లిని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సోదరిగా భావిస్తారు.

చిత్రం : బోయకొండ గంగమ్మ ఆలయం

తాతయ్యగుంట గంగమ్మ - తిరుపతి, చిత్తూరు జిల్లా

తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ. ఏటా తిరుపతిలో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా చేస్తారు. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా భావిస్తారు. ఏటా శ్రీవారి తరుపున తిరుమల తిరుపతి దేవస్థానం వారు జాతర సమయంలో గంగమ్మను 'సారె' సమర్పిస్తారు.

పొలతల క్షేత్రం-(అక్కదేవతలు - బండెన్న)-కడప జిల్లా

కడప జిల్లాలోని పొలతల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు మల్లిఖార్జునుడిగా పూజలందుకుంటున్నాడు.శివుడితో పాటు అక్కదేవతలు, వారి సోదరుడు పులిబండెన్న స్వామి పూజలు అందుకుంటున్నారు. దెయ్యం పట్టినవారికిఇక్కడ దెయ్యాలు వదిలిస్తూ ఉంటారు

శ్రీకృష్ణ /జగన్నాథ -బలరామ / బలభద్ర - సుభద్ర - కర్నూలు జిల్లా

బలరామకృష్ణుల సోదరి సుభద్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. కర్నూలులోని ఇస్కాన్ మందిరంలో కృష్ణుడితో పాటు సుభద్ర, బలరాముడు పూజలు అందుకుంటున్నారు.

జ్ఞానప్రసూనాంబ-శ్రీకాళహస్తి -చిత్తూరు జిల్లా

పంచభూత లింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో అమ్మవారు శ్రీజ్ఞానప్రసూనాంబగా కొలువై ఉన్నారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబను తిరుమల శ్రీవారి సోదరిగా భావిస్తారు
#Rayalaseema_Temples #Ravishing_Rayalaseema #Kadapa #Kurnool #Chittoor #Tirupati #Anantapur

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling