రాముడు, రామాయణం, రాయలసీమ -Part 5
శ్రీరాముల వారే కొలిచిన మూల రామ విగ్రహం, శ్రీమఠం, మంత్రాలయం :
మంత్రాలయం తెలుగు రాష్ట్రాలలోని ఏకైక ప్రధాన మధ్వమఠం అయిన శ్రీమఠంలో తరతరాలుగా శ్రీమఠ పీఠాధిపతులు కొలుస్తున్న శ్రీ మూలా రామ దేవరు విగ్రహం ఉంది.
చతుర్ముఖ బ్రహ్మ స్వామివారిని సేవించుకోవడానికి విగ్రహం తయారుచేసివ్వమని ఆదేశించగా దేవ శిల్పి విశ్వకర్మ ఈ మూలా రామ విగ్రహాన్ని తయారుచేశారు.ఈవిగ్రహాన్ని చాతుర్యుగ మూర్తి అని కూడా అంటారు (సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలలో పూజింపబడుతున్న విగ్రహం).
సృష్టికర్త బ్రహ్మ, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కొలిచిన ఈవిగ్రహం అనేక మంది దేవుళ్ళు, ఋషులు చేతులు మారి సూర్య భగవానుడి నుండి వైవస్వత మనువు అక్కడినుండి ఇక్షాకుడి అక్కడినుండి ఇక్ష్వాకుల కులదైవంగా పూజింపబడింది. ఇక్ష్వాకు వంశ రాజు దశరథ మహారాజు నిత్యం పూజించేవారు.
అందువల్లే ఆయనకు పుట్టిన తొలిసంతానానికి ఆ రాముడి పేరే పెట్టుకున్నాడు. దశరథమహారాజు తనకుమారుడికి ‘రామ’ అని పేరు పెట్టడంతో ఋషులు అనాదిగా కొలవబడుతున్న విగ్రహాన్ని ‘మూలా రాముడు’ అని పిలిచారు. అలా ఆ మూలా రామ విగ్రహాన్ని శ్రీసీతారాములు, హనుమంతుడు, భీమసేనుడు, ద్రౌపది తదితరులు కొలిచి
తరువాత కళింగ గజపతుల రాజ్యం చేరాయి. కళింగ గజపతుల రాజ్యంలో నరహరితీర్థులు అని ఒక గొప్ప మధ్వ మత ఆచార్యులు ఉండేవారు. కళింగ గజపతిరాజు చనిపోయేనాటికి అయన కుమారుడు చిన్నవాడు కావడంతో ఒక ఏనుగుకు వరమాల ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తె వారే రాజ్యభారం వహించాలనేది ఆ రాజ్యసంప్రదాయం.
అలా ఆ ఏనుగు ఆ వరమాల తెచ్చినరహరితీర్థుల మెడలో వేయగా, ఆ రాజ్యరాణి, నరహరితీర్థులను రాజ్యభారం వహించమని కోరగా, సన్యాసి అయిన తనకు రాజ్యభారం వద్దని వారివద్ద ఉండే మూలారాముల విగ్రహం ఇస్తే చాలనగా ఆ రాణి అలానే ఆ విగ్రహాలను నరహరితీర్థులకు ఇవ్వగా అయన ఆ విగ్రహాన్ని మధ్వాచార్యుల వారికి ఇచ్చారు
మధ్వాచార్యుల వారి నుండి మూల రాముల వారి విగ్రహం వారి శిష్యులైన పద్మనాభ తీర్థులు ఆ తరువాత వారి శిష్యులు ఇలా తరతరాలుగా రాఘవేంద్రస్వామి సహా అనేక మంది మధ్వ మత ఆచార్యులు సేవిస్తూ వస్తున్నారు . ప్రస్తుతం ఈ విగ్రహం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠంలో పూజలు అందుకుంటోంది.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
