@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Art_Architucture_litrature_culture_OdiaEpigraphy_Researcher

Aug 14, 2020, 7 tweets

పాతపట్నం
******************************
శ్రీకాకుళం జిల్లా చివరన విసిరి వేసినట్లు ఉండే పాతపట్నం ఒకప్పుడు 1960 కి ముందు పార్లేమెంట్ కేంద్రం గా ఉండేది .
*ఇది ఆంధ్ర లో ఉన్నపటికీ పర్లాకిమిడి పక్కనే ఉండటం వలన ఈ ప్రాంత లో ఆంధ్ర మరియు ఒడిశా మిశ్రమ సంస్కృతి కనిపిస్తుంది .
#thread
1/n

ఒకప్పుడు పర్లాకిమిడి కి చెందిన గజపతి మహారాజు లకి తపట్నం సామంత రాజ్యంగా పేరు ఉండేది .
*పాతపట్నం పేరు పూర్ణ పాట్నా నుండి వచ్చింది.
రాజధానిని శ్రీముఖాలింగం నుండి పార్లకిమిడికి తరలించే ముందు. ఇది 14 వ శతాబ్దంలో గంగావంసి పాలకుడి రాజధాని.
2/n

ఇది పంచలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.
*దీనిని పార్లకిమిడికి చెందిన ముకుంద దేవా గజపతి నిర్మించారు
*గజపతి రాజ్యానికి సామంత రాజులుగా పాతపట్నం ప్రాంతం వారే ఉండేవారు . ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో పాతపట్నం గంజాం జిల్లా పరిధిలో వుండేది
3/n

మాజీ రాష్ట్రపతి మరియు భారతరత్న గౌరవనీయులు వి.వి.గిరి గారు 1951 లో పాతపట్నం నుండి ఎంపీ గా గెలిచారు . తర్వాత కాలం లో పాతపట్నం ను పార్లమెంట్ కేంద్రం గా తీసేసారు . పాతపట్నం అభివృద్ధి లో ఆయన పాత్ర చాలా ఉంది . ప్రస్తుతం పాతపట్నం లో ఉన్న హైస్కూల్ ఆయన కృషి వల్ల వచ్చిందే .
4/n

అప్పటి నుండి కాలక్రమేణా దినదిన అభివృద్ధి చెందుతూ శ్రీకాకుళం జిల్లాలో విద్యా నిలయం గా మారింది . జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు ఈ ప్రాంతానికి చదవటానికి వెళ్తుంటారు . మంచి పాఠశాలలు , కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి . కానీ వలసలతో ముందు ఉండే ప్రాంతం కూడా ఇదే .
5/n

హైదరాబద్ నగరం లో మూసపెట్ ప్రాంతం లో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు దాదాపు 50 % పైగా ఉంటారు . వీళ్లంతా దశాబ్దాల క్రితం పనులకోసం వలసలు వెళ్లి అక్కడ స్థిరపడిన వారే .
ఈ జిల్లా లోకి వెళ్లి పాతపట్నం అనగానే అందరికీ గుర్తు వచ్చేది నీలమణి దుర్గ అమ్మవారు
6/n

దసరా పండగ రోజు ఐతే పూజ కి వచ్చే వాహనాలు క్యూ రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది.
ఈ పట్టణంలో ఠాకురాణి జాత్రా ఐదు సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది.
రచన సహకారం : - శ్రీ మేఘనాధ శివల, విష్ణు మోహన్ అధికారి
#End_of_thread

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling