. Profile picture
.
.

Aug 16, 2020, 21 tweets

భారత క్రికెట్‌ మహేంద్రుడు
=====================

ధోనీ..!
ఆస్ట్రేలియాకు గిల్‌క్రిస్ట్, శ్రీలంకకు సంగర్కరలా వికెట్‌ కీపర్‌–బ్యాట్స్‌మన్‌ మాకూ ఒకడు ఉంటే బావుణ్ణు అని ప్రతి ఒక్కరూ అనుకునేవారు...

#Dhoni

అప్పటిదాకా నిజం చెప్పాలంటే ఇండియా కు కీపర్ కోసమే ఒక ఆటగాడి స్థానం కోల్పోతున్న అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉండేది.. అలాంటి సమయంలోనే జులపాల జుట్టు ఎగరేసుకుంటూ నేనున్నానంటూ వచ్చాడు...
క్రికెట్‌పరంగా అంతగా గుర్తింపులేని రాంచీ నుంచి వచ్చి భారత క్రికెట్‌కే కొత్త గుర్తింపు తీసుకువచ్చాడు.

సొగసైన బ్యాటింగ్‌కు మైమరచిపోవడం అలవాటైన మాకు...
దుమ్ముదులిపే బ్యాటింగ్‌ మజాతో కిక్కెంచావ్...
ఏ బాల్‌ను ఎలా కొట్టాలి అనే క్రికెట్‌ పాఠాలకు విరుద్ధంగా
ఎలాంటి బాల్‌నైనా ఎడాపెడా కొట్టేయడం ఎలాగో చూపించాడు...

షోయబ్ అక్తర్ లాంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ ధోని గురించి చెప్పిన మాటలు...
ఒక మ్యాచ్ లో నేను ఫుల్ ఫార్మ్ తో బౌల్ చేస్తున్న...పిచ్ కూడా చాలా ఫ్లాట్ గా ఉంది..అప్పుడే సచిన్ ను ఔట్ చేసి మంచి ఉపుమీదున్న ...అప్పుడే ఒక కొత్త కుర్రాడు బరిలోకి వచ్చాడు..

" అతను నా బాల్స్ ను ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు..విధ్వంసం సృష్టించాడు...బౌలర్ ఎలా బౌల్ చేస్తున్నాడు, అసలు అక్కడ బౌలింగ్ చేస్తోంది ఎవరు...ఇలాంటివేమి పట్టించుకోకుండా బాట్ తో బాల్ ను కొట్టడమే పనిగా ఆడుతుంటాడు.. ఇలాంటి బాట్స్మెన్ ను నేనిప్పటికి దాకా చూళ్ళేదు.

ఇలా బౌలింగ్ చేస్తోంది ఫాస్ట్ బౌలరా, స్పిన్ బౌలరా అని ఇలాంటివేమి తన మదిలో ఉండవు..తన బాట్ కు తెలిసింది వచ్చిన బాల్ ను గ్రౌండ్ నలువైపులా ఎలా కొట్టాలి అంతే.

ద్రవిడ్, కుంబ్లే సంప్రదాయ కెప్టెన్సీతో కాస్త నిస్పృహలో ఉన్నప్పుడు కెప్టెన్‌గా చార్జ్‌ తీసుకున్నావ్‌...

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ను రీచార్జ్‌ చేసి టాప్‌గేర్‌లోకి తీసుకువెళ్లావ్‌...

2007లో ట్వటీ 20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ లో ఏమాత్రం తొణకకుండా కొత్త కుర్రాళ్లలో సౌత్‌ ఆఫ్రికా బయలుదేరాడు. దూకుడు, తెలివి కలగలిపి జట్టును నడిపించి టీ 20 వరల్డ్‌ కప్‌ను దేశానికి అందించావ్, మమ్మల్ని అబ్బురపరచావు, జులపాల జుట్టు కత్తిరించుకుని మిస్టర్‌ కూల్‌గా మారావు

ఆటగాళ్లకు దూకుడు నేర్పించింది బహుశా గంగూలీ నే కావచ్చు...కానీ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారి ఆటను వారు అడనిచ్చేలా చేసింది మాత్రం ధోనీనే. అసలు చెప్పాలంటే ధోని నాయకత్వంలోనే ఆటగాళ్లు పూర్తి స్వేచ్ఛతో ఆడడం మొదలెట్టారు..

మీ ఆట మీరు ఆడండి, జట్టులో మీ ప్లేస్ గురించి ఆలోచన నాకు వదిలేయండి అని ఆటగాడికి అంత భరోసా ఇచ్చిన నాయకుడు ధోని ఒక్కడే...

2011 వన్డే వరల్డ్‌ కప్‌కు గురిపెట్టావ్‌.. 28ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్‌కప్‌ను సగర్వంగా పైకెత్తాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకు వచ్చావ్. మూడు ఫార్మట్ల క్రికెట్‌లో ఇండియాను నంబర్‌వన్‌గా నిలిపాడు...
ఎందరో మెరికల్లాంటి యువక్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చాడు...

నీ బ్యాటింగ్‌కు దాసోహమయ్యాం...
నీ చురుకైన కీపింగ్‌కు అచ్చెరువొందాం...
నీ తెలివైన కెప్టెన్సీకి ఫిదా అయ్యాం....

రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ ఎంత పెరుగుతున్నా కూల్‌గా ఉండటం...
అంతే కూల్‌గా మ్యాచ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్‌ చేయడం నీ స్టైల్...
ఫేర్‌వెర్‌ మ్యాచ్‌ల జంఘాటం ఏమీ లేదని సీనియర్లకు ఇంటిదారి చూపించిన వైనం నీది...
అదే సూత్రాన్ని నీకూ వర్తింపజేసుకుని ఆదర్శంగా నిలిచాడు...

మ్యాచ్‌లలో పరుగుల వరద పారించడమే కాదు...
కెరీర్‌లో పరుగు ఆపడం కూడా ఎలాగో చేసి చూపించాడు...

కొత్తతరం నాయకత్వం చేపట్టే సమయం వచ్చిందని గుర్తించి స్వచ్ఛందంగానే కెప్టెన్సీని వదులుకున్నా...
ఆ వెనువెంటనే టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై కొట్టడం ధోనికే చెల్లుతుంది.....

2019 వరల్డ్‌ కప్‌ ముగిసనప్పటి నుంచి ధోని రిటైర్మెంట్‌పై సాగుతున్న చర్చపై తాను చెవి వేసి ఉంచి...
కాస్త ల్యాగ్‌ అయిందనిపించినా సరే అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గౌరవప్రదంగా వీడ్కోలు పలికాడు....

ధోనీ నాయకత్వం అంటే నాకు అభిమానం, గౌరవం అన్నింటికీ మించి నాకు ఆ నాయకత్వ లక్షణం అన్నా, ఆ నాయకత్వంలో తాను తీస్కునే నిర్ణయాలు ఒక్క క్రికెట్ లోనే కాదు,

ఇతర ఏ ఏ రంగాల్లో ఉన్న టీమ్ లీడర్ కైనా టీమ్ ను మేనేజ్ చేసేవాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు...అదే వైనాన్ని పాటిస్తే ప్రతి టీమ్ కూడా తమ టార్గెట్ ను ఈజీగా రీచ్ అవ్వచ్చు.

2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అలా నిలబడి విన్నింగ్‌ షాట్‌గా సిక్స్‌ కొట్టి ఆ బాల్‌ వైపు నువ్వు చూసిన చూపు.. నీ పెదవులపై విరిసిన చిరునవ్వు భారత క్రికెట్‌ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి..ఎందుకంటే ఆ క్షణాలు ఎంతో అపురూపం... మధురాతి మధురం...

నేను ధోనీని ఒక ఆటగాడిగా కంటే ఒక నాయకుడిగానే ఇష్టపడతా...

LOVE YOU DHONI

💐💐💐💚💚💚💚💙💙💙💙❤️❤️❤️❤️

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling