కడప చరిత్రలో ఒక చీకటి దినం-బుగ్గవంక వరదలు
19 ఏళ్ల తరువాత నిండిన కడప బుగ్గవంక ప్రాజెక్టు - 19 ఏళ్ల ముందు 2001లో బుగ్గ వంక వరదలు సృష్టించిన భీభత్సం జిల్లా వాసులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎన్నో చేదుజ్ఞాపకాలు మిగిల్చిన 2001 బుగ్గవంక వరదల గురించి కథనం👇
#సీమచరిత్ర #Kadapa #Buggavanka
కడప పట్టణంగా గుండా ప్రవహించే నది బుగ్గవంక. పెన్నా నదికి ఉపనది అయిన బుగ్గవంక పై ఆనకట్ట కూడా ఉంది. కడపలో ప్రాణ నష్టం సంభవించే వరదలు అత్యంత అరుదు. కానీ ఇటీవల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో కడపలో భీభత్సం సృష్టించిన అల్లర్లు అంటే మాత్రం 2001 బుగ్గవంక వరదల గురించే చెప్పుకోవాలి.
కడపవాసులకి 2001 బుగ్గవంక వరదలు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది.
బుగ్గవంక ఆనకట్ట కడప పట్టణానికి 7 కిమీల ఎగువన ఉంది. ఆనకట్ట కట్టినప్పటి నుండి పెద్ద వరద ఎప్పుడూ రాకపోవడం,ఇతర కారణాల వల్ల బుగ్గవంక నది కడప పట్టణంలో ఆక్రమణకు గురయ్యింది. నదీ తీరం మొత్తం గృహాలు, దుకాణాలు వెలిశాయి
అటువంటి సమయంలో 2001 అక్టోబర్ నెలలో వాయుగుండం కారణంగా రాయలసీమ అంతటా భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని పెన్నా, కుందూ, పాపాగ్ని, చిత్రావతి వంటి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి.
పైప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలకు బుగ్గవంక ప్రాజెక్టులోకి అధికంగా వరద చేరడం,
దానికితోడు రాళ్ళకాలువ, ఉద్దిమడుగు వంక నీరు కూడా చేరడంతో ‘మెరుపు వరద’ పరిస్థితులు దారితీశాయి. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అక్టోబర్ 15 -16 అర్ధరాత్రిపూట ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా గేట్లు ఎత్తివేయడంతో బుగ్గవంకను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలన్నీ కొట్టుకుపోయాయి.
కడప పట్టణం పూర్తిగా మునిగిపోయింది. పదుల సంఖ్యలో జనాలు మరణించారు. 2-3 రోజులు బాహ్యప్రపంచంతో కడప సంబంధాలు తెగిపోయాయి. అపార ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించింది. కడప పట్టణ సమీప చరిత్రలో ఇవే అతిపెద్ద వరదలు.
చిత్రం : కడప పట్టణం మీదుగా ప్రవహిస్తున్న బుగ్గవంక
ఈ సంఘటనల తరువాతే బుగ్గవంక ఆక్రమణల తొలగింపు, నదికి రెండువైపులా రక్షణ గోడల నిర్మాణం, నదిపై బ్రిడ్జిల నిర్మాణం వంటి పనులు చేపట్టబడ్డాయి.
కర్టెసీ : telugu.oneindia.com/news/2001/10/1…
సాక్షి
గూగుల్ maps
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
