రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Sep 21, 2020, 13 tweets

రాయలసీమ ఆపద్భాందవుడు శ్రీనివాసుడు - రాయలసీమ అభివృద్ధిలో తితిదే పాత్ర - SV యూనివర్సిటీ, ఒక చరిత్ర

తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆంధ్ర మహా సభ ఏర్పడిన తరువాత, ఆంధ్రోద్యమంలో రెండవ విజయం తెలుగువారి కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం.

(మొదటి విజయం ప్రత్యేక PCC ఏర్పాటుకు అంగీకారం). అప్పటివరకు మద్రాస్ విశ్వవిద్యాలయం ఒకటే మద్రాసు రాష్ట్రంలోని అన్ని భాషల ప్రజలకు అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయం. అనేక తర్జనభర్జనల తరువాత ఆంధ్రవిశ్వకళాపరిషత్తు తాత్కాలిక ప్రధాన కేంద్రాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు.

బెజవాడ తాత్కాలిక కేంద్రంగా ఏర్పడిన ఆంధ్రవిశ్వకళాపరిషత్తు (ఆంధ్రా విశ్వవిద్యాలయము ) శాశ్వత ప్రధాన కేంద్రం ఎక్కడికి మార్చాలి అని చర్చ జరుగుతున్న రోజులవి. బెజావాడ వాళ్లు, రాజమహేంద్రవరం వాళ్లు వాల్తేరు (విశాఖపట్నం ) వాళ్ళు తమ నగరంలో ప్రధాన కేంద్రం ఉండలాంటే తమ నగరంలో ఉండాలని కోరారు.

అప్పటికే పశ్చిమాంధ్ర (దత్తతమండలాలు) నాయకులు ఆంధ్రోద్యమం పట్ల అంత సుముఖంగా లేరు. విద్య / ఆర్థిక రంగాలలో తమకంటే ఏంతో మెరుగైన కోస్తా ప్రాంతంతో పోలిస్తే వెనుకబడిన తమ ప్రాంతం ఎంతవరకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఫలాలు అనుభవిస్తుంది అన్నది వారి సంశయం.

సీమ ప్రజలలో నమ్మకం కలిగించడం కోసమో లేక మూడు నగరాలు కాకుండా తటస్థ ప్రదేశంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన వల్లనో ఆఖరకు విద్యాపరంగా బాగా వెనుకబడిన దత్తతమండలాలలోని (అప్పటికింకా రాయలసీమగా పేరు మార్చలేదు) అనంతపురంలో ప్రధాన కేంద్రం పెడదామని ఆంధ్రోద్యమ నాయకులు ప్రతిపాదించారు.

రాయలసీమలో విద్యావకాశాలు ఏమాత్రం లేని రోజులవి. 1906 లెక్కల ప్రకారం ఆంధ్రాలో 8 కాలేజీలు ఉండగా రాయలసీమ 5 జిల్లాల్లో (బళ్లారి సహా ) కేవలం ఒక్క కాలేజీ ఉన్నది. అటువంటి సమయంలో రాయలసీమ అభివృద్దికి, విద్యావకాశాల పెంపుకు ఈ ఆంధ్రా విశ్వవిద్యాలయము అనంతపురంలో ఏర్పడటము అత్యవసరం.

ఆంధ్రా విశ్వవిద్యాలయము ప్రధాన కేంద్రం అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు విశ్వవిద్యాలయ సెనేట్, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెలెక్ట్ కమిటీ, ఆంధ్ర మహాసభ అన్నీ ఆమోదం తెలిపాయి. తీరా బిల్లు కౌన్సిల్ కి రాగానే పరిస్థితి మారింది. అనంతపురం బదులుగా , వాల్తేరు (విశాఖపట్నం) లో విశ్వవిద్యాలయ

ప్రధాన కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వ పెద్దలు. అప్పటిదాకా అనంతపురం అన్న నాయకులు కూడా వాల్తేరుకే మద్దతు పలికారు. ఫలితం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. ఇచ్చిన మాట ప్రకారం కనీసం అనంతపురంలో ఉపకేంద్రం కానీ ప్రాంతీయకేంద్రం కానీ ఏర్పాటుకు చొరవ చూపలేదు

అప్పటికే ఆంధ్రఉద్యమం మీద ఒకింత అనుమానంతో ఉన్న సీమ నాయకులు ఈ పరిణామాలను తమకు జరిగిన అన్యాయంగా భావించారు. తమ తమ జిల్లాలు ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో కాకుండా మద్రాస్ విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉండాలని పట్టుపట్టారు. పశ్చిమాంధ్ర మినహా తెలుగు ప్రాంతాలకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ఏర్పడింది

కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణయ్య వంటి పెద్దలు ఎంత చెప్పినా రాయలసీమ నేతలు ఒప్పుకోలేదు. రాయలసీమ జిల్లాలు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కలవలేదు.

స్వాతంత్య్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రాయలసీమ బళ్లారి, తుంగభద్ర ప్రాజెక్టులను కోల్పోయింది.

తిరుపతి రాయలసీమలోనే భాగమైంది. రాయలసీమ నాయకులు తమ ప్రాంతానికి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం కావాల్సిందే అని పట్టు పట్టారు. స్వామివారి చల్లని చూపు వలన రాష్ట్రం ఏర్పడిన 11 నెలలలోనే రాయలసీమ విద్యార్థుల పాలిట కొంగుబంగారంగా, రాష్ట్రంలో రెండో విశ్వవిద్యాలయంగా

శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1954 సెప్టెంబర్ 2న ఏర్పడింది. యూనివర్శిటీ ఏర్పాటుకు అయ్యే స్థలం, భవనాలు, 62 లక్షల భూరి విరాళం, ఏటా 2.5 లక్షల నిర్వహణ నిమిత్తం తితిదే సమకూర్చింది. తితిదే / శ్రీవారి ఆశీస్సులు లేకపోతె తమకొక యూనివర్సిటీ కావాలనే రాయలసీమవాసుల కల అలాగే ఉండిపోయేది.

స్వామివారి చల్లని చూపు సీమవాసులపై యూనివర్సిటీతో ఆగిపోలేదు. రూయా ఆసుపత్రి, స్విమ్స్, పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇలా నాణ్యమైన విద్య / వైద్యం కూడా స్వామివారి చలవే.

#సీమచరిత్ర #TTD #SVU #tirupati #tirumala

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling