#FatherOfIndianCinema #DadaSahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది.వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి
దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు.
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.
వీరి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. వీరు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించారు.
సత్కారాలు
బొంబాయిలో భారతీయ సినిమా జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1939 లో ఫాల్కేకు అయిదువేల రూపాయలు పర్సు బహూకరించారు.1966 లో వీరి పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వంచే స్థాపించబడింది.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.