#TrainDay 🚈🚉🚃🚅🚆🚄🚂
రైలు (#Train) అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటుకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో ధూమశకటం అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అంటారు.
ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అంటారు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన జేమ్స్ వాట్ (James Watt) అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ "గ్లాస్ గో(Glasgow)" విశ్వవిద్యాలయంలో 1776లో కనుగొన్నాడు.
దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 🚄🚆 "బుల్లెట్ రైళ్లు(#BulletTrains)" బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
గొలుసు కవిత – రైలు ప్రయాణం
– (మనబడి స్వచ్చంద సేవకుల బృందం – భాస్కర్ రాయవరం, మల్లిక్ దివాకర్ల, కిశోర్ నారె, శైలజ కొట్ర, సుజన పాలూరి)
రైలు ప్రయాణం అంటేనే అదో వింత సరదా
మనసులోన పొంగిపొరలే జ్ఞాపకాల వరద!
రిజర్వేషన్ ఆఫీసులో మొదలుకదా ఆ సరదా అది ఉంటే ప్రయాణమే హాయి కదా సోదరా!
సెలవంటూ సరదాగా సాగనంపు బంధువులు వెళ్ళవద్దు ఉండమంటు కన్నీళ్లతో బంధాలు ఉండలేని వెళ్ళలేని మనసు ఊగులాటలు ఇంత రైలు ప్రయాణాన అంతులేని అనుభూతులు
అన్నీ మరచి చుట్టూ చూస్తే ఎన్ని తమాషాలు! కిటికీ పక్కన సీటుకోసం పిల్లల కుస్తీపట్లు, ఎంత వింత అంత స్పీడు వెనక్కెెళ్ళే చెట్లు ఊయలూపు పయనంలో ఇట్టే కునికిపాట్లు!
నేల తుడుస్తూ డబ్బులు అడిగే పిల్లల జాలి చూపులు గుండెను పిండే గొంతుకతోటి కబోది పాడే గీతాలు అందరుచేరి లాగించేసే చాయ్, సమోసాలు ఎదురు సీట్లో సీతను చూసి బాబాయ్ వేసే ఈలలు అది గమనించిన వాళ్ళ నాన్న కొరకొర చూసే చూపులు!
అప్పటిదాకా తెలియనివారితొ ఎక్కడలేని కబుర్లు పక్కనకూర్చుని ఉన్నవారే చక్కని కొత్త నేస్తాలు అపరిచితులతో ఆడే ఆటలు, పెరిగే ఆత్మీయతలు తగవులు, గొడవలు, అలకలు అన్నీ నీటి బుడగలు!
గమనించారో గ్రహియిస్తారు అందమైన ఓ సత్యం నీదీ, నాదీ అందరిదీ జీవితమే ఒక రైలుప్రయాణం ఎవ్వరి పయనం ఎందాకన్నది ఎవరూ ఎరుగని విచిత్రం
గమ్యం ఒకటే కాదు ఆశయం, ప్రయాణమవాలి అతి మధురం
ఆస్వాదిస్తూ అనుక్షణం ఆనందిద్దాం ప్రతీదినం!
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.