H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

Jun 30, 2021, 8 tweets

#MeteorWatchDay 🌠☄️
ఆకాశం నిర్మలంగా ఉన్న రాత్రి మినుకు మినుకు మంటూ వేలాది చుక్కలు మనకు దర్శనమిస్తాయి. కొన్ని సార్లు ఈ చుక్కలు నేలమీదికి రాలుతున్నట్లు కనిపిస్తాయి. అవి జారిపడేటప్పుడు ఒక వెలుతురు చారను వెనక్కు వదులుతున్నట్లు కనిపిస్తుంది.

ఇలా వెలుగులు విరజిమ్ముతూ ఆకాశం నుండి రాలేవి నక్షత్రాలు కాదు ఉల్కలు. ఉల్కలు పగలూ, రాత్రీ రాలుతుంటాయి. కాని రాత్రిపూట మాత్రమే మనకు కనిపిస్తాయి.ఉల్క రాలుతుంటే మనం మనసులో ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అనే మూఢ నమ్మకం కూడా ఉంది. ఇలా ఏదైనా కోరుకున్నది జరిగితే అది కాకతాలీయమే.

మనుకోర్కెలకు ఉల్కలకు ఏ సంబంధం లేదు.

ఉల్క (ఆంగ్లం #Meteoroid లేదా #Meteor), సౌరమండలములో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి వాతావరణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణంలో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి.

దీని పేరుకు మూలం గ్రీకు భాష. దీనర్థం 'ఆకాశంలో ఎత్తున'.ఉల్కల గుంపులు కొన్ని తోక చుక్కల నుంచి పుట్టినట్లుగా గుర్తిస్తున్నారు. గ్రహాలు, ఉపగ్రహాలు ఆకాశంలోకి ఎలా వచ్చాయో అలాగే ఈ ఉల్కలు కూడా వచ్చాయి. ఒకొక్కప్పుడు తోకచుక్కల తలలు విచ్ఛిపోయి ఖండ, ఖండాలుగా విడిపోతూ ఉంటాయి.

అందులోని బండరాళ్లే ఉల్కలు.ఈ ఉల్కలు కొన్ని భూ వాతావరణంలోకి సెకనుకు 7 నుంచి 45 మైళ్ల వేగంతో చొచ్చుకుని వస్తాయి. భూమికి చేరువ అవుతున్న కొద్దీ భూవాతావరణం మరింత దట్టం అవుతూ ఉండటం వల్ల ఈ వాతావరణంలోని వాయువుల నిరోధానికి ఉల్క వేడెక్కుతుంది. తెల్లగా మండి మసైపోతుంది.

ఈ మంట విడుదల చేసే కాంతి మనకు కాంతిరేఖగా కనిపిస్తుంది. తక్కువ కాంతి గల ఉల్కలు వెలిగే వ్యవధి ఒక సెకనులోపే. బాగా కాంతివంతమైన ఉల్క అయితే 3 నుంచి 5 సెకనుల వరకు వెలుగుతుంది. ఏడాది పొడవునా అన్ని రాత్రుల్లోనూ ఉల్కల సంఖ్య ఒకే మాదిరిగా ఉండదు. కొన్ని ప్రత్యేక దినాల్లో ఇవి అధికంగా పడుతూ

ఉంటాయి. దానినే ఉల్కావర్షం (ఉల్కాపాతం) అని అంటారు. ఈ ఉల్కావర్షం ఆకాశంలో ఒకే బిందువు నుంచి బయలుదేరి అన్ని వైపులకూ విస్తరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది ఒక భ్రాంతి. నిజానికి ఆ ఉల్కారేఖలన్నీ ఇంచుమించుగా సమాంతర రేఖలు.
#WorldAsteroidDay

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling