అక్కిరాజు లక్ష్మీ సునీత Profile picture

Dec 9, 2021, 7 tweets

సుబ్రహ్మణ్య షష్ఠి/స్కందషష్ఠి/కుమార షష్ఠి/షష్టీ దేవి పూజ

శక్తిహస్తం, విరూపాక్షం,శిఖి వాహం,షాడాననం,దారుణం రిపు రోగఘ్నం భావయేత్ కుక్కుట ధ్వజం(ధ్యాన శ్లోకం)

శీఘ్ర వివాహం,పిల్లలు పుట్టడం కోసం,సంతానాభివృద్ధి కోసం, జంతుదోష పరిహారార్థం,కుజదోష, నేత్ర వ్యాధి నివరణార్ధం,మార్గశిర శుద్ధ

షష్ఠి నాడు చేసే పండుగే
"సుబ్రహ్మణ్య షష్ఠి/స్కందషష్ఠి/కుమార షష్ఠి/షష్టీదేవి పూజ"

సుబ్రహ్మణ్య జననం,తారకాసురవధ, స్వామి సర్పరూపం దాల్చినరోజు ఇవాళే.
తారకాసురుడి సంహారం కోసం పుట్టిన కుమారస్వామి గణాధిపత్యం పోటీలో నెగ్గిన(గణపతి శివపార్వతులకు మూడు సార్లు ప్రదక్షిణలు చేసి గెలిచిన కథ

మనకి తెలుసు కదా)అన్నగారి మీద అలిగి,భూలోకానికి (శ్రీ శైలం)వచ్చేస్తాడు.అప్పుడు పాతాళ లోకంలో ఉండే ఆదిశేషుడి కుమారుడైన కుముదుడి కూతురు ఐన వల్లీదేవితో వివాహం కోసం సర్పరూపంలో మారి సుబ్రహ్మణ్య స్వామి అయ్యారు.
ఈ రోజు షష్టీదేవిని కూడా పూజించడం చేయాలి.
బ్రహ్మదేవుడి మానస పుత్రిక ఐన

షష్టీదేవి ని మానసాదేవి/మంగళషష్టీ/దేవసేన అని కూడా పిలుస్తారు.ఈవిడ సుబ్రహ్మణ్యేశ్వరుని భార్య.శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది.
పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,పుట్టిన శిశువుకు క్షేమం.

ఏం చేయాలి
పుట్టలో పాలు పొయ్యడం,
జంటనాగుల పూజ,ఆవుపాలతో అభిషేకం,వెండి పడగ సమర్పించడం,కావిళ్ళతో పాలు,పానకం సమర్పించడం,నువ్వులు,బెల్లంతో  చేసిన  నువ్వుండలు(చిమ్మిరి/తిలపిష్టం),చలిమిడి(గుడపిష్టం) బెల్లపుపొంగలి,పానకం, వడపప్పు,అరటిపళ్ళు నైవేద్యం గా సమర్పించాలి.

శాస్త్రవిరుద్ధంగా కోడిగుడ్లు పుట్ట దగ్గర వెయ్యడం,దీపావళి కి కొన్న టపాకాయలు కాల్చడం లాంటివి చెయ్యకూడదు.

వాల్మీకి రామాయణం లోని బాలకాండలో "కుమారసంభవం" శ్లోకాలని గర్భిణీ స్త్రీలు చదివినా,విన్నా సత్సంతానం కలుగుతుంది.

ఈరోజు సాయంవేళలో
1ఓం సం సుబ్రహ్మణ్యస్వామినే నమః
2ఓం కుమారగురవే నమః
మంత్రజపం చేస్తే మంచిది.

అందరికీ సుబ్రహ్మణ్యషష్ఠి శుభాకాంక్షలు🙏స్వామి అనుగ్రహముతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను🙇🏻‍♀️🙏【అ ల సు】

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling