అక్కిరాజు లక్ష్మీ సునీత Profile picture

Aug 24, 2022, 10 tweets

#ముగ్గులు_వేయడం_ఎందుకు

ఇంటి ముందర, గడప మీద,గేటు బయట ముగ్గులు పెడితే ఆ ఇంట దుష్టశక్తులు ప్రవేశించకుండా,ఇంట్లో ఉన్న లక్ష్మి బైటికి వెళ్ళకుండా కాపాడతాయి.

ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు వేస్తే ఆ ఇంట మంగళకరమైన పనులు జరుగుతున్నాయి అని అర్దం.

నక్షత్రం ఆకారంలో వేసిన ముగ్గు భూతప్రేతపిశాచాలని ఆ ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చేస్తుంది.

సాధారణంగా మనం వేసే ముగ్గుల్లో పద్మాలు శుభసూచకం.అందుకే ఏ ముగ్గునీ తొక్కకూడదు.అలాగే ఒట్టి ముగ్గు వేసి వదిలెయ్యకూడదు, దాని మీద కొంచెం పసుపు/కుంకుమ/పువ్వులు వెయ్యాలి.

తులసి కోట వద్ద,దేవుడి మందిరం వద్ద, పూజా పీఠం/పీట మీద  అష్టదళపద్మం  ముగ్గు వేయడం శుభకరం.

ఎవరైనా భిక్షువు/సన్యాసి ఇంటికి వస్తే ఏమీ ఇవ్వకుండా పంపించకూడదు.(శంకరాచార్యులు భిక్షకి వస్తే ఆ ఇంటి ఇల్లాలు వెతికి మరీ   #ఎండుఉసిరికాయ ఇస్తే,సంతోషంగా ఆయన చేసిన కనకధారాస్తోత్రం ఫలితంగా బంగారు

ఉసిరికల వాన కురిసిన సంగతి మనకు తెలుసు కదా)
ఏదైనా అమంగళం జరిగితే ఇంటి ముందర ముగ్గు వెయ్యకుండా ఉంటే ఆ ఇంట భిక్ష దొరకదు అని అర్దం అయ్యి అడిగి లేదనిపించుకోకుండా వెళ్ళి పోయేవారు.

వీలున్నప్పుడు ఏదైనా దేవాలయం శుభ్రం చేసి చక్కని ముగ్గులు పెడితే విశేషపుణ్యం.

నైవేద్యం పెట్టే చోట కూడా ముందు ముగ్గు వేసి దాని మీద నైవేద్యపు పళ్ళెం/విస్తరి/అరిటాకు ఉంచాలి.

కొన్ని రకాల పూజలు చేసేటప్పుడు వివిధ కోణాలతో ముగ్గులు వేసి ఆరాధిస్తారు.( లక్ష్మి కుబేర ముగ్గు,ఐశ్వర్య లక్ష్మి ముగ్గు)

తెలుగువారందరూ ధనుర్మాసం అంతా నెలపట్టి ఇంటి ముందర ఆవుపేడతో అలికి పెద్దపెద్ద ముగ్గులు వేసి వాటిల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు పసుపు కుంకుమతో అలంకరణ చేస్తారు.
రధసప్తమి రోజు,సంక్రాంతి అప్పుడు ముక్కనుమ రోజు రథం ముగ్గు వేస్తాం.

#SCIENTIFIC_REASONS & #HEALTH_BENEFITS
సాధారణంగా ముగ్గులు ఆవుపేడతో అలికిన(antibacterial గా పని చేస్తుంది!!)నేల మీద   బియ్యం పిండి తో వెయ్యాలి. చీమలు,చిన్న చిన్న పురుగులు ఈ పిండిని ఆహారంగా తీసుకుంటాయి.(we are feeding them)(భూతయఙ్ఞం)అలాగే వాటి ఆహారం ఇంటి బయటే దొరుకుతుంది కాబట్టి

ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉంటాయి😃.గడపలకి రాసే పసుపు antiseptic &antibacterialగా పని చేస్తుంది.
   
పెద్ద పెద్ద మెలికల ముగ్గులు తప్పులు పోకుండా వెయ్యాలి(ఇదేం పుస్తకం కాదు చెరిపేసి మళ్ళీ వెయ్యడానికి)  అంటే బోలెడు memory power & concentration కావాలి😂.

పొద్దున పొద్దున్నే ఓ అరగంట నడుం వంచి ముగ్గులు వెయ్యడం కంటే మంచి exercise ఇంకేం ఉంటుంది??!!
#ఆరోగ్య_సూత్రాలు_దాగున్న_ఆచారాలు.🙏

SOME Pics courtesy GOOGLE

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling