ఇంటి ముందర, గడప మీద,గేటు బయట ముగ్గులు పెడితే ఆ ఇంట దుష్టశక్తులు ప్రవేశించకుండా,ఇంట్లో ఉన్న లక్ష్మి బైటికి వెళ్ళకుండా కాపాడతాయి.
ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు వేస్తే ఆ ఇంట మంగళకరమైన పనులు జరుగుతున్నాయి అని అర్దం.
నక్షత్రం ఆకారంలో వేసిన ముగ్గు భూతప్రేతపిశాచాలని ఆ ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చేస్తుంది.
సాధారణంగా మనం వేసే ముగ్గుల్లో పద్మాలు శుభసూచకం.అందుకే ఏ ముగ్గునీ తొక్కకూడదు.అలాగే ఒట్టి ముగ్గు వేసి వదిలెయ్యకూడదు, దాని మీద కొంచెం పసుపు/కుంకుమ/పువ్వులు వెయ్యాలి.
తులసి కోట వద్ద,దేవుడి మందిరం వద్ద, పూజా పీఠం/పీట మీద అష్టదళపద్మం ముగ్గు వేయడం శుభకరం.
ఎవరైనా భిక్షువు/సన్యాసి ఇంటికి వస్తే ఏమీ ఇవ్వకుండా పంపించకూడదు.(శంకరాచార్యులు భిక్షకి వస్తే ఆ ఇంటి ఇల్లాలు వెతికి మరీ #ఎండుఉసిరికాయ ఇస్తే,సంతోషంగా ఆయన చేసిన కనకధారాస్తోత్రం ఫలితంగా బంగారు
ఉసిరికల వాన కురిసిన సంగతి మనకు తెలుసు కదా)
ఏదైనా అమంగళం జరిగితే ఇంటి ముందర ముగ్గు వెయ్యకుండా ఉంటే ఆ ఇంట భిక్ష దొరకదు అని అర్దం అయ్యి అడిగి లేదనిపించుకోకుండా వెళ్ళి పోయేవారు.
వీలున్నప్పుడు ఏదైనా దేవాలయం శుభ్రం చేసి చక్కని ముగ్గులు పెడితే విశేషపుణ్యం.
నైవేద్యం పెట్టే చోట కూడా ముందు ముగ్గు వేసి దాని మీద నైవేద్యపు పళ్ళెం/విస్తరి/అరిటాకు ఉంచాలి.
కొన్ని రకాల పూజలు చేసేటప్పుడు వివిధ కోణాలతో ముగ్గులు వేసి ఆరాధిస్తారు.( లక్ష్మి కుబేర ముగ్గు,ఐశ్వర్య లక్ష్మి ముగ్గు)
తెలుగువారందరూ ధనుర్మాసం అంతా నెలపట్టి ఇంటి ముందర ఆవుపేడతో అలికి పెద్దపెద్ద ముగ్గులు వేసి వాటిల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు పసుపు కుంకుమతో అలంకరణ చేస్తారు.
రధసప్తమి రోజు,సంక్రాంతి అప్పుడు ముక్కనుమ రోజు రథం ముగ్గు వేస్తాం.
#SCIENTIFIC_REASONS & #HEALTH_BENEFITS
సాధారణంగా ముగ్గులు ఆవుపేడతో అలికిన(antibacterial గా పని చేస్తుంది!!)నేల మీద బియ్యం పిండి తో వెయ్యాలి. చీమలు,చిన్న చిన్న పురుగులు ఈ పిండిని ఆహారంగా తీసుకుంటాయి.(we are feeding them)(భూతయఙ్ఞం)అలాగే వాటి ఆహారం ఇంటి బయటే దొరుకుతుంది కాబట్టి
ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉంటాయి😃.గడపలకి రాసే పసుపు antiseptic &antibacterialగా పని చేస్తుంది.
పెద్ద పెద్ద మెలికల ముగ్గులు తప్పులు పోకుండా వెయ్యాలి(ఇదేం పుస్తకం కాదు చెరిపేసి మళ్ళీ వెయ్యడానికి) అంటే బోలెడు memory power & concentration కావాలి😂.
ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను #ఇంద్రయాగం అనేవారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు.వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.అందుకే ఈ పండుగ రోజు
ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల,గోపాలకుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పించే వారు. అందుకే ఈపూజకు #అన్నకూటం అని మరొక పేరు కూడా ఉంది.
#కార్తీక_మాసం #Dos_Donts.
ఈ సంవత్సరం 26-10-2022 నుంచి 23-11-2022 వరకూ కార్తీక మాసం.
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు;
గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
🕉అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
#భాగవతం_అష్టమ_స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది అండీ.(అందుకే పురాణాలు చదవాలి, అది మన కర్తవ్యం. ఋషి ఋణం అని ఒకటి ఉంటుంది అది తీరాలి అంటే వారు రాసినవి చదివి అర్థం చేసుకుంటేనే తీరుతుంది..రామాయణం భారతం,భాగవతం,భగవద్గీత లో లేని విషయం ఇంకేం లేదు ఈ ప్రపంచంలో..మీరు
కూడా ఆ పుస్తకాలు చదివితే అన్ని సందేహాలకీ సమాధానం లభిస్తుంది 🙏🙏)
నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము"లో27 మహాయుగాలు ఐపోయి,28వ మహాయుగంలో కృత,త్రేతా,ద్వాపరయుగాలు ఐపోయి,కలియుగములో ఉన్నాము.ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు
కలియుగం 5,123 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుతం 2022 (ఇది క్రీస్తుశకం లెక్కల ప్రకారం!!) సంవత్సరానికి ఇంకా 4,26,877 సంవత్సరాలు మిగిలివుంది.428,899లో అంతమవుతుంది.
3101 +present year =కలియుగం ప్రారంభం అయ్యింది.ఇదే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన సంవత్సరం కూడా!!
ఆయన అవతారం చాలించిన మర్నాటి నుంచి కలియుగం ప్రారంభం అయ్యింది.(ఇది NASA వారు కూడా ధృవీకరించారు.)
కలియుగం కిdouble/రెట్టింపు ద్వాపర యుగం (432000×2=864000)
కలియుగం కి మూడు రెట్లు =త్రేతాయుగం.(432000×3=1296000)
కలియుగం కి నాలుగురెట్లు=కృతయుగం (432000×4=1728000)