#Thread
ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కేసీఆర్ గారి నేతృత్వంలో విజయతీరానికి చేరింది. 2014 జూన్ 2 నాడు అవతరించిన తెలంగాణ ప్రభుత్వంలో ఎందరో ఉద్యమకారులకు భాగస్వామ్యం కల్పించారు సీఎం కేసీఆర్.
జై తెలంగాణ ✊
#JaiTelangana ✊
1/n
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఇదొక రికార్డు. ఇంతమంది ఉద్యమకారులు ఒక ప్రభుత్వంలో భాగస్వాములు కావడం ఇదివరకెన్నడూ జరగలేదు. అలా తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు పదవులిచ్చి గౌరవించిన ఉద్యమకారుల వివరాలు ఒకదగ్గర రికార్డు చేసే ప్రయత్నం ఇది.
2/n
2015లో నూతనంగా ఏర్పాటయిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, రచయిత, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.
3/n
తొలి టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా తెలంగాణ ఉద్యోగ సంఘం నేత సి. విఠల్, మరియు తెలంగాణ హిస్టరీ సొసైటీకి చెందిన తడకమళ్ల వివేక్ తదితరులని ముఖ్యమంత్రి నియమించారు.
4/n
ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, వక్త, ఉద్యమంలో అనేక వేదికలపై తన గళాన్ని బలంగా వినిపించిన దేశపతి శ్రీనివాస్ గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా (ఓఎస్డీగా) నియమించుకున్నారు.
5/n
తెలంగాణ జేయేసీ కో-కన్వీనర్ గా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు, సామాజికవేత్త మల్లెపల్లి లక్ష్మయ్య గారిని బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు కేసీఆర్ గారు
6/n
తెలంగాణ జర్నలిస్టులను ఉద్యమంలో ముందుండి నడిపిన నాయకుడు, తెలంగాణ అరిగోసను అక్షరీకరించిన శ్రీ అల్లం నారాయణ గారికి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు
7/n
"నీళ్ళు-నిజాలు" పేరిట తెలంగాణకు నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి, ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆర్ విద్యాసాగర్ రావు గారిని రాష్ట్ర నీటిపారుదల సలహాదారునిగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వారు 2017 ఏప్రిల్ నెలలో స్వర్గస్తులయ్యారు.
8/n
ఇరిగేషన్ ఇంజనీర్ శ్రీధర్ దేశ్‌పాండే మంచి రచయిత కూడా. నదీజలాల అంశంపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శ్రీధర్ దేశ్‌పాండే గారు ముఖ్యమంత్రిగారికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా (OSD) నియమించబడ్డారు.
9/n
తెలంగాణ ఉద్యమకారుడు, సాహితీవేత్త, రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న అయాచితం శ్రీధర్ గారిని రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గా నియమించారు కేసీఆర్ గారు.
10/n
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘం (TNGO) నాయకుడు శ్రీ దేవీప్రసాద్ గారికి రాష్ట్రం ఏర్పడ్డాక బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
#MovementToGovernment
11/n
తెలంగాణ రచయితల వేదికలో కీలక సభ్యుడిగా ఉంటూ ఉద్యమంలో తన రచనల ద్వారా ఇతోధికంగా కృషిచేసిన ప్రముఖ రచయిత శ్రీ జూలూరి గౌరీశంకర్ గారిని తొలుత బీసీ కమీషన్ సభ్యులుగా ఆ తరువాత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమించి గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
#MovementToGovernment
12/n
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా జేయేసీ నాయకుడు పిడమర్తి రవికి రాష్ట్రం ఏర్పడగానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్ గారు.
#MovementToGovernment
13/n
అనేక కథలు, నవలలు, సిద్ధాంత వ్యాసాలు రాసిన ప్రముఖ రచయిత, ఉద్యమకారులు బీఎస్ రాములు గారిని తెలంగాణ తొలి బిసి కమీషన్ చైర్మన్ గా నియమించి సముచితంగా గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
#MovementToGovernment
#Thread
14/n
ఉద్యోగ సంఘాల నేతగా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న కె.స్వామి గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి, శాసనమండలి చైర్మన్ గా గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
#MovementToGovernment
15/n
2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించిన ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దన్నుగా అనేక రచనలు చేశారు. 2017 మే నెలలో వీరిని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు
#MovementToGovernment
#Thread
16/n
విద్యార్ధి ఉద్యమకారుడు ఎర్రోల్ల శ్రీనివాస్ ను తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ/ఎస్టీ కమీషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ ఆయన పదవీకాలం ముగిశాక TSMSIDC చైర్మన్ పదవినిచ్చి గౌరవించారు.
#MovementToGovernment
#Thread
17/n
కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి ఉద్యమ నాయకుడు, దివ్యాంగుడైనా రాష్ట్ర సాధన పోరాటంలో ముందు నిల్చిన యువ ఉద్యమకారుడు కె. వాసుదేవరెడ్డిని తెలంగాణ ఏర్పడిన తరువాత దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు
#MovementToGovernment
#Thread
18/n
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తుమ్మల పాపిరెడ్డి గారిని రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా నియమించారు కేసీఆర్ గారు
2017లో వారికి మరోసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు.
#MovementToGovernment
19/n
రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు గాంధీ నాయక్ గారిని 2017లో తెలంగాణ ట్రైబల్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు
#MovementToGovernment
#Thread
20/n
నదీజలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గొంతెత్తి, మలిదశ ఉద్యమంలో ముందున్న ఉద్యమనాయకుడు, వక్త, రాజకీయ విశ్లేషకులు వీరమళ్ల ప్రకాష్ గారికి రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారు CM కేసీఆర్
#MovementToGovernment
21/n
అన్ని టీవీ చానెళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో జీ-24 గంటలు చానెల్ సీఈఓగా శ్రీ శైలేష్ రెడ్డి ఉద్యమ వాస్తవ స్వరూపాన్ని ప్రజలకు చూపెట్టారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక వారిని మంత్రి @KTRTRS టీశాట్ సీఈఓగా నియమించారు.
#MovementToGovernment
22/n
ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గోసను అక్షరీకరించి అద్భుతంగా గానం చేశారు. ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచారు. వారిని తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటాలో) నియమించి గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
#MovementToGovernment
#Thread
23/n
ఓయూ విద్యార్ధి ఉద్యమకారుడు, రాష్ట్ర సాధన పోరులో సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేసిన డాక్టర్ రాకేశ్ చిరుమిళ్ల గారిని రాష్ట్ర ఏర్పాటు అవగానే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్ గారు.
#MovementToGovernment
#Thread
24/n
ప్రముఖ రచయిత దేవులపల్లి ప్రభాకర్ రావు గారు 1969 తెలంగాణ ఉద్యమం నాటి నుండి రాష్ట్ర సాకారం వరకూ తన రచనలతో ప్రజల్లో చైతన్యం రగిలించారు. వారిని 2016లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నియమించారు
వారు 2022 ఏప్రిల్‌లో స్వర్గస్తులయ్యారు.
#MovementToGovernment
#Thread
25/n
తెలంగాణ ధూం ధాం అనే కళారూపంతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు రసమయి బాల్ కిషన్ గారిని మానకొండూర్ నుండి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారిని తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు.
#MovementToGovernment
26/n
ఉద్యమం తొలినాళ్ల నుండీ కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచిన తుంగతుర్తి నియోజకవర్గ ఉద్యమకారుడు మందుల సామేల్ గారికి రాష్ట్రం ఏర్పడ్డాక వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్ గారు.
#MovementToGovernment
27/n
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నాయకుడిగా ఉద్యమంలో అగ్రభాగాన ఉండి, సమైక్యవాదుల చేతిలో దాడికి గురై రక్తమోడ్చిన సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ హజారి గారిని రాష్ట్రం ఏర్పాటయిన తరువాత సీఎం పీఆర్వోగా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
#MovementToGovernment
#Thread
28/n
రచయిత, వక్త వకుళాభరణం కృష్ణమోహన్ రావు గారిని బిసి కమీషన్ చైర్మన్ గా, విద్యార్ధి ఉద్యమకారులు శుభప్రధ్ పటేల్, కిషోర్ గౌడ్, న్యాయవాదుల జేయేసీ సభ్యులు సి.హెచ్. ఉపేంద్రలను 2021 ఆగస్టులో బిసి కమీషన్ సభ్యులుగా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
#MovementToGovernment
#Thread
29/n
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమ గీతాలను అద్భుతంగా పాడి ప్రజలను చైతన్యపరచిన గాయకుడు, ఉద్యమకారులు సాయిచంద్ గారిని 2021 డిసెంబర్‌లో రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు.
#MovementToGovernment
#Thread
30/n
ఉస్మానియా విద్యార్ధి జేయేసీ నాయకుడిగా రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ఎప్పటికప్పుడు ఉద్యమ అప్డేట్స్ జాతీయ మీడియాకు అందించిన మన్నె క్రిషాంక్ గారిని 2021 డిసెంబర్‌లో TSMDC చైర్మన్‌గా సీఎం శ్రీ కేసీఆర్ గారు నియమించారు.
#MovementToGovernment
#Thread
31/n
తెలంగాణ గురించి ఆన్లైన్‌లో ఏ సమాచారమూ అందుబాటులో లేనప్పుడు ఉద్యమ నేపథ్యాన్ని గురించి అనేక వ్యాసాలు రాసిన రచయిత, స్టార్టప్ ఫౌండర్, ఉద్యమకారుడు సుజయ్ కారంపురి గారిని రాష్ట్రం ఏర్పాటయిన వెంటనే డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్‌గా నియమించారు మంత్రి @KTRTRS గారు
#MovementToGovernment
32/n
విద్యార్ధి ఉద్యమకారుడు, రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన యువకుడు పాటిమీది జగన్ గారిని డిసెంబర్ 2021లో తెలంగాణ స్టేట్ టెక్నాలజి సర్వీసెస్ చైర్మన్‌గా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
#MovementToGovernment
#Thread
33/n
నల్లగొండ జిల్లాలో ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన ఉద్యమకారుడు కంచర్ల రామకృష్ణారెడ్డి గారిని జూన్ 2018లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు.
#MovementToGovernment
#Thread
34/n
ఉస్మానియా విద్యార్ధి జేయేసీ నేత, అనేక ఆందోళనల్లో పాల్గొని కేసులు పెట్టినా, గాయాలు తగిలినా జై తెలంగాణ నినాదం వదలని ఉద్యమకారుడు దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్ గారిని డిసెంబర్ 2021లో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్ గారు
#MovementToGovernment
35/n
రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన యువనాయకులు వై సతీష్ రెడ్ది గారిని జూన్ 2022లో తెలంగాణ రెడ్కో చైర్మన్‌గా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
36/n
లండన్‌లో తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి విదేశంలో తెలంగాణ జెండా సగర్వంగా ఎగురవేసిన ఎన్నారై ఉద్యమకారుడు అనిల్ కూర్మాచలం గారిని 2022 జూన్‌లో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించారు సీఎం శ్రీ కేసీఆర్ గారు
#MovementToGovernment
#Thread
37/n
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగసంఘ నేతగా 18 రోజుల పాటు పెన్‌డౌన్, 55 రోజుల సకలజనుల సమ్మె, లక్ష గొంతులు - లక్ష గళాలు వంటి ఎన్నో కార్యక్రమాల్లో ముందున్న కారం రవీందర్ రెడ్డి గారిని 2021 మే నెలలో టీఎస్‌పీఎస్సి మెంబర్‌గా నియమించారు సీఎం శ్రీ కేసీఆర్ గారు
#MovementToGovernment
#Thread
38/n
రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కామారెడ్డికి చెందిన ఉపాధ్యాయురాలు, ఉద్యమకారిణి సుమిత్రానంద తనోబా గారిని 2021 మే నెలలో టీఎస్‌పీఎస్సీ మెంబర్‌గా నియమించారు సీఎం కేసీఆర్ గారు
#MovementToGovernment
#Thread
39/n
సీనియర్ జర్నలిస్టు, మంజీర రచయితల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వంటి సంస్థల్లో పనిచేసిన ఆర్ సత్యనారాయణ గారిని మే 2021లో టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా సీఎం కేసీఆర్ గారు నియమించారు
40/n
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, తెలంగాణ జాగృతి సంస్థ నాయకునిగా ఉద్యమకాలంలో బతుకమ్మ పండుగ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించిన మేడె రాజీవ్ సాగర్ గారిని జూన్ 2022లో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు
#MovementToGovernment
#Thread
41/n
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.