Konatham Dileep Profile picture
Sep 3, 2022 41 tweets 26 min read Read on X
#Thread

ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కేసీఆర్ గారి నేతృత్వంలో విజయతీరానికి చేరింది. 2014 జూన్ 2 నాడు అవతరించిన తెలంగాణ ప్రభుత్వంలో ఎందరో ఉద్యమకారులకు భాగస్వామ్యం కల్పించారు సీఎం కేసీఆర్.

జై తెలంగాణ ✊
#JaiTelangana

1/n Image
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఇదొక రికార్డు. ఇంతమంది ఉద్యమకారులు ఒక ప్రభుత్వంలో భాగస్వాములు కావడం ఇదివరకెన్నడూ జరగలేదు. అలా తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు పదవులిచ్చి గౌరవించిన ఉద్యమకారుల వివరాలు ఒకదగ్గర రికార్డు చేసే ప్రయత్నం ఇది.

2/n Image
2015లో నూతనంగా ఏర్పాటయిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, రచయిత, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.

3/n Image
తొలి టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా తెలంగాణ ఉద్యోగ సంఘం నేత సి. విఠల్, మరియు తెలంగాణ హిస్టరీ సొసైటీకి చెందిన తడకమళ్ల వివేక్ తదితరులని ముఖ్యమంత్రి నియమించారు.

4/n ImageImage
ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, వక్త, ఉద్యమంలో అనేక వేదికలపై తన గళాన్ని బలంగా వినిపించిన దేశపతి శ్రీనివాస్ గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా (ఓఎస్డీగా) నియమించుకున్నారు.

5/n Image
తెలంగాణ జేయేసీ కో-కన్వీనర్ గా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు, సామాజికవేత్త మల్లెపల్లి లక్ష్మయ్య గారిని బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు కేసీఆర్ గారు

6/n Image
తెలంగాణ జర్నలిస్టులను ఉద్యమంలో ముందుండి నడిపిన నాయకుడు, తెలంగాణ అరిగోసను అక్షరీకరించిన శ్రీ అల్లం నారాయణ గారికి ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు

7/n Image
"నీళ్ళు-నిజాలు" పేరిట తెలంగాణకు నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి, ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆర్ విద్యాసాగర్ రావు గారిని రాష్ట్ర నీటిపారుదల సలహాదారునిగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వారు 2017 ఏప్రిల్ నెలలో స్వర్గస్తులయ్యారు.

8/n Image
ఇరిగేషన్ ఇంజనీర్ శ్రీధర్ దేశ్‌పాండే మంచి రచయిత కూడా. నదీజలాల అంశంపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శ్రీధర్ దేశ్‌పాండే గారు ముఖ్యమంత్రిగారికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా (OSD) నియమించబడ్డారు.

9/n Image
తెలంగాణ ఉద్యమకారుడు, సాహితీవేత్త, రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న అయాచితం శ్రీధర్ గారిని రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గా నియమించారు కేసీఆర్ గారు.

10/n Image
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘం (TNGO) నాయకుడు శ్రీ దేవీప్రసాద్ గారికి రాష్ట్రం ఏర్పడ్డాక బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

#MovementToGovernment

11/n Image
తెలంగాణ రచయితల వేదికలో కీలక సభ్యుడిగా ఉంటూ ఉద్యమంలో తన రచనల ద్వారా ఇతోధికంగా కృషిచేసిన ప్రముఖ రచయిత శ్రీ జూలూరి గౌరీశంకర్ గారిని తొలుత బీసీ కమీషన్ సభ్యులుగా ఆ తరువాత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమించి గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

#MovementToGovernment

12/n Image
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా జేయేసీ నాయకుడు పిడమర్తి రవికి రాష్ట్రం ఏర్పడగానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్ గారు.

#MovementToGovernment

13/n Image
అనేక కథలు, నవలలు, సిద్ధాంత వ్యాసాలు రాసిన ప్రముఖ రచయిత, ఉద్యమకారులు బీఎస్ రాములు గారిని తెలంగాణ తొలి బిసి కమీషన్ చైర్మన్ గా నియమించి సముచితంగా గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

#MovementToGovernment
#Thread

14/n Image
ఉద్యోగ సంఘాల నేతగా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న కె.స్వామి గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి, శాసనమండలి చైర్మన్ గా గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

#MovementToGovernment

15/n Image
2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించిన ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దన్నుగా అనేక రచనలు చేశారు. 2017 మే నెలలో వీరిని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు
#MovementToGovernment
#Thread

16/n Image
విద్యార్ధి ఉద్యమకారుడు ఎర్రోల్ల శ్రీనివాస్ ను తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ/ఎస్టీ కమీషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ ఆయన పదవీకాలం ముగిశాక TSMSIDC చైర్మన్ పదవినిచ్చి గౌరవించారు.

#MovementToGovernment
#Thread

17/n Image
కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి ఉద్యమ నాయకుడు, దివ్యాంగుడైనా రాష్ట్ర సాధన పోరాటంలో ముందు నిల్చిన యువ ఉద్యమకారుడు కె. వాసుదేవరెడ్డిని తెలంగాణ ఏర్పడిన తరువాత దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు

#MovementToGovernment
#Thread

18/n ImageImageImage
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తుమ్మల పాపిరెడ్డి గారిని రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా నియమించారు కేసీఆర్ గారు

2017లో వారికి మరోసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు.

#MovementToGovernment

19/n Image
రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు గాంధీ నాయక్ గారిని 2017లో తెలంగాణ ట్రైబల్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు

#MovementToGovernment
#Thread

20/n Image
నదీజలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గొంతెత్తి, మలిదశ ఉద్యమంలో ముందున్న ఉద్యమనాయకుడు, వక్త, రాజకీయ విశ్లేషకులు వీరమళ్ల ప్రకాష్ గారికి రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారు CM కేసీఆర్

#MovementToGovernment

21/n Image
అన్ని టీవీ చానెళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో జీ-24 గంటలు చానెల్ సీఈఓగా శ్రీ శైలేష్ రెడ్డి ఉద్యమ వాస్తవ స్వరూపాన్ని ప్రజలకు చూపెట్టారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక వారిని మంత్రి @KTRTRS టీశాట్ సీఈఓగా నియమించారు.

#MovementToGovernment

22/n Image
ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గోసను అక్షరీకరించి అద్భుతంగా గానం చేశారు. ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచారు. వారిని తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటాలో) నియమించి గౌరవించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
#MovementToGovernment
#Thread

23/n Image
ఓయూ విద్యార్ధి ఉద్యమకారుడు, రాష్ట్ర సాధన పోరులో సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేసిన డాక్టర్ రాకేశ్ చిరుమిళ్ల గారిని రాష్ట్ర ఏర్పాటు అవగానే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్ గారు.

#MovementToGovernment
#Thread
24/n ImageImage
ప్రముఖ రచయిత దేవులపల్లి ప్రభాకర్ రావు గారు 1969 తెలంగాణ ఉద్యమం నాటి నుండి రాష్ట్ర సాకారం వరకూ తన రచనలతో ప్రజల్లో చైతన్యం రగిలించారు. వారిని 2016లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నియమించారు

వారు 2022 ఏప్రిల్‌లో స్వర్గస్తులయ్యారు.

#MovementToGovernment
#Thread

25/n Image
తెలంగాణ ధూం ధాం అనే కళారూపంతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు రసమయి బాల్ కిషన్ గారిని మానకొండూర్ నుండి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారిని తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు.

#MovementToGovernment

26/n Image
ఉద్యమం తొలినాళ్ల నుండీ కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచిన తుంగతుర్తి నియోజకవర్గ ఉద్యమకారుడు మందుల సామేల్ గారికి రాష్ట్రం ఏర్పడ్డాక వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్ గారు.

#MovementToGovernment

27/n Image
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నాయకుడిగా ఉద్యమంలో అగ్రభాగాన ఉండి, సమైక్యవాదుల చేతిలో దాడికి గురై రక్తమోడ్చిన సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ హజారి గారిని రాష్ట్రం ఏర్పాటయిన తరువాత సీఎం పీఆర్వోగా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

#MovementToGovernment
#Thread

28/n ImageImage
రచయిత, వక్త వకుళాభరణం కృష్ణమోహన్ రావు గారిని బిసి కమీషన్ చైర్మన్ గా, విద్యార్ధి ఉద్యమకారులు శుభప్రధ్ పటేల్, కిషోర్ గౌడ్, న్యాయవాదుల జేయేసీ సభ్యులు సి.హెచ్. ఉపేంద్రలను 2021 ఆగస్టులో బిసి కమీషన్ సభ్యులుగా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

#MovementToGovernment
#Thread

29/n ImageImageImageImage
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమ గీతాలను అద్భుతంగా పాడి ప్రజలను చైతన్యపరచిన గాయకుడు, ఉద్యమకారులు సాయిచంద్ గారిని 2021 డిసెంబర్‌లో రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు.

#MovementToGovernment
#Thread
30/n Image
ఉస్మానియా విద్యార్ధి జేయేసీ నాయకుడిగా రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ఎప్పటికప్పుడు ఉద్యమ అప్డేట్స్ జాతీయ మీడియాకు అందించిన మన్నె క్రిషాంక్ గారిని 2021 డిసెంబర్‌లో TSMDC చైర్మన్‌గా సీఎం శ్రీ కేసీఆర్ గారు నియమించారు.

#MovementToGovernment
#Thread

31/n ImageImage
తెలంగాణ గురించి ఆన్లైన్‌లో ఏ సమాచారమూ అందుబాటులో లేనప్పుడు ఉద్యమ నేపథ్యాన్ని గురించి అనేక వ్యాసాలు రాసిన రచయిత, స్టార్టప్ ఫౌండర్, ఉద్యమకారుడు సుజయ్ కారంపురి గారిని రాష్ట్రం ఏర్పాటయిన వెంటనే డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్‌గా నియమించారు మంత్రి @KTRTRS గారు

#MovementToGovernment

32/n Image
విద్యార్ధి ఉద్యమకారుడు, రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన యువకుడు పాటిమీది జగన్ గారిని డిసెంబర్ 2021లో తెలంగాణ స్టేట్ టెక్నాలజి సర్వీసెస్ చైర్మన్‌గా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

#MovementToGovernment
#Thread
33/n ImageImageImage
నల్లగొండ జిల్లాలో ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన ఉద్యమకారుడు కంచర్ల రామకృష్ణారెడ్డి గారిని జూన్ 2018లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు.

#MovementToGovernment
#Thread

34/n ImageImage
ఉస్మానియా విద్యార్ధి జేయేసీ నేత, అనేక ఆందోళనల్లో పాల్గొని కేసులు పెట్టినా, గాయాలు తగిలినా జై తెలంగాణ నినాదం వదలని ఉద్యమకారుడు దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్ గారిని డిసెంబర్ 2021లో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్ గారు

#MovementToGovernment

35/n ImageImage
రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన యువనాయకులు వై సతీష్ రెడ్ది గారిని జూన్ 2022లో తెలంగాణ రెడ్కో చైర్మన్‌గా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

36/n Image
లండన్‌లో తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి విదేశంలో తెలంగాణ జెండా సగర్వంగా ఎగురవేసిన ఎన్నారై ఉద్యమకారుడు అనిల్ కూర్మాచలం గారిని 2022 జూన్‌లో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించారు సీఎం శ్రీ కేసీఆర్ గారు

#MovementToGovernment
#Thread

37/n ImageImageImage
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగసంఘ నేతగా 18 రోజుల పాటు పెన్‌డౌన్, 55 రోజుల సకలజనుల సమ్మె, లక్ష గొంతులు - లక్ష గళాలు వంటి ఎన్నో కార్యక్రమాల్లో ముందున్న కారం రవీందర్ రెడ్డి గారిని 2021 మే నెలలో టీఎస్‌పీఎస్సి మెంబర్‌గా నియమించారు సీఎం శ్రీ కేసీఆర్ గారు

#MovementToGovernment
#Thread

38/n Image
రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కామారెడ్డికి చెందిన ఉపాధ్యాయురాలు, ఉద్యమకారిణి సుమిత్రానంద తనోబా గారిని 2021 మే నెలలో టీఎస్‌పీఎస్సీ మెంబర్‌గా నియమించారు సీఎం కేసీఆర్ గారు

#MovementToGovernment
#Thread

39/n ImageImage
సీనియర్ జర్నలిస్టు, మంజీర రచయితల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వంటి సంస్థల్లో పనిచేసిన ఆర్ సత్యనారాయణ గారిని మే 2021లో టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా సీఎం కేసీఆర్ గారు నియమించారు

40/n Image
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, తెలంగాణ జాగృతి సంస్థ నాయకునిగా ఉద్యమకాలంలో బతుకమ్మ పండుగ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించిన మేడె రాజీవ్ సాగర్ గారిని జూన్ 2022లో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు

#MovementToGovernment
#Thread

41/n Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Konatham Dileep

Konatham Dileep Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @KonathamDileep

Apr 3, 2023
Must Read!

Are Hindus in danger?

Irrespective of what the graduates of WhatsApp University propagate, Muslim population in India will not exceed that of Hindus!

An explosive article by @dramila06 exposes the hate propaganda with statistics!

telanganatoday.com/rewind-are-hin…

1/n
Hindutva proponents spread the lie that the rate of population growth among Muslims in India is 2.5 times that of Hindus, and their population would soon explode. Are these fears rational? Here is a factcheck:

2/n
Currently, the Indian fertility rate is at 2.05, which is great news. This means, India’s population would eventually start decreasing (it would continue to increase for the next three decades because it takes time to reflect the lower TFR).

3/n
Read 14 tweets
Sep 29, 2022
#Thread

సుదీర్ఘ పోరాటం, అసమాన త్యాగాల తరువాత సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలోని తొలి ప్రభుత్వం చేసిన ముఖ్యమైన పనుల్లో ఒకటి, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషకు సముచిత స్థానం కల్పించడం

ఆ వివరాలు తెలిపే ట్వీట్ #Thread ఇది

1/n
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషకు, చరిత్ర, సంస్కృతికి తీవ్ర వివక్ష ఎదురైంది. మరీ ముఖ్యంగా ఇది పాఠ్య పుస్తకాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన భవిష్యత్ తరాలు చదివే పాఠ్య పుస్తకాలను సమూలంగా సంస్కరించింది.

2/n
తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, మన భాష, సంస్కృతి, చరిత్రకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఒకటో తరగతి మొదలుకొని డిగ్రీ స్థాయి వరకూ ఉన్న పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేశారు.

3/n
Read 17 tweets
Sep 26, 2022
#Thread

Today, Minister @KTRTRS visited @RGUKT_Basara and interacted with the students there.

But sadly some vested interests seem to be spreading rumours on today's meeting.

Wanted to clarify a few things.

1/n Image
Basara RGUKT has a total student strength of almost 8000+ students. Where as today's meeting happened in an auditorium on campus, which has a capacity of about 1800-2000 max.

2/n ImageImageImage
To ensure maximum students get a chance to interact with Minister @KTRTRS garu, the University management planned a lunch with a set of about 2000 students.

Later, a meeting with another set of about 2000 students was planned in the auditorium

3/n
Read 8 tweets
May 1, 2021
As per the directions of the Honourable Chief Minister Sri K Chandrashekar Rao, @TelanganaCS Sri @SomeshKumarIAS along with Secretary to CM Sri Rajashekar Reddy held a meeting with senior officials and took stock of the Covid situation in the state.

1/n
Important updates from today's meeting

Oxygen supply will be created for an additional 10,000 beds in Government hospitals, taking the total to about 20,000 beds

2/n
In September 2020, there were 18,232 Covid beds in the State (both Government and Private Sector). This has now been increased to 49,133 beds. Special efforts are on to further increase the number to 60,000 beds.

3/n
Read 8 tweets
Mar 14, 2020
Highlights of CM Sri KCR's press meet after cabinet meeting on #Coronavirus #COVID2019
- The first patient detected with Corona virus is now healthy and discharged after treatment
- We currently have one Corona positive case undergoing treatment

@TelanganaCMO

1/n
- Two other suspected cases are there and we are awaiting test results

2/n
- State Govt initiating a series of steps to contain the spread of #Coronavirus #COVID2019
- All educational institutions, coaching centres, summer camps will be shutdown. 

3/n
Read 11 tweets
Mar 2, 2020
Important update about Coronavirus COVID-19 case reported in Hyderabad. A 24 year old techie who works in Bengaluru had traveled to Dubai on 17th Feb on official work. Apparently few of his teammates came from Hongkong. He came back to India after four days. 1/n
The said techie came to Hyderabad from Bengaluru in a bus. He fell sick after reaching Hyderabad and took initial treatment at Apollo Hospitals, Secunderabad branch. The patient is now transferred to Gandhi hospital and is being treated in isolation ward. 2/n
CM Sri KCR has instructed the Health Dept and Municipal Administration Department to take necessary precautions. Isolation wards have been set up in Gandhi Hospital and Chest Hospital in Hyderabad.
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(