Important Thread 🧵
ధరణి వల్ల సమస్యలా ? లేక 70 ఏళ్ల దరిద్రం వల్ల సమస్యలా? అసలు ఇప్పుడు ఉన్న భూసమస్యలు ధరణి వల్ల ఉత్పన్నం అయ్యాయా కింద thread లో వివరంగా ఇవ్వడం జరిగింది. 1/25
#Dharani #Farmers #Telangana
మొట్టమొదటగా సమగ్ర భూరికార్డులు నిజాం హయంలో ~ 1934 నుంచి ~ 1946 వరకు సేత్వార్ రికార్డును రూపొందించారు. ఇందులో ప్రతి సర్వే నెంబర్, పటం, భూమి వివరాలు ఉండేవి. తరువాత 1953 లో సేటిల్మెంట్ రికార్డు/Kasra తయారు చేసి ప్రతి సర్వే నెంబర్లో కుటుంబ సభ్యుల వాటాలు/వివరాలు నమోదు చేశారు. 2/25
సేత్వార్ ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులకు ప్రామాణికం, అలాగే సేటిల్మెంట్ రికార్డుకు కూడా అంతే విలువ ఉంది. మొదట సేటిల్మెంట్ రికార్డు చాలా పద్దతిగా , ఒక్కొక్కరి పేరు ఒక్కో కాలమ్ లో నమోదు చేశారు దీని వల్ల typo తప్పిదాలు జరగలేదు. పైగా ఇందులో బై నంబర్లు లేవు. 3/25
1973 లో భూ పరిమితి చట్టం వచ్చాక రికార్డుల్లో సీలింగ్ భూముల నమోదు జరిగింది. తరువాత చేసిన రికార్డు పేరిశీలిస్తే కాలమ్ పద్ధతి లేకుండా , ఒకే పేపర్ పై సర్వే నెం , పేర్లు, భూ విభజన కూడా అడ్డం వరుసలో చేసి గజిబిజి అయిన సందర్భాలు ఉన్నాయి 4/25
1956 👇🏼 1976👇🏼
ఈ రికార్డులు అన్ని గ్రామాల్లో పట్వారీలు నిర్వహించేవాళ్ళు, రికార్డులు , గ్రామనక్ష వీరికి కొట్టిన పిండి. వ్రాత గజిబిజిగా ఉన్నా తరువాత రాసేది వీళ్లే కాబట్టి 1983 వరకు దాదాపు ఎటువంటి తప్పులు లేకుండా జరిగాయి. 1983 వచ్చేసరికి రికార్డుల్లో పట్టాదారు, అనుభవదారుడు చేర్చడం జరిగింది. 5/25
1983 వరకు భూ లావాదేవీలు పట్వారీ సమక్షంలో జరిగేవి, ఒక్కోసారి పట్వారీ ఒడ్డు మీద కూర్చొని అమ్మకం కొనుగులు దారుల సమక్షంలో రికార్డులు మార్చేవాళ్ళు.పట్వారీ రద్దువల్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.పేరు మారింది కానీ వాళ్ళ స్థానంలో వచ్చినవాళ్ళ ఇష్టారాజ్యం అయ్యింది 6/25
కొత్తగా వచ్చిన కార్యదర్శులకు గ్రామ భూమి నక్ష తెలియదు, అనుభవ దారులను సరయిన సమయంలో పట్టదారులుగా మార్చలేదు , వీళ్ళు వేరే గ్రామం వాళ్ళు కావడం వల్ల భూమి క్రయ విక్రయాల సమయంలో అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు ఉన్న తప్పుల్లో 99% ఇక్కడే మొదలయ్యాయి 7/25
* క్రయవిక్రయాలు జరిగిన తరువాత కార్యదర్శిని కలిస్తే ఒక్కోసారి భూ నక్ష తెలియక ఒక సర్వే నెంబర్ అమ్మితే ఇంకో సర్వేనంబరులో రికార్డు మార్చడం జరిగింది. అవే ఇప్పుడు పెద్ద సమస్య అయ్యాయి. రోడ్డు భూమి అమ్మితే ఎక్కడో లోపలి నంబరు మీద పెరు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది ధరణి తప్పా?? 8/25
కొత్త VRO లు పక్క ఊళ్ళో ఉండటం, సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల భూ క్రయవిక్రయాలు చాలా వరకు తెల్ల కాగితం మీద ఇంకొన్ని నోటి మాట మీద పెద్దల సమక్షంలో జరిగాయి. భూమి/నగదు మార్చుకున్నారు కానీ రికార్డు మార్పు మర్చిపోయారు. ఇలా కొన్ని తరాలు గడిచిపోయాయి. ఇది ధరణి తప్పా? 9/25
తండ్రి పేరు మీద భూములు రికార్డుల్లో సమానం చేసుకున్నారు, తరువాత ఎకర్నామా రాసుకున్నప్పుడు (వేరు పడ్డప్పుడు) భూములు సమానంగా పంచుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొదగ్గర, భూస్వభావం, నీళ్ల సౌకర్యం బట్టి ఎక్కువ తక్కువ పంచుకున్నారు కానీ దానికి అనుగుణంగా రికార్డు మార్చుకోలే. ఇది ధరణి తప్పా? 10/25
కొన్ని ఏళ్ల నుంచి చాలా మంది రద్దు బదుళ్ళు చేసుకున్నారు, ఒక భూమి తీసుకొని ఇంకో దగ్గర భూమి ఇవ్వడం, మంచి భూమి తీసుకొని బదులుగా మెట్ట భూమి 2 నుంచి 3 రేట్లు ఇచ్చారు కానీ రికార్డులు రద్దుబదుళ్ల ప్రకారం మార్చుకోలేదు..ఇది ధరణి తప్పా? 11/25
పెద్దలు చనిపోయాక పౌతి మార్చుకొని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, బ్యాంక్ లోన్ల కోసం మాత్రమే పాస్స్బుక్ కోసం వెళ్లిన వాళ్ళు చాలా మంది. కొందరు VRO లు వేరే పాస్స్బుక్ మీద ఫోటో పెట్టి ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. పహానికి సంబంధం లేకుండా పాస్బుక్ ఇచ్చినవి ఉన్నాయి..ఇది ధరణి తప్పా? 12/25
అప్పట్లో గ్రామాల్లో చాలా పేర్లు ఒకేలా ఉండేవి, ఒకే ఇంట్లో తండ్రుల పేర్లు చిన్న రాజారెడీ, పెద్ద రాజారెడ్డి అయితే కొడుకుల పేర్లు కూడా చిన్న, నడిపి, పెద్ద రాజారెడ్డి లాంటి పేర్లు కోకొల్లలు, ఓకేపేరు చాలా మందికి ఉండటం వల్ల ఒకరి పెరు దగ్గర ఇంకో పెరు పహానిలో రాసారు.ఇది ధరణి తప్పా? 13/25
2017 కి ముందు 99% మందికి అసలు సర్వే నంబర్ల మీద అవగాహన లేదు, ఒక నెంబర్ అమ్మితే ఇంకో నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి..నీటిపారుదల కాలువలకు భూములు తక్కువ పోతే డబ్బులు కోసం ఎక్కువ భూమి వేయించుకున్న సందర్బాలు ఉన్నాయి. ఇది ధరణి తప్పా? 14/25
ధరణికి ముందు VROకు ఏదయినా మార్పు చేసే అవకాశం ఉండే, అవినీతి వ్యవస్థలో డబ్బులు తీసుకొని ఎన్నో మార్పులు చేశారు..ముఖం మీద మచ్చలు అద్దం ముందు పెట్టుకుంటే బయట పడ్డట్టు, ఈ తప్పులు ధరణి వచ్చాక ప్రజలు అసలు రికార్డులు చూసుకున్నాక బయటపడ్డాయి. కానీ ఈ తప్పులు ధరణి రాకముందు జరిగినవి 15/25
మొదట సర్వే గోలుసుతో కొలిచేవాళ్ళు, దాని వల్ల అక్కడక్కడ భూవిస్తీర్ణంలో వ్యత్యాసాలు వచ్చాయి...ఈ సమస్య 80 ఏళ్ల క్రితం జరిగింది, ఇన్ని రోజులు పహానిల మీద రికార్డు ఎక్కువ చేసి రాసారు కానీ డిజిటల్లో ఆ అవకాశం ఉండదు. ఇవి ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదు . దీనికి సమగ్ర భూసర్వే కావాలి 16/25
మొదటి సర్వే రికార్డుల్లో చాలా గ్రామాల శివారుల్లో గొలుసు (66 ఫీట్లు) భూమి వదిలి పెట్టారు, కానీ తర్వాతి రోజులో దాని పక్కన ఉన్న రైతులు సాగుకోసం దున్నడం వల్ల భూమి ఎక్కువ అయింది. శివారు భూమి దున్నుకొని ఇప్పుడు రికార్డు తక్కువ ఉంది అనేవాళ్ళు చాలా ఉన్నారు.. ఇది ధరణి తప్పా? 17/25
కింది సర్వే నెంబర్లలో 302 లో కంటే భూమి 301 లో ఎక్కువ ఉంది కానీ kasra రికార్డుల్లో 301 లో భూమి తక్కువ ఉంది. 301 లో భూమి ఎక్కువ ఉంది కాని రికార్డు లేదు. ఇది ధరణి వల్ల వచ్చిన సమస్య కాదు..ధరణి వల్ల బయటపడ్డ సమస్య. Paper పహానీలో నడిచింది కానీ సిస్టం allow చేయదు. ఇది ధరణి తప్పా? 18/25
భూ రికార్డులు డిజిటల్ చేసినప్పటి తప్పులు కూడా ధరణి వల్ల బయట పడ్డాయి.. కింది గ్రామ నక్షలో 299 సర్వే నెంబర్ రెండు సార్లు ఉంది...ఇది ధరణి ముందు చేసిన తప్పు కానీ ధరణి వల్ల వచ్చిన తప్పు కాదు.ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉన్నాయి.ఇవి టెక్నికల్ సమస్యలు కానీ ధరణి తప్పు కాదు 19/25
కొందరు వ్యక్తులు అసైన్డ్ భూములు కొన్నారు పహనీల్లో పేర్లు మార్చుకున్నారు, ప్రభుత్వ భూములు మార్చుకున్నారు కానీ దరణిలో అసైన్డ్/ప్రభుత్వ భూములు అమ్మకానికి నిషేధిత జాబితాలో ఉండటం వల్ల ధరణిని దుమ్మెత్తిపోస్తున్నారు...అమ్ముకునే అవకాశం లేక ఆగం అయితున్నారు. 20/25
ప్రభుత్వం 2016 లో సాధబైనమాలు ఉచితంగా చేసింది కానీ కొన్ని లక్షల మంది దరఖాస్తు చేయకుండా అలసత్వం వహించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులపై హైకోర్టు స్టే విధించింది 21/25
2017 లో భూ రికార్డుల సవరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి చనిపోయిన వారి పిల్లల పేర్ల మీద కొత్త పాస్స్బుక్ లు ఇచ్చింది. గ్రామాల్లో అధికారులు ఉన్నారు అయినా చాలా మంది రికార్డు సరిచేసుకోలే.అభ్యంతరాలు తెలపాలని కింది పత్రాలు ఇంటింటికి ఇచ్చింది కానీ కొందరు పట్టించుకోలే.ఇది ధరణి తప్పా? 22/25
భూసమస్యలకు పరిష్కారం సమగ్ర సర్వే అయినప్పటికీ 2007 లో చేసిన పైలట్ ప్రాజెక్ట్ గొడవల వల్ల ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా సమగ్ర సర్వే చేపట్టినా సరే ధరణి చుట్టూ ఉన్న వివాదాలు కంటే ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఘనతవహించిన గత ప్రభుత్వాలు చేసిన ఘనకార్యం అలాంటిది 23/25
2007 భూభారతి సర్వే 👇🏼
ధరణిలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్న మాట వాస్తవం కానీ ప్రపంచంలో ఏ కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన దాన్ని మెరుగుపరచడం ఒక నిరంతర ప్రక్రియ. భూ సమస్యలు ఉన్నాయి వాటికి మొఖ సర్వే/ పంచనామా జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో పరిష్కరించవలసి ఉంది. MRO RDO లకు అధికారం ఇస్తే ఒకటి సరిచేసి ఇంకో పది 24/25
కొత్త సమస్యలు తెస్తారు అని ఇవ్వడం లేదు అనుకుంటున్న.ధరణి వచ్చాక కొందరి అమ్యామ్యాలకు ఆస్కారం లేక ఎలాగయినా ఫెయిల్ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఎవరయిన భూసమస్య ఉంది అని పోతే మేము ఏం చేయలేము,ఆప్షన్ లేదు పోయి కేసీఆర్ ని అడుగు లాంటి మాటలతో అక్కసు వెళ్లగక్కుతున్నారు 25/25 ఇంకా ఉంది 👇🏼
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.