Srikanth KMR Profile picture
Jun 10, 2023 25 tweets 9 min read
Important Thread 🧵
ధరణి వల్ల సమస్యలా ? లేక 70 ఏళ్ల దరిద్రం వల్ల సమస్యలా? అసలు ఇప్పుడు ఉన్న భూసమస్యలు ధరణి వల్ల ఉత్పన్నం అయ్యాయా కింద thread లో వివరంగా ఇవ్వడం జరిగింది. 1/25

#Dharani #Farmers #Telangana Image మొట్టమొదటగా సమగ్ర భూరికార్డులు నిజాం హయంలో ~ 1934 నుంచి ~ 1946 వరకు సేత్వార్ రికార్డును రూపొందించారు. ఇందులో ప్రతి సర్వే నెంబర్, పటం, భూమి వివరాలు ఉండేవి. తరువాత 1953 లో సేటిల్మెంట్ రికార్డు/Kasra తయారు చేసి ప్రతి సర్వే నెంబర్లో కుటుంబ సభ్యుల వాటాలు/వివరాలు నమోదు చేశారు. 2/25 ImageImage