My Authors
Read all threads
#InternationalAuraAwarenessDay
#AuraAwarenessDay
అరా/ఓరా ఒక మనిషి చుట్టూ అల్లుకొని ఉన్న కాంతి తరంగాల(పొర) తాలుకు రంగుల కలయిక మరియు వారి సరీకృత అమరిక. ఇది సాధారణ కంటికి కనపడదు మరియు ఎటువంటి ఎక్సరే మిషన్లకు దొరకదు. మన సనాతన ధర్మంలో యోగ నిద్రలో ఉన్న ఋషివర్యులు
#Aura
#energy
వీటి గురించి ఆధ్యాత్మిక వివరణ ఇచ్చారు. వారు కొన్ని ఏళ్లుగా తపస్సు చేయడంతో వారి చుట్టూ ఒక సానుకూల శక్తి (పాసిటివ్ ఎనర్జీ) నెలకొని ఉంటుంది. దాని వలన తిండి, నిద్ర, కాలకృత్యాలు కూడా లేకుండా జీవించగలరు అని ఎన్నో వివరణలు చెబుతున్నాయి.
లాటిన్/గ్రీక్ పదం అరా/ఓరా అంటే తీసుకునే శ్వాస / వీచే గాలి (జీవ పదార్ధం) అని అర్థం
ఆధ్యాత్మిక ~చక్రార్థ నిరూపణ

(చక్ర విజ్ఞానం/ షట్చక్ర నిరూపణ)

అనాహతచక్రం

ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్సోహం అనాహతాధిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః

ఈ కమలం 12 దళాలు కలది. దీని తత్త్వం వాయుతత్త్వం. అధిదేవత "రాకిని".
ఈమె కం, ఖం, గం, ఘం, ఙం, చం, ఛం, జం, ఝం, ఞం, టం, ఠం అను యోగినులచే సేవించబడుచున్నది.

ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం.
హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని "శబ్దబ్రహ్మం" ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. అనాహత నాదం.
ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు.
దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం చేస్తుంది.

ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని శ్వాసకోశవ్యవస్థతో సంబంధం.
జ్ఞానేంద్రియం చర్మం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే .....
చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధించిన వ్యాదులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది.
ఈ చక్ర మానసిక స్వభావం :

ఈ చక్రం మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు.

ఈ చక్రం తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత అలవడతాయి.
మనోమయ కోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందు ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది.

అనాహతము అంటే చేయబడని నాదం. వెన్నెముకను ఆనుకుని ఛాతికి వెనుక
భాగమే అనాహత చక్ర స్థానం. దీని క్షేత్రం హృదయ స్థానం. ఈ స్థానంలో విష్ణు గ్రంథి ఉన్నది.

మన ప్రమేయం లేకుండా, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రతిరోజూ 21,600 సార్లు అనాహతనాదం జరుగుతూనే ఉంటుంది. అదే "హంస" జపం.
ఈ దళాలకు బీజ మంత్రాలు కం, ఖం, గం, ఘం, ఙం,చం, ఛం,జం,ఝం,ఞం,టం,ఠం...ఈ పన్నెండు దళాలు సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీకలు. ఈ సంవత్సర కాలాన్ని 6 నెలలు ఉత్తరాయణం గానూ, 6 నెలలు దక్షిణాయణం గానూ విభాగించారు.

ఈ చక్రం థైమస్ గ్రంథి స్రావాలను నియంత్రిస్తుంది.
గాయత్రీ మంత్రం లోని సప్త వ్యాహృతులలో ఈ చక్రం యొక్క వ్యాహృతి "ఓం మహః"."మహా నిర్వాణ తంత్రం"లో యోగసాధకుడు, మానసిక ఉపాసన చేయుటకు సరియైన స్థానంగా ఇది చెప్పబడినది. శబ్ద బ్రహ్మముగా చెప్పబడే నాదం ఈ అనాహత చక్రమందు వినిపిస్తుంది.
ఈ చక్ర ధ్యానం వల్ల మనిషి మంచి మేధస్సు, వాక్కులు కలిగి, మంచి పనులను చేస్తూ, విశ్వ ప్రేమాది కారుణ్య భావం కలిగి పూజ్యుడౌతాడు.

ఈ అనాహత చక్రం ఉత్తేజ పరుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక చీకటి గుహలో"బంగారు వర్ణపు దీప కళిక"కనిపించిన అనుభూతి కలుగుతుంది.
ఈ అనాహత చక్రం జాగృతమైనప్పుడు ఇతరుల గురించి తెలుసుకొనే లక్షణం పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగి ఇంద్రియాలపై ఆధిపత్యం వస్తుంది. ప్రేమ తత్వం అలవడుతుంది.

మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు రాకిని అధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి.
స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు.
కుండలినీ శక్తి మేల్కొని అనాహత చక్రాన్ని తాకిన తరువాత ఆ చక్రం చైతన్య వంతమైతే దశవిధ నాదాలు అనుభూతానికి వస్తాయి. క్రమేణా దీర్ఘ ఘంటానాదం అనుభూతం అవుతుంది. నిరంతరం ఓంకార నాదం అనుభూతికి వస్తుంది.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి.
ఇక ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలను, అతి తెలివిని తగ్గించుకొని,
#Chakra
#Kundali
క్రమం తప్పని ధ్యానాభ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ చక్రం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వివరణ..
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
Missing some Tweet in this thread? You can try to force a refresh.

Enjoying this thread?

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just three indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!