అలంకరించే దండలెన్నో తెలుసా.!🙏
తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. అది వేదపండితుల పని అన్న విషయం అందరికీ
1⃣⏩శిఖామణి - శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.
3⃣⏩ కంఠసరి - మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి.
4⃣⏩వక్ష స్థల లక్ష్మి - శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది.
5⃣⏩శంఖుచక్రం - శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.
6⃣⏩కఠారి సరం - శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక
7⃣⏩ తావళములు - రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడ దీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటుంది. రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.
భోగశ్రీనివాసమూర్తికి - ఒక దండ
కొలువు శ్రీనివాసమూర్తికి - ఒక దండ
శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి -3⃣దండలు
శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి -3⃣దండలు
శ్రీ రుక్మిణీ శ్రీక్రిష్ణులకు - 2దండలు
చక్రతాళ్వారుకు - ఒక దండ
అనంత గరుడ విష్వక్షేనులకు - మూడు దండలు
సుగ్రీవ అంగద హనుమంతులకు - 3⃣దండలు
ఇతర విగ్రహమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండలు...
బంగారు వాకిలి ద్వారపాలకులు - రెండు దండలు
గరుడాళ్వారు - ఒక దండ
వకుళమాలిక - ఒక దండ
భగవద్రామానుజులు - రెండు దండలు
యోగనరసింహస్వామి - ఒక దండ
విష్వక్షేనుల వారికి - ఒక దండ
పోటు తాయారు - ఒక దండ
బేడి ఆంజనేయస్వామికి - ఒక దండ
శ్రీ వరాహస్వామి ఆలయానికి - 3దండలు
కోనేటి గట్టు ఆంజనేయస్వామికి - ఒక దండ
అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మల్లెలు, మొల్లలు, మొగిలి, కమలం, కలువ,
గోవింద, గోవింద, ఏడుకొండల గోవిందా...
🎪!卐! ఓం నమో శ్రీనివాసాయ !卐!🎪
🎪॥ॐ॥ ఓం నమో వేంకటేశాయ నమః ॥ॐ🎪