జస్ట్ 5 నిమిషాలకంటే ఎక్కువ టైం పట్టదు చదివి అర్థం చేసుకోడానికి!!
*అరటిపండును తొక్క తీసేసి తింటాం.
*సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.
*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...పై తొక్కతో పాటు
లోపలి గింజలు కూడా వదిలేస్తాం.
*ఆపిల్ లో గింజలు తీసేసి,
*జామ పళ్ళని మొత్తం తినేస్తాం.
*ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.
*ఒక్కోటి ఒక్కో రుచి.
తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు.
అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.
*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే
మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే.
*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.
*కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు..
ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు
పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?
కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా
*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం..
ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం..
*కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!
కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు
శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!!