కుబేరుడు విగ్రహాలు ఉన్న ఆలయాలు ఉన్నాయి. కానీ ప్రత్యేక ఆలయం పెద్దగా తెలిసనవి అయితే లేవు. కుబేరుడు భార్య చిత్రలేఖతోనూ, ఐశ్వర్య స్వరూపమైన శ్రీమహలక్ష్మితోనూ కొలువుతీరిన ఆలయం తమిళనాడులో ఉంది.
బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణాల ప్రకారం పులస్త్యుడి కొడుకైన విశ్వావసు, ఇళల కుమారుడు వైశ్రవణుడు, ఆయనే కుబేరుడు. విశ్వావసు, కైకసిల కుమారుడు రావణుడు. కుబేరుడు లోకంలో వున్న ధనానికంతా అధిపతి.
ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమప్రక్క గుండ్రంగా ప్రతిష్టించబడిన షోడశ (16) గణపతులను చూడవచ్చు. పక్కనే నవ గ్రహాలు భార్యలతో సహా కొలువు తీరారు.
ఎగ్మూరు రైల్వే స్టేషన్ నుంచి చెంగల్పట్ వెళ్ళే లోకల్ లో వెళ్ళి వందలూరు స్టేషన్ లో దిగాలి. దాదాపు గంట ప్రయాణం. టికెట్ 10 రూ.లు. అక్కడ నుంచి ఆటోలలో వెళ్ళవచ్చు. చెన్నై నుంచి బస్సులు కూడా వున్నాయి.