రాయలసీమ ~ Rayalaseema Profile picture
Jun 7, 2020 21 tweets 7 min read Read on X
నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య
తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
తొలి కడప లోక్సభ సభ్యుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
జలరంగ నిపుణులు కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య

వీరి మధ్యన ఉన్న సారూప్యం ఏమిటి ? Image
వివిధ కాలాలు, రంగాలకు చెందిన వీరి పేరు చిరస్థాయిగా నిలిచేలా సీమలోని అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు వీరి పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకువాడుకలో ఒక పేరు (సాధారణంగా ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం/నది పేరు మొ. ) ఉంటె అధికారికంగా మరో పేరు ఉంటుంది.
ఆ ప్రాంతానికి నీరు తేవడానికి కృషి చేసిన రాజకీయ నాయకుడి పేరు అయుండొచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయుండొచ్చు లేదా ఆ ప్రాంతానికి సంబంధం లేని గొప్ప వ్యక్తి అయినా అయుండొచ్చు. ఇప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఎవరెవరి పేర్లున్నాయో చూద్దాం
కోట్ల విజయభాస్కర్ రెడ్డి -

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బ్యారేజ్-సుంకేసుల బ్యారేజ్ తుంగభద్రా నది, కర్నూలు జిల్లా-ఆధునిక సీమలో మొట్టమొదటి నీటి ప్రాజెక్టులలో ఒకటి. ప్రసిద్ధి చెందిన కేసీ కెనాల్ సుంకేసుల నుండే మొదలవుతుంది. జిల్లాకుచెందిన మాజీ CM విజయభాస్కర్ రెడ్డిగారి పేరు పెట్టారు
నీలం సంజీవరెడ్డి -

నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు (శ్రీశైలం ప్రాజెక్టు) - కృష్ణా నది మీద, ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం వద్ద, కర్నూలు జిల్లా (ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు) - రాయలసీమకు చెందిన కృష్ణా నీటి ఆధారిత ప్రాజెక్టులైన గాలేరు-నగరి, తెలుగు గంగ వంటి
ప్రాజెక్టులన్నిటికీ ప్రధాన వనరు - తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టుకు ఈ పేరు పెట్టారు

నందమూరి తారక రామారావు -

NTR తెలుగు గంగ ప్రాజెక్టు - కృష్ణా జలాలను చెన్నై నగర తాగునీటి అవసరాలకు తరలించడానికి, రాయలసీమ - నెల్లూరు జిల్లాల సాగునీటి/
తాగునీటి అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు - 1984లో నాటి ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు NTR, MGR లు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ గార్ల సమక్షంలో శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టు. ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు Image
అనంత వెంకటరెడ్డి -

అనంత వెంకటరెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి - కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి నాలుగు రాయలసీమ జిల్లాల సాగు / త్రాగునీటి అవసరాలకోసం వినియోగించడానికి సంకల్పించిన ప్రాజెక్టు. అంనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, Image
రాజకీయ నాయకుడు, శాసన సభ / శాసన మండలి సభ్యునిగా, అనంతపురం ఎంపీగా వివిధ హోదాలలో పనిచేసిన వ్యక్తి. అనంతపురం జిల్లాకు నదీ జలాల మల్లింపుకు కృషిచేసిన అనంత వెంకటరెడ్డి గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు.

జెసి.నాగిరెడ్డి -

జెసి.నాగిరెడ్డి తాగునీటి పథకం - అనంతపురం జిల్లా
యెద్దుల ఈశ్వర రెడ్డి - యెద్దుల ఈశ్వర రెడ్డి రిజర్వాయర్ (గండికోట రిజర్వాయర్ ) - గండికోట వద్ద - పెన్నా - చిత్రావతి నదులు కలిసే చోటు, కడప జిల్లా - గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో అంతర్భాగం. తొలి కడప లోక్సభ సభ్యుడు, అయిన ఎద్దుల ఈశ్వర రెడ్డి గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు. Image
దామోదరంసంజీవయ్య - సంజీవయ్య సాగర్ (గాజులదిన్నె ప్రాజెక్టు) హంద్రీనది, గాజులదిన్నె గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా) - దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లా ముద్దుబిడ్డ దామోదరం సంజీవయ్య గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి - శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయర్ (బ్రహ్మం సాగర్) - తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగం - బ్రహ్మంగారి మఠం వద్ద, కడప జిల్లా. కాలజ్ఞానాన్నిబోధించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు ప్రాజెక్టుకు పెట్టారు. Image
అన్నమయ్య - అన్నమయ్య ప్రాజెక్టు (చెయ్యేరు నది, బాదనగడ్డ గ్రామం వద్ద, రాజంపేట మండలం, కడప జిల్లా) - తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య రాజంపేట వద్దగల తాళ్ళపాక వాసి. ఆయనపేరే ఈ ప్రాజెక్టుకు పెట్టారు. Image
గురు రాఘవేంద్ర స్వామి-

గురు రాఘవేంద్ర ప్రాజెక్టు/గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇర్రిగేషన్ స్కీం -తుంగభద్రా నది మీదుగా, కర్నూలు జిల్లా- ప్రసిద్ధ మధ్వ మత యతీంద్రులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. వీరి బృందావనం, శ్రీమఠం కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉన్నాయి. వీరి పేరునే ప్రాజెక్టుకు పెట్టారు
పుట్టపర్తి సాయిబాబా - సత్య సాయి గంగ కెనాల్ ( కండలేరు - పూండి కెనాల్ - (నెల్లూరు- చిత్తూరు జిల్లా), తెలుగు గంగ ప్రాజెక్టులో ఒక భాగం) - తిరుపతి పట్టణానికి ప్రధాననీటి వనరు - శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో కాలువ ఆధునీకరణ జరిగింది.
కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య -

K శ్రీరామకృష్ణయ్య పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ -పెన్నానది, కొర్రకోడు గ్రామం, కూడేరు మండలం, అనంతపురం జిల్లా - ప్రఖ్యాత జలరంగ నిపుణులు శ్రీ కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య గారి పేరు ప్రాజెక్టుకు పెట్టరు.
యోగి వేమన -

యోగి వేమన రిజర్వాయర్ - మద్దిలేరు నది (అడవి బ్రాహ్మణపల్లి తాండా, ముదిగుబ్బ, అనంతపురం) - ఇక్కడికి సమీపంలోని కటారుపల్లిలో యోగి వేమన సమాధి ఉంది. ఆయన స్మృత్యర్థం ఈ ప్రాజెక్టుకు యోగి వేమన పేరు పెట్టారు Image
తాతిరెడ్డి నరసింహారెడ్డి -

తాతిరెడ్డి తాతిరెడ్డి నరసింహారెడ్డి రిజర్వాయర్ - మైలవరం డ్యామ్ - పెన్నా నది మీద, మైలవరం గ్రామం, కడప జిల్లా - తాతిరెడ్డి నరసింహారెడ్డి గారు జమ్మలమడుగు శాసనసభ్యునిగా చేశారు.
పూల సుబ్బయ్య -

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు - కృష్ణాజలాలను శ్రీశైలం నుండి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నీటిఅవసరాలకోసం మళ్లించే ప్రాజెక్టు - కమ్యూనిస్ట్ యోధుడు, మార్కాపురం శాసనసభ్యుడిగా చేసిన పూల సుబ్బయ్య గారి పేరు ఈప్రాజెక్టుకు పెట్టారు.
మరికొన్ని ప్రాజెక్టులు :

ఆదినారాయణ రెడ్డి పింఛ ప్రాజెక్టు - పింఛ నది మీద, పింఛ గ్రామం, సుండుపల్లె మండలం, కడప జిల్లా

నీలకంఠాపురం శ్రీరామి రెడ్డి - నీలకంఠాపురం శ్రీరామి రెడ్డి తాగునీటిప్రాజెక్టు (Neelakantapuram Sreerami Reddy PABR drinking water project) - అనంతపురం జిల్లా
కర్టెసీ : ఆంధ్ర పత్రిక , సాక్షి దినపత్రిక
అదనపు సమాచారం - సుధాకర్ గారు

#రాయలసీమ #Rayalaseema_Irrigation #Kurnool #Kadapa #Chittoor #Anantapur #Gandikota #Srisailam #GaleruNagari #TeluguGanga #Mylavaram #Gajuladinne #PABR

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

Jul 23
జులై 23 - #సీమచరిత్రలోఈరోజు

1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు. Image
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
Read 4 tweets
Feb 1
శ్రీశైల ప్రాకారంపై ఉన్న కొన్ని అరుదైన శిల్పాలు

1. ఒక తల - నాలుగు శరీరాలు Image
2. సూర్య చంద్రులు - మధ్యలో చతుర్ముఖ లింగం Image
3. Image
Read 10 tweets
Jul 8, 2023
తెలుగు సాహిత్య సేవలో కట్టమంచి కుటుంబం

కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.

ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
Read 15 tweets
May 18, 2023
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు. Image
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
Read 9 tweets
Apr 1, 2023
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).

తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)

తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
ఎవరా గొప్ప బ్రాహ్మణుడు ?

స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.

'జయన్ గొండచోళమండలం'లోని 'పేరుంబాణప్పాడి'లోని 'వెంకటకొట్టం'లోని 'శిలైనాడు'లోని 'తిరువిప్పిరంబేడు'
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని
Read 5 tweets
Mar 31, 2023
శ్రీశైల పంచ మఠాలు

1. ఘంటా మఠం
2. సారంగధర మఠం
3. భీమాశంకర మఠం
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(