భారతదేశ యుద్ధ విజయాలలో అత్యంత చిరస్మరణీయమైంది 1971 ఇండో- పాక్ యుద్ధ విజయం(బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం ). ఆ యుద్దంలో భారత సైన్యం ఇటు తూర్పున(తూర్పు పాకిస్తాన్), అటు పశ్చిమాన పాకిస్తాన్ సైన్యంతో ఏక కాలంలో తలపడాల్సి వచ్చింది@46Kartheek
భారత దేశం త్రివిధ దళాలతో పాకిస్తాన్ ఓటమి లక్ష్యంగా 1971 డిసెంబర్ లో 'ఆపరేషన్ కాక్టస్ లిల్లీ' మొదలుపెట్టింది. అందులో ప్రముఖ పాత్ర వహించి 1971యుద్ధ సమయంలో చూపిన తెగువకు గుర్తింపుగా 'మహావీర చక్ర' పురస్కారం అందుకున్నారు మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్(అప్పటికి లెఫ్టినెంట్ కల్నల్)
చిత్తూరు వేణుగోపాల్ గారు చిత్తూరు జిల్లా తిరుపతి నివాసి.
గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ కమాండింగ్ అధికారిగా అప్పటికి లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్న చిత్తూర్ వేణుగోపాల్ ఉన్నారు. వీరి నేతృత్వంలో గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ భారత దేశ తూర్పు సరిహద్దులో పాకిస్తాన్ సైన్యంతో తలపడింది.
డిసెంబర్ 4, 1971వ సంవత్సరం తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బాంగ్లాదేశ్) లోని సరిహద్దు ప్రాంతాలైన ఉథాలి, దర్శన ప్రాంతాలలో కట్టుదిట్టమైన శత్రువుల స్థావరాలను వేణుగోపాల్ గారి నేతృత్వంలో గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ స్వాధీనపరుచుకుంది. వేణుగోపాల్ గారు ముందుండి శత్రుసైన్యాల మీద దాడి కొనసాగించారు
రెండు బలమైన స్థావరాలు స్వాధీనంతో వీరు ఆగలేదు, పారిపోతున్న శత్రు సైనికులు తిరిగి బలం పుంజుకోకుండా, అదనపు బలగాలు వారికి సహాయం రాలేని విధంగా మూడు రోజులు దాడి కొనసాగించి జెండియా కూడా స్వాధీన పరుచుకున్నారు
ఈ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, తన బెటాలియన్ ను ముందుండి నడిపించి శత్రు స్థావరాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడినందుకు వేణుగోపాల్ గారికి రెండవ అత్యుత్తమ సైనిక పురస్కారమైన మహావీర చక్ర పురస్కారం లభించింది.
వీరు అందించిన సేవలను గుర్తింపుగా వీరిని పరమ విశిష్ట సేవా మెడల్ కూడా వరించింది. సైన్యంలో అంచలంచలుగా ఎదిగి మేజర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు వేణుగోపాల్ గారు.
1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని