శ్రీశ్రీ చతురోక్తులు.....
శ్రీశ్రీ మాటల్లో శ్లేషలకు కొదవలేదు. సందర్భోచితంగా చతురోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరైనా ఆయన్ని ప్రశ్నించడం పాపం ఠక్కున సమాధానం వచ్చేసేది. వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన సమాధానాలలో కొన్ని...
శ్రీశ్రీ: చావకు అని.
బీదవాడికి, సంపన్నుడికి భేదం?
శ్రీశ్రీ: బీదవాడు ఎప్పటికైనా సంపన్నుడు కావాలని కోరుకుంటాడు. కానీ సంపన్నుడు ఎప్పటికీ బీదవాడు కావాలని కోరుకోడు.
జనన మరణాలమీద మీ అభిప్రాయం..
శ్రీశ్రీ: నా అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ఇంతకుముందు సంభవించాయి.
రాతల్లో బోలెడు నీతిని ప్రబోధించే మీరు నీతిగా ఉంటారా?
శ్రీశ్రీ: ఊరికి దారి చెబుతూ రోడ్ మీద బోర్డ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట మనం వెళ్ళాలి గానీ ఆ బోర్డ్ వెళ్ళదు కదా !
దేశంలో లంచాలు తీసుకునే వాళ్ళందర్నీ ఉరి తీసేస్తే?
శ్రీశ్రీ: లంచాలిచ్చేవాళ్ళు మిగులుతారు.
శ్రీశ్రీ: తమది గుడ్డి నమ్మకం అని తెలియచేయడానికి.
శ్రీనాథుడికీ, శ్రీశ్రీకీ ఉన్న తేడా...?
శ్రీశ్రీ: శ్రీనాథుడి కావ్యాలు చదివి శ్రీశ్రీ ఆనందించాడు. శ్రీనాథుడికి ఆ అవకాశం లేకపోయింది.