“మీరే ఎలాగైనా సాయం చెయ్యాలి. ఎంతో మందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థం చేసుకోలేకపోయారు.“
“ఏవిటో నీ కష్టం?”
“పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి. ఇంతవరకు పేరు పెట్టలేకపోయాము. నెట్ సెర్చ్ చేశాము.
“ఎలాంటి పేరు కావాలి?”
“ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవరూ పెట్టుకోకూడదు."
"సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవడూ పెట్టుకోరు.”
“
“మీ బావగాడి చెంప మీద కొట్టి నట్టుండే పేర్లు చెప్తా రాసుకో! పట్ట పగలు, చిమ్మ చీకటి, మిట్ట మధ్యాహ్నం.
“మా పిల్ల పేరు ఫైనలైజ్ అయ్యే వరకూ ఈ పేర్లు ఎక్కడా లీక్ చెయ్యొద్దు సార్, ప్లీజ్!”
“సర్లే ఎవరికీ చెప్పనులే. అయినా ఎందుకోయ్ అంత టెన్షన్?”
“పిల్లకు పేరు పెట్టే ఉద్దేశమేమైనా ఉందా? అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా? అని రోజూ మా ఆవిడ తిడుతోంది సార్!”
“వేస్టు గాడినంది.”
“వేస్టు అంటే వ్యర్థము. దొరికింది. వ్యర్థ super name!"
“శాన్వి అనీ శ్రాగ్వి అని పెడుతున్నారు కదా, వాటికి అర్థం ఏవిటండీ?”
“బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. కాదేదీ పేరు కనర్హం, అన్నమాట!”
“మీరు శూన్యం లో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్!”
"శూన్య ఇదేదో బాగుందయ్యా!
“నా శ్రాద్ధంలా ఉన్నాయి.”
“ఆహా, శ్రాద్ధ.. new one, ఉండు బుక్కు లో రాసుకుంటా.”
“అలా రొటీన్ పేర్లు పెట్టావో, నువ్వూ మీ ఆవిడా కలిపి ఒకే తాడుకు ఉరేసుకోవాలిన పరిస్తితి వొస్తుంది. ముందే చెప్తున్నా, జనాలు నిన్ను కాకులైపొడుస్తారు.”
“కోప్పడకండి సార్!”
“గురువుగారూ, ఇంతకూ మీ పిల్లల పేర్లు ఏవిటండీ?”
“ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు - సామూహిక, అబ్బాయి పేరు - అత్యాచార్ పెట్టాను. పొద్దున్న లేస్తే పేపర్ నిండా అవే.
“ఖర్మ, గురువుగారూ.. ఎంత బాగుందో. కాపోతే మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి. నాగ ఖర్మ అని పెట్టుకోమంటారా?"
“మళ్ళీ ఇదొకటా?”
“మళ్ళీ ఇదొక దరిద్రమా? one sec.. దరిద్ర.. నాగ దరిద్ర అని పెట్టు”
@threadreaderapp
"unroll "