కాళహస్తి కలంకారీకి చిత్తూరు చాక్లెట్ న్యూట్రిన్ కి సంబంధం ఏమిటి?
కలంకారీ కళను పునరుత్తేజం కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా చేయడంలో ఇద్దరు స్త్రీలు ప్రధాన భూమిక పోషించారు. ఒకరు కమాలదేవి ఛటోపాధ్యాయ కాగా మరొకరు ఎవరు?
బెంగళూరు మహానగరం. ఒక రోజు మూటలో వస్త్రాలు పెట్టుకుని, ఇంటటింటికీ తిరిగి అమ్ముతున్న ఒక వృద్ధుడు ఒక ఇంటి తలుపు తట్టాడు. ఈ నగరంలో అంతటా తాము నిరాదరణకు గురవుతున్నామని, తమని బిచ్చగాళ్లని చూసినట్టు చూస్తున్నారని, సహాయం చేయాలని అర్థించాడు ఆ వృద్ధుడు.
ఆ మూటలోని వస్త్రాలను, వాటి పనితనాన్ని, వాటిని అమ్మడానికి ఆ వృద్దుడు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు ఆ ఇంటి యజమాని. ఆ ఇంటి యజమాని కూతురు పెట్టిన భోజనం తిన్నాక తనలాంటి కళాకారులు చాలామంది ఉన్నారని వారి దీనగాథని వారికి వివరించాడు ఆ వృద్ధుడు.
రాయలసీమకు చెందిన ఒక మహోత్కృష్ట హస్తకళ ఖండాంతరాలకు వ్యాప్తి చెందడానికి ఆ సంఘటన నాంది పలికింది.
ఆ మూటలో ఉన్నవి కాళహస్తి కలంకారీ వస్త్రాలు. ఆ వృద్ధుడు కాళహస్తి కలంకారీ కళలో ఆరితేరిన పురుషోత్తం అనే కళాకారుడు. ఆ ఇంటి యజమాని మరెవరో కాదు, తాను పుట్టిన నేలకు ఏదన్నా చేయాలన్న భావనతో,
దేశంలోనే ఒకప్పుడు పెద్ద కన్ఫెక్షనరీ పరిశ్రమగా ఉన్న న్యూట్రిన్ పరిశ్రమ వ్యవస్థాపకుడైన BV రెడ్డి గారి కుమారుడు న్యూట్రిన్ ద్వారాకనాథ రెడ్డి గారు.
పురుషోత్తం గారిలాగా చాలామంది కళాకారులు సరైన ఉపాధి లేకుండా ఉన్నారని, ఒకప్పుడు మహారాజులు పోషించిన గొప్ప కళ నేడు ఆదరణ లేకుండా పోయిందన్న
విషయం తెలుసుకున్న ద్వారాకనాథరెడ్డి గారు, వారి కుమార్తె అనితారెడ్డి గారు కాళహస్తి కళకు, దానిని నమ్ముకుని ఉన్న కళాకారులకు ఏదైనా చేయాలని సంకల్పించారు.
అప్పటికే ద్వారకనాథరెడ్డి గారు రమణ మహర్షి బోధనలపట్ల ఆకర్షితులై, సమాజ సేవకై ద్వారాకనాథ రెడ్డి రమణార్పణం ట్రస్ట్ ను నిర్వహిస్తున్నారు
వారి కుమార్తె అనితా రెడ్డి విదేశాలలో విద్యనభ్యసించి సమాజానికి ఏదైనా చేయాలన్న ఆశయంతో బెంగళూరుకు తిరిగి వచ్చి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
ఈ సంఘటన జరుగిన మరుసటి దినమే ద్వారాకనాథరెడ్డి, అనితారెడ్డిలు కాళహస్తి బయలుదేరి అక్కడి కళాకారులను కలిసి, పరిస్థితి ఆకళింపు చేసుకున్నారు
వారి అభివృద్ధి కోసం ద్వారక DWARAKA (Development of Weavers and Rural Artisans in Kalamkari Art) ను స్థాపించారు. 1998లో DRRT ట్రస్ట్ సహాయంతో ఏర్పడిన ఈ సంస్థ ద్వారా కళాకారులకు శిక్షణ ఇవ్వడం, కలంకారీ వస్త్రాలు ఇతర ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వంటివి చేస్తున్నారు.
దాదాపు 20 మందితో చెట్టు కింద మొదలైన సంస్థ నేడు కాళహస్తి చుట్టుపక్కల ఎంతోమంది జీవితాలను మార్చేసింది. కలంకారీ కళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టింది
పేదకళాకారుల, పేదప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ సమాజసేవ చేస్తున్న అనితా రెడ్డి గారిని కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది
కొడగట్టిన దీపంలా ఉన్న ఒక గొప్ప కళను పది మంది జీవితాలకు మార్గం చూపే వీధి దీపంలా మార్చడంలో ద్వారక సంస్థ కృషి ఎంతైనా ఉంది.
1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని