కుమారా!
1-అర్జునుడు, 2-ఫల్గుణుడు, 3-పార్ధుడు, 4-కిరీటి, 5-శ్వేతవాహనుడు, 6-బీభత్సుడు, 7-విజయుడు, 8-జిష్ణువు, 9-సవ్యచాచి, 10-ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయని తెలిపారు.
ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడిని, ఎల్లప్పుడూ నా రథానికి తెల్లటి అశ్వాలను మాత్రమే వినియోగిస్తాను కాబట్టి శ్వేత వాహనుడిని,
శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి పరిస్థితిలో కూడా సంయమనం కోల్పోకుండా బీభత్సానికి పాల్పడను కాబట్టి బీభత్సుడిని,
నా మేనిఛాయ తెల్లగా ఉంటుంది కాబట్టి అర్జునుడు,
మా అన్న ధర్మరాజుకు ఎవరైనా హాని కలిగించి దేవతలు అడ్డు తగిలినా వారిని సంహరించక వదలను కాబట్టి జిష్ణువు అనే పేరు వచ్చింది.




