జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక్కో గ్రహ ప్రభావం ఒక గంట భూమిపైన ఉంటుందట. కాబట్టి సూర్యోదయం లో ఏ గ్రహ ప్రభావం ఉంటే ఆ రోజు ఆ గ్రహం యొక్క పేరుతో వారాల పేర్లు పెట్టారు. అది గుర్తు పెట్టుకోవడానికి ఈ క్రింది శ్లోకం తయారు చేశారు.
మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః
ఇక ఇందు తర్వాత నాలుగోది భూపుత్రుడు. భూపుత్రుడు అంటే కుజుడు. ఆయన్నే మంగళ గ్రహం అని కూడా అంటారు. కాబట్టి సోమవారం తర్వాత మంగళవారం. అలా.. వారాల పేర్లు నిర్ణయించారు.
సోమవారం - చంద్రుడు (Moon) ఇందు
మంగళవారం - కుజుడు / అంగారకుడు (Mars) భూపుత్ర
బుధవారం - బుధుడు (Mercury)బుధే
గురువారం - గురుడు (Jupiter) మరేడ్య
శుక్రవారం - శుక్రుడు (Venus) శుక్ర
శనివారం - శని (Saturn) మందా
అనగా పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి.ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి?
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల(హిందువుల) విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. ఆ భాగాలను వారు "హోర" అన్నారు.
ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.
ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. .














