My Authors
Read all threads
పార్ధసారధి పోట్లూరి గారి నుండి ఇంకొక ఆణిముత్యము 🙂

facebook.com/uvnpardha.sara…

చైనా యుద్ధ నీతి ప్రధానంగా రెండు ఆలోచనలతో ఉంటుంది. 1.వుల్ఫ్ వారియర్ డిప్లొమసి [Wolf warrior diplomacy].
2. Salami Slice Tactics.[సలామీ స్లైస్ టాక్టిక్స్].
చైనా వుల్ఫ్ వారియర్ డిప్లొమసి [Wolf warrior diplomacy]:
ఒకవైపు చర్చల పేరుతో అగ్రెసివ్ గా మాటల యుద్ధం చేయడం ఇంకో వైపు తమ బలగాలని అవకాశం కోసం వేచి చూడమని ఉసిగొల్పడం ఇదీ చైనా Wolf warrior diplomacy . అయితే చైనా ఇలా చేయడం మొదటి సారి కాదు.
వియాత్నాం ప్రాదేశిక జలాలలో చైనా చేపల పడవలు వెళ్ళి చేపలు పట్టడం అడ్డువచ్చిన వియాత్నాం కోస్ట్ గార్డ్ పడవలని తమ నౌకలతో బెదిరించి పంపడం గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నదే. చైనా సంగతి తెలిసే మన సైన్యాధికారులు పూర్తిగా బలగాలని తూర్పు లదాఖ్ నుండి వెనక్కి తీసుకోలేదు.
బ్రిగేడియర్ స్థాయి అధికారులతో చర్చలు చేస్తూ కాలయాపన చేయడం చైనా ఎత్తుగడ. దీర్ఘ కాలం లదాఖ్ లాంటి ప్రదేశంలో సైన్యాన్ని మోహరించడం అంటే యుద్ధం చేయడంతో సమానంగా ఖర్చు ఉంటుంది.
నిజానికి యుద్ధం అంటే ఈ రోజుల్లో వారం లేదా పది రోజుల్లో ఫలితం తేలిపోతుంది కానీ యుద్ధం లేకుండా ఘర్షణ వాతావరణం తో ఎక్కువ రోజులు సరిహద్దులవద్ద సైన్యాన్ని మోహరించడం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం.
చైనా నేరుగా యుద్ధం చేయకుండా తమ వైపు దీర్ఘకాలిక ఆవాసాలు నిర్మించడం అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించడం చూస్తుంటే అటు యుద్ధం చేయదు అలా అని చొరబాట్లు చేయకుండా ఆగదు.
తోడేలు తన వేటని అలిసిపోయేదాకా వెంటాడుతుంది ఒకవేళ తన వేట తన కంటే శక్తియమంతమయినది అయితే దాని చుట్టూ తిరిగుతూ ఉంటుంది తప్పితే వెంటనే దాడి చేయదు.
తన వేట ఏ మాత్రం అలిసిపోయి కళ్ళు మూసినా వెంటనే దాడి చేసి గాయపరుస్తుంది మళ్ళీ దూరంగా వెళ్ళి దాని చుట్టూ తిరుగుతూఉంటుంది. తను వేటాడాలనుకున్న జంతువు పూర్తిగా అలిసిపోయిన తరువాత దాడి చేసి చంపేసి తింటుంది.ఈ తంతు ఒక్కోసారి రోజుల తరబడి కొనసాగుతూ ఉంటుంది.దీనినే లోన్ వుల్ఫ్ స్ట్రాటజీ అంటారు
Salami-Slice Tactics: మిలటరీ టర్మ్ లో సలామీ స్లైస్ అంటే ఏదన్నా దేశం తన పొరుగుదేశ భూభాగాన్ని ఒకేసారి ఆక్రమించకుండా కొద్ది కొద్దిగా ముందుకు వెళుతూ అప్పుడప్పుడు ఓ రెండు వందల మీటర్లు ఒక్కోసారి ఓ యాభై మీటర్ల చొప్పున పొరుగు దేశపు భూభాగంలోకి చచ్చుకు ళ్లడం అన్నమాట.
ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగిస్తూ వెళ్ళడం తీరా తమ భూభాగం కోల్పోయిన దేశం దీనిని గుర్తించి ఘర్షణకి దిగితే అప్పటివరకూ తాను ముందుకు వెళ్ళి ఆక్ర మించుకున్న భూభాగమే సరిహద్దుగా అవతలి దేశాన్ని ఒప్పించడం. దీనిని సలామీ స్లైస్ టాక్టిక్ అంటారు.
చైనా పై రెండు విధానాలా ద్వారా మంగోలియా లోని కొంతభాగం, రష్యాలోని కొంతభాగం,ఖజకిస్తాన్ లోని సరిహద్దు ప్రాంతం ఆక్రమించుకొని అవే ప్రస్తుతానికి సరిహద్దులు అనేసింది.
ఇక దక్షిణ చైనా సముద్రం లోని అంతర్జాతీయ జలాలని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ ఆయా దేశాల పడవలు తమ ప్రాదేశిక జలాలలోకి వచ్చాయంటూ వాటిని పేల్చివేసి తన సరిహద్దులని చెప్పుకుంటూ వస్తున్నది. దీనికి విరుగుడు లేదా ?
ఇప్పటివరకు అటు వియాత్నాం కానీ, ఫిలిప్పీన్స్ కానీ, చైనా బలాన్ని చూసి మిన్నకుండా పోయాయి అలాగే మంగోలియా కూడా తమ భూభాగాన్ని ఆక్రమించుకున్నా చూస్తూ ఉండిపోయింది తప్పితే ఏమీ చేయలేకపోయింది.
పై 2 వ్యూహాలని భారత్ చిత్తు చేస్తూ చైనా వ్యూహాలనే సొంతం చేసుకొని చైనా పాఠాన్ని చైనాకే అప్పచెప్పింది భారత సైన్యం.
ఆగస్ట్ 30వ తేదీ అర్ధరాత్రి నుండి ఆగస్ట్ 31 ఉదయం వరకు జరిగిన మిలటరీ ఆపరేషన్ లో భారత సైన్యం కీలకమయిన పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతమ్ మీద నే కాకుండా 1962 చైనా ఆక్రమించుకున్న భూభాగంలో కొంతమేర తిరిగి స్వాధీనం చేసుకుంది.
ఆగస్ట్ 30 తేదీ అర్ధరాత్రి స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ కి చెందిన జవాన్లు పాంగోంగ్ త్సో కి పక్కనే ఉన్న స్పంగూర్ గాప్ అనే ప్రదేశం గుండా ఎత్తైన కొండలని ఎక్కడం ప్రారంభించారు. వెంట తమతో అధునాతనమయిన ఎక్విప్మెంట్ ని మోసుకెళ్లారు.
అసలు ఆ హిమాలయన్ రీజియన్ గురుంచి ముందు తెలుసుకుంటే ఈ కధనం అర్ధమవుతుంది. సముద్రమట్టానికి 4 KMs ఎత్తులో ఉంది ఈ రీజియన్. ఈ స్పంగూర్ గాప్ అనేది రెండు ఎత్తైన కొండల మధ్య ఉన్న ప్రదేశాన్ని [గాప్ అంటే ఖాళీ ప్రదేశం ] స్పంగూర్ గాప్ గుండా వెళ్ళి ఆపరేషన్ పూర్తి చేశారు ,
ఈ ప్రదేశం మన వైపు ఉన్న చిన్న పట్టణం 'చూశూల్ ' కి దగ్గరలో ఉంది. ఈ చూశూల్ పట్టణంలో మన ఫార్వర్డ్ ఎయిర్ బేస్ ఉంది. Su-30 లకి MICA మిసైల్ ని ఇంటిగ్రేట్ చేసింది ఇక్కడ చూశూల్ ఎయిర్ బేస్ లో మోహరించడానికే .
ఎందుకంటే పాంగోంగ్ త్సో ,స్పంగూర్ త్సో [ ఈ రెండు సరస్సులు పక్కపక్కనే ఉంటాయి ] ల మీద దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుంటే చైనా మొదటి దాడి జరిగేది మన ఫార్వార్డ్ ఎయిర్ బేస్ అయిన చూశూల్ మీదనే.
అందుకే మన Su-30 లని అక్కడ సిద్ధంగా ఉంచారు. ఇక పాంగోంగ్ త్సో అనేది చాలా పెద్ద సరస్సు కానీ 2/3 వంతుల సరస్సు చైనా ఆధీనలో ఉండగా 1/3 వంతు భారత్ అధీనంలో ఉంది. ఈ పాఙొంగ్ సరస్సు పక్కనే మరో సరస్సు ఉంది దాని పేరు స్పంగూర్ సరస్సు ఇది పూర్తిగా చైనా అధీనంలో ఉంది.
ఈ రెండు సరస్సులని రెండు పెద్ద కొండలతో పాటు మధ్యలో చిన్న భూభాగం వేరుచేస్తున్నది [రాళ్ళు రప్పలతో నడవడానికి వీలు లేకుండా ఉంటుంది ] ఈ భూభాగం స్పాంగూర్ సరస్సు , పాంగోంగ్ సరస్సుల ని వేరు చేస్తుంది కాబట్టి స్పంగూర్ గాప్ అంటారు.
ఈ స్పాంగూర్ గాప్ గుండానే మన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ జవాన్లు 30 వ తేదీ అర్ధరాత్రి కాలి నడకన ఎక్కడం ప్రారంభించి తెల్లవారుఝామున కాలా టాప్ అనే ఎత్తైన శిఖరం మీదకి చేరుకున్నారు.
అయితే ఈ కాలా టాప్ శిఖరం మీద ఆల్రెడీ చైనా తన కమ్యూనికేషన్ అంటేన్నాలతో పాటు cctv కెమెరాలని అమర్చింది. అక్కడ నలభై మంది సైనికులని కాపలాగా పెట్టింది. పక్కనే ఉన్న మరో కొండపైన తన మానటరింగ్, కంట్రోల్ సిస్టమ్స్ ని అమర్చింది అలాగే ఆ కొండ దిగువభాగంలో రెండు శాశ్వత బేస్ కాంప్ లని నిర్మించింది
ఇక్కడ దాదాపుగా వెయ్యి మందీ సైనికులు ఉన్నారు. అర్ధరాత్రి కొండనేక్కుతూనే మన SFF [Special Frontier Force] జవానులు తమ వీపు మీద మోసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ జామర్స్ ని ఆన్ చేశారు అంటే కొండ ఎక్కేకొద్దీ అవి తమ ప్రభావం చూపడం మొదలుపెట్టేశాయి.
కొండ పైకి ఎక్కే వేళకి ఆ ఎలెక్ట్రానిక్ జామర్స్ తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాయి అంటే కాలా టాప్ కొండ మీద నుండి పక్కనే ఉన్న కొండ మీద ఉన్న చైనా కంట్రోల్ సిస్టమ్స్ కి సిగ్నల్స్ వెళ్లలేదు .
దాంతో కాలా టాప్ మీద అంతా సవ్యంగానే ఉందని భావించారు కానీ మన SFF జవాన్లు మెరుపు దాడి చేసి అక్కడ ఉన్న చైనా సైనికులని బందీలుగా చేసి కాలా టాప్ శిఖరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలా టాప్ శిఖరం అనేది చాలా కీలకమయిన శిఖరం.
కాలటాప్ మీద నుండి అటు పాఙొంగ్ సరస్సు ప్రాంతాన్ని , ఇటు స్పంగూర్ సరస్సు ప్రాంతాన్ని అలాగే చుట్టుపక్కల ఉన్న కొండలు వాటి దిగువ భాగాలని చూడవచ్చు అలాగే ఇక్కడ నుండే మిగతా ప్రాంతాలకి ఆదేశాలు ఇవ్వొచ్చు ,ఇంత కీలకమయిన ప్రదేశంలో ఉంది కాబట్టే కాలా టాప్ అనేది వార్తల్లోకి వచ్చింది.
భారత సైన్యం మిగతా కీలకమయిన ప్రదేశాలని తన అధీనంలోకి తీసుకుంది ఆగస్ట్ 31 తేదీన అయితే ముందు KALA TOP ని మన అధీనంలోకి తీసుకున్న తరువాతే మిగతావి ఆక్రమించుకోవడానికి వీలయింది.
1. కాలా టాప్[KALA TOP ].
2.ముక్పారి [Mukpari ].
3.హెల్మెట్ టాప్ [Helmet Top ].
4.మోల్డో పోస్ట్ [Moldo Post ].
5.మగర్ హిల్ [Magar Hill ].
6.గురుంగ్ హిల్ [Gurung Hill].
7. రెజాంగ్ లా [Rezang La ].
8.పాయింట్ 5157 లతో పాటు
పాంగోంగ్ సరస్సు వద్ద ఫింగర్ పాయింట్ 5 ని కూడా స్వాధీనం చేసుకుంది భారత సైన్యం.

మన సైన్యం ఒక్కో కీలకమయిన ప్రాంతాన్ని తమ ఆధీనలోకి తీసుకుంటూ ఉన్నది దూరం నుండి చైనా సైన్యాధికారులు చూస్తూనే ఉన్నారు కానీ ఏ మాత్రం ప్రతిఘటించలేదు.
కేవలం T-15 లైట్ బాటిల్ టాంక్ ని మోహరించింది తమ వైపు కాగా దానికి ప్రతిగా భారత సైన్య మన T-92 హెవీ టాంక్స్ ని మోహరించింది.
మొత్తం ఆపరేషన్ లో SFF వహించిన పాత్ర మాత్రం మరువలేనిది. SFF తనకిచ్చిన ఆపరేషన్ ని దిగ్విజయంగా పూర్తి చయబట్టే మిగతా వాటిని మన సైన్యం స్వాధీనం చేసుకోగలిగింది. సందేహం లేదు అవతలి వైపు నుండి ఇంటెలిజెన్స్ లీక్ అయితేనే ఇలాంటి ఆపరేషన్ పూర్తిచేయగలం. థాంక్స్ to SFF.
ఈ మొత్తం ఆపరేషన్ వ్యూహ రచన మాత్రం మన General Manoj Mukund Naravane గారి వల్లనే జరిగింది. మనోజ్ ముకుంద్ నరవానే గారు ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే రకం కాదు. వ్యూహ రచన చేయడం దానిని నిశ్శబ్దంగా అమలు చేయడం మాత్రమే ఆయనికి తెలుసు.
ఆపరేషన్ ఇంకా అమలులో ఉంది అది పూర్తయ్యేదాకా ఎక్కువ సమాచారం బయటికి రాకపోవచ్చు. General Manoj Mukund Naravane గారు ఆపరేషన్ పూర్తిగా అమలయ్యే వరకు ఎలాంటి సమాచారం బయటకి రాకుండా జాగ్రత్తగా ఉండాలని తమ ఫీల్డ్ కమాండర్లకి ఆదేశాలు ఇచ్చాడు.
ఇప్పటివరకు భారత సైన్యం స్వాధీనం చేసుకున్నప్రాంతాలు అన్నీ కూడా [ఒక్క ఫింగర్ పాయింట్ 5 తప్ప ] అన్నీ 1962 నుండి చైనా అధీనంలో ఉన్నవే. కొంతభాగం చైనా ఆక్రమిత కాశ్మీర్ కూడా ఉంది.
ఒక్క పూట ఆలస్యం అయి ఉంటే చైనా ఇంకాస్త ముందుకువచ్చి మన ప్రాంతాలని ఆక్రమించుకునేదే కానీ దానికి రివర్స్ లో మన సైన్యం మన పాత భూ భాగాలని స్వాధీనం చేసుకొని చైనా కి షాక్ ఇచ్చింది. సలామీ స్లైస్ కి విరుగుడు సలామీ స్లైస్ + ఇంటెలిజెన్స్ +ధైర్యం + తెగువ.
చైనా కమ్మ్యూనికేషన్స్ ని ఎలక్ట్రానిక్ జామర్స్ తో పనిచేయకుండా చేసి ఆపరేషన్ విజయవంతం చేసిన SFF అభినందనలు. ఇంకా చాలా ఉంది చెప్పడానికి కానీ ఆపరేషన్ అమలులో ఉంది కాబట్టి ఇంతటితో సరిపెడితే బాగుంటుంది.
బ్రిగేడియర్లు ,కమాండర్లు, జెనరల్స్ ,విదేశాంగ శాఖ కార్యదర్శులు,విదేశాంగ మంత్రులు ఇలా అందరితో చర్చల పేరుతో దాదాపు మూడు నెలల సమయం వృధా చేసిన తరువాత చైనాకి ఇప్పుడు తెలిసి వచ్చింది 1962 లో ఉన్న భారత్ కాదు ఇప్పుడున్నది అని. దౌత్య మార్గం మూసివేయడం ఒక్కటే ముందు ముందు భారత్ చేయగలిగేది.
అంటే ఇక చర్చల పేరుతో కాలయాపన, అనవసర ఖర్చు ఉండబోదు. ఇప్పుడు భారత సైన్యం ఉన్న పొజిషన్ చైనా ఆక్రమిత భూభాగాలని తేలికగా ఇంకా ముందుకువెళ్లి స్వాధీనం చేసుకునెంత బలంగా ఉంది. తమ వైపు నుండి సమాచారం ఎలా లీక్ అయ్యిందో చైనాకి ఎప్పటికీ తెలియకపోవచ్చు
ఎందుకంటే కోవర్ట్ ఆపరేషన్స్ చేయడంలో భారత్ సైన్యం వద్ద ఇంకా చాలానే తూరుపు ముక్కలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు ఒక్కో ముక్క బయటకి వస్తుంది తన పాత్ర విజయవంతంగా పోషిస్తుంది.
వుల్ఫ్ వారియర్ డిప్లొమసి , సలామీ స్లైస్ లాంటి వాటిని ఎలా ఎదుర్కోవచ్చో జపాన్,వియాత్నాం, పిలిప్పైన్స్ , థాయిలాండ్, రష్యా, యూరోపియన్ యూనియన్ లు నిశితంగా పరిశీలుస్తున్నాయి. చైనా పైకి కనపడేంత భయకంకరమయినది కాదు అని భారత్ ఒక్కో చర్యతో ప్రపంచానికి చాటి చెప్తున్నది
. అవును చైనా లాంటి గుంట నక్కలకి ఎలా సమాధానం చెప్పాలో భారత్ మార్గదర్శనం చేస్తున్నది.
Missing some Tweet in this thread? You can try to force a refresh.

Keep Current with Saradhi

Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!