[దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు..?

🙏 _ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో.. అతనినే *‘దేవుడు’* అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ? అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే…
పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు…>_

_మన కాళ్ళు.. ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు._

_మన చేతులు.. కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు._

_మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన
పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనేమనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి
వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా.. అని మీరు అడగవచ్చు

_కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు._

_మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు.
చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి *మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా ?* అన్నదే ఈనాటి మన ప్రశ్న >_

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ..
వాటికి అతీతంగా ఉండే *‘పరమాత్మ’* మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే > పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే…_
🌫🌫🌫🌫🌫
_*ఆకాశానికి* ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం._

_*వాయువు* కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ._
🔥🔥🔥🔥🔥🔥
_*అగ్ని* కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు._
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
_*జలము* కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము (రుచి)లు._
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎
_*భూమి* కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు._
_ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి
ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం._
💦💦💦💦💦💦💦💦💦💦💦💦
_*జలము*…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము._
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
_
*అగ్ని*…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది._
🌪🌪🌪🌪🌪🌪🌪🌪🌪🌪🌪
_*వాయువు*…‘రస, గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి,
తన ఉనికిని మనకు తెలియజేస్తుంది._
🌫🌫🌫🌫🌫🌫🌫🌫
*ఆకాశం*…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది._

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు… ఏ గుణము లేని ఆ *‘నిర్గుణ పరబ్రహ్మ’* ఎలా ఈ
భౌతిక నేత్రానికి కనిపిస్తాడు ? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.🙏🙏🙏🌹🌹🌹అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు.
నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే *‘అహం బ్రహ్మాస్మి’* అంటే !
*‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే.
అదే దైవ సాక్షాత్కారం అంటే.
శుభం భవతు.
శ్రీ మాత్రే నమః.
✋✋✋✋✋

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

9 Sep
*మా బాపు...*

గ్రీటింగ్‌ కార్డు, వెడ్డింగ్‌ కార్డు, క్యాలెండర్, పుస్తకాలు, కాఫీ కప్పులు... సర్వం బాపు మయం...ఏ స్తోత్రం చదివినా బాపు బొమ్మే... ఏ పుస్తకం తీసినా బాపు కవర్‌పేజీయే...సినిమాలు తీసి, బొమ్మలు వేసిన *బాపు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారని వారి పిల్లలను అడిగితే...
కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ తమ అనుభవాలను పంచుకున్నారు.*

నాన్న కోసం తాండ్ర తెస్తే, దాన్ని చాకుతో ముక్కలుగా కట్‌ చేసి అందరికీ పెట్టి, తాను చిన్న ముక్క మాత్రమే తినేవారు. సమోసాను కూడా కట్‌ చేసేవారు. ఏ వస్తువునూ డబ్బాలో దాచే అలవాటు లేదు. నాన్నకి బామ్మ చేసే
స్వజ్జప్పాలంటే చాలా ఇష్టం. అందుకే బామ్మ వేడివేడిగా నాన్నకి, మామకి పెట్టమనేది.

నాన్నగారికి ఫలానా పాట ఇష్టం... అంటూ నిర్దిష్టంగా లేదు. ప్రతి పాటలోను అందంగా ఉన్న అంశం గురించి మాట్లాడేవారు. అయితే అప్పుడప్పుడు ‘బంగారు పిచిక’ చిత్రంలోని ‘పో... పోపో... నిదురపో...’ పాటలోని పదాల
Read 16 tweets
9 Sep
భోజన మహాత్మ్యం

@@@

మీరు మీ తాతయ్య తరంవారిని వారి కాలంలో బంధుత్వాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉండేవో ఒకసారి అడిగి చూడండి. మా చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు. వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి. ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు.
ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు. ఇల్లంతా వెతికినా కనిపించవు. అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. అప్పట్లో రోజుకు ఒకటో రెండో
బస్సు సర్వీసులు. కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు. ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు.

రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది. ఇక గత రెండు మూడు
Read 10 tweets
2 Sep
చీర కొంగు తోనే కదా మూడుముళ్ళ బంధం
After the woman becomes mother
*మా అమ్మ (చీర) కొంగు*
.
*ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు.* *ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే.*
*చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం !*
అంతేకాకుండా ..
*పొయ్యి మీద వేడి గిన్నెలను*
*దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*

*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*

*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*

*కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది *అమ్మ కొంగు వెనకే.*
*అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*

*అలాగే వాతావరణం:చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది !*

*వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !*
Read 10 tweets
2 Sep
పెళ్లిసందడి. 1940 కి పూర్వం..😊
కానివ్వండర్రా..మగ పెళ్ళివాళ్ల బండ్లు అప్పుడే పెద్దినాయుడు గారి గరువుకు చేరాయట... ఇంకో ఘడియలో ఊరిపోలిమేరలోకి వచ్చేస్తాయి...
ఆ మేళగాళ్ళేక్కడ తగలడ్డారో... ఎదురు వెళ్ళితీసుకురావద్దూ..
అబ్బాయీ.. కాస్త వంటపందిరిలోకి చూసి.. వంటవాళ్లను తొందరపెట్టు..
విడిదిలోకి పలహారాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారో.. లేదో..
అమ్మా ఆ ముత్తైదువలసింగారం ఎంత వరకొచ్చిందో చూడు.. ప్రతీవాళ్ళూ పెళ్లి తనకే నన్నట్టు తయారై.పోతున్నారేవిటీ... త్వరగాతేమలండీ..
ఊరి పెద్దలు నలుగురూ వచ్చి పంది రిలోకూర్చున్నారు .. .కామేశం..వాళ్ళసంగతి కాస్తచూసుకో నాయనా.. .
ఆరేఅబ్బాయి.. ఒక్కగానొక్క పిల్లదాన్ని.. 6 మైళ్ల దూరమిస్తావా.. ఏమీ..మీఅగ్రహారంలో ఆపాటి పిల్లవాడు దొరక్కపోయాడా..

అయ్యోరూ.. కాగడాల వాళ్ళమండీ.. నాలుగు పాత గుడ్డలిప్పిస్తే మాపనిమీదుంటాం బాబూ..
బావా.. పెట్రోమాక్సు లయిట్లు .. పది తెచ్చాము.. ఈ ఊర్లో అంతకు మించి లేవట...
Read 12 tweets
31 Aug
(శ్రీ ఆచంట సుబ్రహ్మణ్యం గారి రచన ఇది)

*బాల్య స్నేహితుడు.!*

తాడేపల్లిగూడెం పెళ్లికి వచ్చాం. ఊళ్ళో ఊర్వశి థియేటర్లో ఎన్టీఆర్ "రాముడు భీముడు" సినిమా ఆడుతోంది.
మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని వెళ్ళాం.
టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..
ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు.
పలకరించుకున్నాక మా ఆవిడకి పరిచయం చేశాను. నిడదవోలులో ఇంటర్లో క్లాస్మెట్ అని.!

హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.. ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని
ఎలా పోషిస్తాడో కదా పాపం" అంది.
"ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.
వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే. చాలా అల్లరి వెధవ.. సినిమాల పిచ్చి ఎక్కువ.
ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీస్ అయ్యిందో చూడటం.
ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం..
Read 12 tweets
31 Aug
*ఎవరు రాసారో తెలియదు. "అరసున్న" ,(బండి ర) "ఱ" గురించి వాట్సాప్ లో ఎవరో షేర్ చేశారు.*

*అరసున్న [ఁ],*
*బండి 'ఱ' లు ఎందుకు?*

*అరసున్న~బండి ‘ఱ‘ లు*
*నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.*

*ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి.*

*ద్రావిడ భాషా లక్షణాన్ని నిరూపించేవి.*
*అంతేకాదు*
*కావ్యభాషలోను,*
*లక్షణశాస్త్రంలోను*
*వీటి ప్రాముఖ్యం చాలావుంది.*

*వాడకపోతే పరవాలేదు*
*కానీ*
*వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా!*

*మన భాషాసంపదలో*
*ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!*

*అరసున్న, ఱ ల వల్ల*
*అర్థభేదం ఏర్పడుతొంది.*

*పదసంపదకి ఇవి తోడ్పడతాయి.*
*ఎలాగో చూడండి:*
*ఉదా*:-

*అరుఁగు*
*= వీది అరుగు*

*అరుగు*
*= వెళ్ళు, పోవు*

*అఱుగు*
*= జీర్ణించు*

*ఏఁడు*
*= సంవత్సరం*

*ఏడు*
*= బాధ~7 సంఖ్య*

*కరి*
*= ఏనుగు*

*కఱి*
*= నల్లని*

*కాఁపు*
*= కులము*

*కాపు*
*= కావలి*

*కాఁచు*
*= వెచ్చచేయు*

*కాచు*
*= రక్షించు*
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!