ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది.
ఈ కావ్యరచనకు ప్రధాన ప్రేరణ ఆయన చదివిన ‘వసుచరిత్ర’ ప్రబంధవేునట. అందులోని నాయిక సుక్తిమతి ఎలా తన నాథుడు ‘కోలాహలపర్వతాన్ని’ నదీ రూపంతో ఆలింగనం చేసుకుందో ఈ కిన్నెరసాని కూడా తన విభుడి ఆత్మీయ కౌగిలిలో కరిగి నీరై నదిలా ప్రవహిస్తుంది.
వాస్తవ సమాజంలో ‘‘కిన్నెరసాని’’ ఒక వాగు
#తెలం గాణ ప్రాంతంలోని ‘గుండాల’ అడవుల్లో ‘వుర్కోడు’ దాని జన్మస్థలం. అడవులు గుట్టలు గుండా ప్రవహిస్తూ పాల్వంచ సమీపంలోని ‘యానంబయలు’ గ్రామం వద్ద ఒక గుట్టను పెనవేసుకున్నట్టు ప్రవహిస్తుంది. అక్కడే 1966లో జలాశ యం నిర్మించారు.
అక్కడి అడవితల్లి ప్రకృతి సోయగాలు కిన్నెరసాని సొగసులు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం వెరసి పర్యాటకులకు కన్నుల పండుగే!!
జలాశయం దాటిన కిన్నెరసాని ప్రవాహం రాతి తోగుల గుండా ఇసుకతెప్పలు మీదుగా సాగి భద్రాచలం సమీపం లోని భూర్గంపాడు వద్ద గోదావరి ఒడి చేరుతుంది.
ఇక విశ్వనాథవారి ఊహాకావ్యంలో కిన్నెరసాని ఒక తెలుగింటి కోడలు. భర్తను మనసుతో ఆరాధించిన మహాపతివ్ర త. తన దుఃఖాన్ని పోగొట్టుకునే శక్తిలేని ‘ఉద్విగ్నహృదయిని’. తన భర్త కూడా అంతే అనురాగవంతుడు. కాని తల్లి తన భార్యపై వేసే నిందలకుగాని, ఆమె పెట్టే ఆరళ్లకుగాని ఎదురు చెప్పలేని
తల్లి బారి నుంచి భార్యను కాపాడుకోలేని ద యాహీనుడు అతడు. చివరకు అత్తగారు పెట్టే ఇబ్బందులు భరించడం కిన్నెరసానికి కష్టైమెంది. కళ్లతో గాక హృదయం తో దుఃఖిస్తుంది. ఆమె భర్త అటు తల్లిని కాదనలేడు, ఇటు భార్యను ఓదార్చలేడు.
నిస్సహాయ స్థితిలో కిన్నెరసాని అడవుల వెంట పరిగెడు తూ అత్తింటి కష్టాలకు దూరంగా పారిపోతుంది. భర్త తనను విడిచి ఎక్కడకూ వెళ్లవద్దని తను కూడా ఆవెువెంట వచ్చి వె నుక నుంచి పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తాడు. వేణీబంధా న్ని పట్టబోతే నీరైతాకింది.
చీరకొంగు పట్టబోతే అదీ నీరై తగిలింది. వాగు కనుక అది నీరే. కాని వాగును స్త్రీగా మాననీకరించి, ఆ స్త్రీ దుఃఖంతో నీరైందని చెప్పడంలో విశ్వనాథ వారి భావనాశీలత అగుపిస్తుంది.
చివరికి కిన్నెర భర్త కౌగిలిలో కరిగి నీరై ప్రవహించింది. భర్త భార్య కోసం శోకించి చివరికి శిలగా మారిపోతాడు. తన కౌగిలి నుంచి జారి వాగుగా మారిపోయి వేగంగా సాగిపోతున్న కిన్నెరను చూసి ఆమె భర్త దుఃఖిస్తూ ఆమెను పిలవడంతో కథ మొదలవుతుంది.
#కిన్నెర మానవత్వం నుండి నదీత్వం పొందింది. ‘నాయిక నదిగా మారడవేు’ ఇందులోని చమత్కారం. నదిగా మారిన కిన్నెరసాని జలలక్షణాలతో ప్రవహిస్తుంది. కాని తన హృదయరేడు అయిన భర్తను విడువలేక గుట్టగా మారిపో యిన భర్తను భారంగా చూస్తూ వెనక్కి తిరిగి తిరిగి పరికిస్తూ ముందుకు పరుగులు తీసింది.
అప్పుడే తనలోని సహజలక్షణాైలెన నృత్యం - సంగీతం వ్యక్తీకరణలు మొదలై, వీనులవిైందెన కిన్నెరసాని గానం వెలువడుతుంది. దూరాన గల సముద్రుడు పారవశ్యంతో పరవశించి నదీరూపంలో గల ‘కిన్నెర’’ రాక కోసం అనురాగంతో పరితపిస్తాడు.
#నదీరూపం దాల్చిన కిన్నెర గుణం చేత మహాపతివ్రత సముద్రం ఆరాటపు పొంగును చూసి దిగులుపడి తనలోతా నై ఏడ్చింది. అంతలోనే తెలివి తెచ్చుకుని సముద్రుని భార్య అయిన గోదావరి ఒడిలో మాతృప్రేమ కొంగున కట్టుకుని చేరి అమ్మను చేరిన కూతురిలా తృప్తి చెందింది.
అలా గోదారమ్మను చేరిన ‘కిన్నెరసాని’ శాంతించి దుఃఖానికి దూర మైంది. నిత్యం భద్రాద్రి రాముని పాదపూజలో భాగమై రామభక్తులకు చల్లని నీడ - నీరు అందిస్తూ పుణ్యవతిగా అలరారింది అంటూ కిన్నెరసాని పాటలకావ్యం పరిసమాప్తి చేస్తారు విశ్వనాథ సత్యనారాయణ..
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
-రజాకార్లు మెట్టుగూడ !
(Dr. #Shrimati Suri, Surgeon, Secunderabad, గారి
అనుభవం వారి మాటల్లో)
@ 1948 ప్రథమార్థంలో ... ఒక రోజు మధ్యాహ్నం నాన్నకి ఒక ముస్లిం స్నేహితుడు చెప్పాడు: "దీక్షితులు గారు, ఈ రాత్రి రజాకార్లు మెట్టుగూడ ప్రాంతంలో హిందూ కుటుంబాల మీద దాడి చేయాలనుకుంటున్నారు.
మీరు జాగ్రత్తగా ఉండండి ..." నాన్న ఇంటికి వస్తూనే చెప్పారు. "ఈ రాత్రికి మనం మన ఇల్లు వదిలేస్తున్నాం. అంతా సవ్యంగా జరిగితే తిరిగి మన ఇంటికి వస్తాం. లేదంటే లేదు. ...!!" తెలంగాణ అంతా రజాకార్ల దురాగతాలతో అట్టుడికిపోతోంది.
వేలాది హిందువుల కుటుంబాలు బలైపోతున్నాయి. నిద్రలోనే నరికివేయబడిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. . హిందువులు ఎక్కడ ఉన్నా రజాకార్ల దాడి వార్తలతో భయపడి పోతున్నారు. నిజాం ప్రభుత్వమే రజాకార్లను పోషిస్తోందన్న ప్రచారంతో హిందూ కుటుంబాలు వణికిపోతున్నాయి... అప్పుడు మేం మెట్టుగూడలో ఉండేవాళ్ళం.
🚩🚩
ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను.
♥ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
🚩
క్రింద చెప్పిన మంత్రమును చదువుతూ ముమ్మారు సూర్యునకు అర్ఘ్యము నీయవలెను.
దశావతార స్తుతి:-10.-
(కల్కి అవతారం .)
-
"శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!
-
-
కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము.
కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన.
కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం.
కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావు.
🚩🚩🚩♥-సత్యం -శివము - సుందరం -♥🚩🚩🚩
సత్యం:-
➡ మన జన్మ ని మనమే ఎన్నుకుని వచ్చాము. సృష్టి జగదీశ్వర సంకల్పం.
➡ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అందరికీ ఈశ్వరుడే గురువు.
➡ ఒకరు ఇంకొకరిని, ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఉన్నది ఈశ్వరుడు మాత్రమే.
➡ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. జగజ్జీవేశ్వరులుగా ఉన్నదంతా బ్రహ్మమే.
➡ మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే. మనమంతా లేనివారమే.
జ్ఞానం:-
➡ అందరి దగ్గర నుండి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. జగజ్జనని శివజ్ఞాన ప్రదాయిని.
➡ సమయం క్షణమైనా వృధా ఎప్పుడూ చేయరాదు. కాలమే భగవత్స్వరూపము.
➡ శక్తి అణుమాత్రమైనా వృధా ఎప్పుడు చేయరాదు. అణువునందు మహత్తునందు నిండి ఉన్నది పరమాత్మయే.
➡ ఈ వర్తమాన జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవాలి. దక్షిణామ్మూర్తి కృపచే మౌనవ్యాఖ్యను పొందాలి.
అనంతం :
🚩కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ .
రెండు రోజుల క్రితం #ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ఇచ్చిన వాక్సిన్ ని రాష్ట్రాలు వృధా చేస్తున్నాయని అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
దీనిమీద కొంతమంది చదువుకున్న శుంఠ లు పోస్టలు పెడుతూ అలా ఎలా వృధా అవుతాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
.
1.కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండు వాక్సిన్లు వరుసగా 5ml మరియు 10ml వయాల్స్ [Vial అంటే సీసా l లలో వస్తాయి. 2. ఒక్కో వ్యక్తికి వాక్సిన్ ఇవ్వాల్సిన పరిమాణం 0.5 ml ఒక డోసు గా ఇవ్వాల్సిఉంటుంది. కోవాక్సిన్ 5 ml వయల్ లో వస్తుంది
కాబట్టి 10 మందికి 0.5 ml డోసులు ఇస్తే ఒక సీసా అయిపోతుంది అలాగే కొవీషీల్డ్ అయితే 20 మందికి సింగిల్ డోస్ గా ఇవ్వవచ్చు. 3. ఒకసారి వయాల్ ఓపెన్ చేస్తే 4 గంటలలోపే వాడేయాలి ఆ తరువాత ఆ సీసా లో ఉన్న వాక్సిన్ చెడిపోతుంది.