పల్లవి : నా మనసు, చిత్తము, బుద్ధి ఇవన్నీ పెద్ద పెద్ద వేప చెట్లలాగా నేనే వాటికి పాలు పోసి పెంచాను. ఇక వాటి ఫలాలు చేదుగా కాక తీయగా ఉంటాయా?
చరణం 1: చెక్కతో చేసిన బద్దలు పెట్టి కుక్క తోక కట్టి పెట్టినా దాని వంకర పోనట్టు గా ఈ దేహపు సహజ వికారము ఎంత చెప్పినా బుద్ధి వినిపించుకోదు.
చ2: ఒక మూల, నీటిలో నానబెట్టినా గొడ్డలి ఎలా కఱకుగా ఉంటుంది కానీ మెత్తపడదో అలా మహా పాతకాలు చేసినట్టి చిత్తం నాది. ఎంత వంచినా వంగదు, మాట వినదు.
చ3: తేలు కోకలో చుట్టుకుంటే ఊరికే ఉండక పదే పదే ఎలా
కుడుతుందో అలాగే వేంకటేశ్వరుని కృప లేక ఘోరమైన ఆశ ఎప్పటికీ నీకు మేలు సోకనివ్వదు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh