ఒక #పత్రికకు ఒకాయన ఇలా #ఉత్తరం రాశారు.
" నేను 30 సంవత్సరాల నుండి ప్రతి రోజూ గుడికి వెళ్తున్నాను,
ఈకాలంలో నేను ఒక 3000 మంత్రాలు విన్నాను . ఒక్కటీ గుర్తు లేదు. నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను అనిపిస్తోంది .
గురువులు వారి సేవలు కూడా వృధా అయ్యాయి . అందువలన గుడికి వెళ్ళడం అనవుసరం అని నేను చెబుతున్నా "
లెటర్స్ టు ది ఎడిటర్ -- లో ఈ చర్చ ఒక పెద్ద చర్చగా అనేక వారాల పాటు సాగింది . చివరికి ఒకాయన ఇలా రాశారు
నేను 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాను . అప్పటి నుండి ఇప్పటికి మా ఆవిడ 32000 మీల్స్ వండి ఉంటుంది . ఏరోజు ఏమి వండిందో నాకు ఒక్కటీ గుర్తు లేదు . కానీ నాకు ఒకటి తెలుసు .
నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆ వంటలే ...
లేక పోతే నేను చనిపోయి ఉండేవాడిని భౌతికంగా ,
అల్లాగే నేను రోజూ గుడికి వెళ్ళక పోతే ఆధ్యాత్మికంగా నేను చనిపోయినట్టే "
" #మనందిగజారిపోకుండా#పైకి#ఎత్తుతున్నదిఆయనే "
(ఓ మిత్రుడు పంపిన పోస్ట్)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh