అంటే, చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగంలో ఉండే 64 గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా !
2 ^ 0 + 2 ^ 1 + 2 ^ 2 + ......... 2 ^ 63
ఇది మొత్తం కూడితే చాలా పెద్ద సంఖ్య వస్తుంది.
దానికి పద్యరూపంలో ఇచ్చిన జవాబు:👇
శరశశి షట్కచంద్ర శరసాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేదగిరి తర్కపయోనిధి పద్మజాస్య కుం
జరతుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరనగు రెట్టి రెట్టి తగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్.
ఇందులో కవి అంకెలకి బదులుగా కొన్ని సంకేత పదాలు ఉపయోగించాడు. వాటి అర్ధాలు తెలుసుకుని వరుసగా అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది . ఐతే, అంకెలను వెనుక నుంచి, అంటే, కుడి నుండి ఎడమకు వేసుకుంటూ వెళ్ళాలి. పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు..
ఈ సంకేత పదాల అర్ధాలను అనుసరించి వెనుక నుండి అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది!
ఆ సంఖ్య ఇదే 👇
18446744073709551615
సేకరణ: #అంతర్జాలం
గణితాన్ని ఇలా సాహిత్య రూపంలో నేర్పించడం ద్వారా వారు మరింత ఆసక్తిగా నేర్చుకుని బహుముఖ ప్రజ్ఞావంతులౌతారు. గణితంతో పాటు సాహిత్యం కూడా అబ్బుతుంది.