"క్రైస్తవం పైన దాడులను వ్యతిరేకిద్దాం" from మత తత్వం పై బాలగోపాల్
"ముస్లింల వంతు అయింది. ఇప్పుడు (క్రైస్తవుల వంతు వచ్చింది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా బిజెపి బలంగా ఉన్న రాష్ట్రాలలో కైస్తవులపైన దాడులు ఒక పరంపరగా జరుగుతున్నాయి. కొన్ని దాడులు సాధారణ గూండాలు, రౌడీలు చేయగా కొన్ని
విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్
కార్యకర్తలు చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే 'సంఘ్ పరివార్' కార్యకర్తలు చేస్తున్న
'దాడులనే కాక రౌడీ మూకలు చేస్తున్న అకృత్యాలను కూడా 'హిందువుల న్యాయమైన
ఆగ్రహం' పేరిట సంఘ్ పరివార్ నాయకత్వం వెనకేసుకొస్తున్నది.
క్రైన్తవ మిషనరీలు సంఘసేవ పేరిట రకరకాల ప్రలోభాలు చూపించి హిందువులను క్రైస్తవులుగా.
మారుస్తున్నారనీ దానికి ఆగ్రహించిన హిందువులు ఈ దాడులకు పాల్పడుతున్నారనీ విశ్వహిందూ పరిషత్ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
జాబువా రేప్ ఘటనను సహితం 'ప్రేం' అనే ముద్దు పేరున్న విశ్వహిందూ పరిషత్ నాయకుడు బిఎల్ శర్మ ఇదే విధంగా సమర్థిస్తూ మాట్లాడడం అద్వానీని
సహితం ఇబ్బంది పెట్టింది. దేనికీ సులభంగా సిగ్గుపడని అద్వానీ, శర్మ వ్యాఖ్యను తాను ఖండించకపోయినా దానిని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని
విశ్వహిందూ పరిషత్‌కు సూచించాడంటే సంఘ్ పరివార్ దురహంకారం ఎక్కడిదాకా పోయిందో అర్ధం అవుతుంది.
జాబువా జిల్లా (మధ్యప్రదేశ్) లోని భండారియా గ్రామంలోని క్రైస్తవుల కాన్వెంట్పైన సెప్టెంబర్ 22-28 (1998) తేదీల మధ్యరాత్రి 10 లేక 15 మంది దుండగులు దాడి చేసి కాన్వెంట్ తలుపులు పగలకొట్టి
TW: Rape
నలుగురు క్రైస్తవ సన్యాసినులను (నన్స్) బలవంతంగా బయటకు గుంజుకుపోయి రేప్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగడం కొత్త కాదు. దానికి ఒక పార్టీనో ఒక సంస్థనో తప్పు పట్టలేం. అయితే విశ్వహిందూ పరిషత్ నాయకుడు శర్మ ఈ దౌర్జన్యాన్ని 'హిందువుల న్యాయమైన ఆగ్రహంలో భాగంగా జరిగిన చర్య”
అని సమర్థించినప్పుడు, సంఘ్ పరివార్ అనాగరికతను అసహ్యించుకోకుండా ఉండలేము. ప్రత్యక్షంగా వారి ఆధ్వర్యంలో జరిగిన ఇతర దాడులను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము.
మార్చి 4వ తేదీన గుజరాత్‌లోని బరోడా నగరంలో జరుగుతున్న ఏసు మహోత్సవంపైన
విశ్వహిందూ పరిషత్కూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కూ చెందిన 200 మంది కార్యకర్తలు దాడిచేసి మైకులు విరగ్గొట్టి వేదికకు నిప్పుపెట్టి వేదికపైన ఉన్నవారిని కొట్టారు.
మే 28 న అహ్మదాబాద్‌లోని సెయింట్ మేరీ స్కూలుపైన బజరంగ్దళ్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
ఇలాంటివి ఇంకెన్నో లెక్కలేనన్ని ఘటనలు.
సంఘ్‌పరివార్ ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ ఘటనలేకాక ఎవరో గూండాలు, రౌడీలు చర్చిల మీద, కాన్వెంట్ల మీద దాడులు చేసి హత్య, రేప్ వంటి ఘాతుకాలకు
పాల్పడిన ఘటనలు కూడా గత అయిదు సంవత్సరాలలో 17 జరిగాయని క్రైస్తవ
సంస్థలు అంటున్నాయి.
వీటికి హిందూత్వవాద సంస్థలు ప్రత్యక్షంగా బాధ్యులయినా కాకున్నా ఆ దృక్పథం గల బిజెపి, శివసేన అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికార
యంత్రాంగం మైనారిటీల రక్షణ విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఈ దాడులకు దోహదం చేస్తున్నది.
సంఘ్‌పరివార్ పెద్దలు [క్రైస్తవ వ్యతిరేక విద్వేషాన్ని రెచ్చగొట్టుతుండడం వీధి రౌడీలకూ గూండాలకూ పరోక్షంగా ప్రోత్సాహకంగా.
వుంది.
ఈ దాడులు దేనికి?
సంఘ్‌పరివార్ తాను చేస్తున్న దాడులకూ విష ప్రచారానికీ గల కారణాన్ని దాచిపెట్టుకోవడం లేదు. క్రైస్తవ సంస్థలు సంఘసేవను అడ్డం పెట్టుకొని మత మార్చిడి చేస్తున్నాయనేది వారి ప్రధాన అభియోగం. ఇది తమ ఇల్లు చక్కబెట్టుకోలేక పరులను నిందించడం తప్ప వేరే ఏమీ కాదు.
సంఘ్‌పరివార్ దృష్టిలో క్రైస్తవం విదేశీ మతం. క్రైస్తవులు విదేశీయులు. వాళ్లను ఇక్కడినుండి తరిమేయడానికి చేస్తున్న ఉద్యమానికి బజరంగ్దళ్ రెండవ క్విట్ ఇండియా ఉద్యమం అని పేరు పెట్టింది. ఇంతకంటే హాస్యాస్పదమైన వ్యాఖ్య వేరే ఏదీ వుండదు.
క్రీన్తు చనిపోయిన కొద్ది కాలానికే (క్రైన్తవం
భారతదేశంలోకి ప్రవేశించింది. దాదాపు 2000 సంవత్సరాలుగా ఇక్కడ ఆ మతం వుంది. ఈ రోజు ఇక్కడున్న క్రైస్తవులంతా (క్రైస్తవ ప్రజలే కాదు, సంఘ్ పరివార్ చేతిలో దెబ్బలు తింటున్న ప్రచారకులు కూడ) ఈ గడ్డకు చెందిన వారే తప్ప ఏ
అర్ధంలోనూ విదేశీయులు కారు.
నిజానికి క్రైస్తవులలో అధికభాగం దళితులు, ఆదివాసులు కాబట్టి ఎప్పుడో జరిగిన చరిత్రను బట్టి దేశంలో కొంతమందిని మూలవాసులుగానూ కొంతమందిని విదేశీయులుగానూ విభజించదలచుకుంటే ఆర్య సంతతిగా తమను తాము భావించే హైందవ ఆధిపత్యకులాల కంటే, క్రైస్తవులే అసలయిన మూలవాసులు అవుతారు.
ఎవరి ఇష్టమొచ్చిన మతం వారు అనుసరించవచ్చుననేది భారత రాజ్యాంగం 25వ అధికరణంలోని ప్రాథమిక హక్కు అనుసరించడమే కాదు, ప్రచారం చేసుకోవడం కూడ అధికరణ 25 ప్రకారం ప్రాథమిక హక్కే పాశ్చాత్య దేశాలలోనూ
ఇటువంటి స్వేచ్చ ఉంది. దానిని అనుసరించి, అక్కడ నివాసం ఏర్పరచుకున్న హిందువులు
(అత్యధిక భాగం ఆధివత్యకులాలకు చెందినవారే) గుళ్ళు కట్టుకుంటున్నారు. హైందవ మతప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇక్కడి క్రైస్తవులు అదే పని చేస్తే తప్పేముంది? తప్పుందని అనలేరు కాబట్టి కొత్త వాదన తీసుకొస్తున్నారు. భిన్న మతాల తాత్విక సిద్ధాంతాలను అర్ధం చేసుకొని మతం మార్చుకుంటే ఫరవాలేదుగానీ
ప్రలోభాలకు లోనయి మతం మార్చుకోవడం తప్పని
వాదిస్తున్నారు. క్రైస్తవమిషనరీలు ప్రజలను ప్రలోభపెట్టి క్రైస్తవంలో చేర్చుకుంటున్నారని నింద వేస్తున్నారు. కాని మతమంటే కేవలం తాత్విక భావాలు కాదు. ప్రతీ మతంలోనూ.
ఒక జీవనవిధానం ఇమిడి వుంటుంది.
హైందవం మతం కాదనీ అదొక జీవన విధానమనీ హిందూత్వవాదులు వేరే సందర్భంలో గొప్పలు చెప్పుకుంటారు. మరి 'హైందవ జీవన విధానంలో అణచివేయబడ్డవారు, వెలి వెయ్యబడ్డవారు వేరే
మతంలోకి పోతే తప్పేముంది? అక్కడ ఎక్కువ ఆత్మగౌరవం దొరుకుతుందని నమ్మితే తప్పేముంది?
వారికి ఆత్మగౌరవం ఇవ్వడమే వారిని ప్రలోభ పెట్టడమా?
భారత దేశంలో ప్రధానంగా దళితులు, ఆదివాసులే క్రైస్తవంవైపు ఆకర్షించబడదానికి ఇదే కారణం కాదా? వాళ్లనసలు హిందువులెప్పుడయినా హిందువులుగా
భావించారా?
నిజానికి ఈ రోజు క్రైస్తవ మత సంస్థలు మత మార్చిడి చేస్తున్నది తక్కువే. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా దేశ జనాభాలో కై స్తవులు 2.3 శాతం (1998) మాత్రమే వున్నారు. ఎక్కువ భాగం కైస్తవ సంస్థలు విద్యా వైద్య రంగాలలోసమాజానికి సేవ చేస్తున్నాయి.
ఒక్క క్రైస్తవులకే కాదు, ఈ సేవలు అందరికీ అందిస్తున్నాయి. దీనిని సమాజ సేవగా గుర్తించకుండా ఉండడం మూర్ఖులకు మాత్రమే సాధ్యం. మతమార్పిడి చేసిన చోట కూడ హైందవ సమాజం వెలివేసిన
దళితులకు ఆత్మగౌరవం అందించడంతో పాటు కొంత చదువు నేర్పించి వారి సామాజిక ప్రతిపత్తిని కొద్దిగానయినా పెంచారు.
ఇది సమాజ సేవ కాక ఏమవుతుందో హిందూత్వవాదులే చెప్పాలి. కారణాలు ఏవి చెప్పుకున్నా ఈ దాడులు బిజెపి హిడెన్ అజెండాలో భాగం, సంఘ్‌పరివార్ బహిరంగ అజెండాలో భాగం. ఈ నేల మీద హైందవ ఆధిపత్యం
నెలకొల్పడం వారి అజెండాలోని ముఖ్య అంశం. దాని కోసం ముస్లింల పైన దాడులతో మొదలుపెట్టారు.
ఇప్పుడు క్రైస్తవుల పైన దాడులతో కొనసాగిస్తున్నారు.
ఇది దళితుల పైన దాడి కూడ. దేశంలో భిన్న సంస్కృతులు కలిసిమెలిసి సహజీవనం
చేయాలనీ, తమ జీవితాలు ఏ మతంలో బాగుంటే ఆ మతంలోకి మారడానికి ప్రజలకు - ముఖ్యంగా అణగారిన కులాలకు - స్వేచ్చ ఉండాలనీ నమ్మేవాళ్లందరూ
ఈ దాడులను, దుష్ప్రచారాన్ని
వ్యతిరేకించాలనీ, దాడులకు గురి అవుతున్న క్రైస్తవ
మత ప్రచారకులకూ సేవకులకూ అండగా నిలబడాలనీ పిలుపునిస్తున్నాం.
Why are so many Indians supporting Israel?
Here's what Balagopal wrote in 2001 about Indians supporting United States' war on terror:
"For many in India, there is an even less defensible reason for wanting to egg the US on: the
muslims should be taught a lesson."
"It is even being said by influential columnists that there is Islamic terrorism in the world because Islam is terror, and the faster the world realises this the better. One does not have to quote from the Quran to answer this."
"One does not have to argue abstractly that religion by itself does not make any body violent. It is a fact of history that organized violence to subserve their ends, noble as well as ignoble, has been perpetrated by armed groups of all communities."
"This is about the 'trial' so-called.
Meanwhile, in prison, the political
prisoner again suffers a regime that is
palpably different-and much 'more
undemocratic-than that the non-political
undertrials suffer. Prisons are supposed
to be governed by manuals of rules; (1/4)
these rules usually differ slightly from state to state but all of them belong to a subterranean world that has not heard of things like justice and fundamental rights. The hallmark of the manuals is a total arbitrariness: rules of discipline, procedures for inquiry and (2/4)
award of punishment are all arbitrary. And thus, without any need to
define new prison rules for political
prisoners, they can be and are being
treated as a different category of prisoners
to whom even the minimum rights available to ordinary undertrials are not
available." (3/4)