విశాఖపట్నంలో ఇటీవల మరణించిన డాక్టర్ సుధాకర్ గారికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.(1/5) #DalitLivesMatter
జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడు. ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు శాడిస్ట్ జగన్ రెడ్డి. దళిత డాక్టర్ సుధాకర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ @ysjagan బలితీసుకున్నాడు.(2/5) #DalitLivesMatter
డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం ఆయన పై కక్ష కట్టింది. నడి రోడ్డు పై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారు.పిచ్చోడనే ముద్ర వేసారు.డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హై కోర్టుకి నివేదిక అందజేసింది.(3/5) #DalitLivesMatter
న్యాయం జరిగే లోపే ఆయన చనిపోవడం బాధాకరం. డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి న్యాయం చెయ్యాలి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే కాబట్టి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం కుటుంబానికి అందజేయ్యాలి. ఇప్పటికైనా దళితులపై దాడులు ఆపాలి.(4/5)
అంబెద్కర్ రాజ్యాంగాన్ని అమలు చెయ్యాలి.రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెత్త బుట్టలో వేసి శాడిస్ట్ జగన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు.(5/5) #DalitLivesMatter
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh