నేడు తెలుగువారికి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలంగాణ వైతాళికుడిగా సుపరిచితులైన సురవరం ప్రతాపరెడ్డి గారి ౬౮వ వర్ధంతి. నిజాం నిరంకుశత్వ పాలనలో మ్రగ్గుతున్న తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన "గోల్కొండ పత్రిక" కు ఆయన సంపాదకత్వం వహించారు.
తెలంగాణలో అసలు తెలుగు కవులు లేరంటూ ఎవరో విమర్శిస్తే, దానికి సమాధానంగా ఆయన తెలంగాణ ప్రాంతమంతటా పర్యటించి, ౩౫౪ మంది కవుల, రచయితల వివరాలను సేకరించి "గోల్కొండ కవుల సంచిక" అనే పేరుతో ప్రచురణ చేశారు.
తెలుగువారి సాంఘిక చరిత్రను తెలుపుతూ ఆయన పరిశోధన చేసి, రాసిన మహత్తరమైన సాధికారిక గ్రంథం "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న తొలి తెలుగు పుస్తకంగా చరిత్రగాంచింది.
ఇంకా ఆయన చేసిన రచనల్లో "రామాయణ విశేషాలు," "హిందువుల పండుగలు," "హైందవ ధర్మవీరులు," “మొగలాయి కథలు” చాలా ప్రసిద్ధిగాంచాయి.
సురవరం గారు రచయితగా, పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా, సాంఘిక చరిత్రకారుడిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు.
ఈ వర్ధంతి సందర్భంగా ఆయన తెలుగునాట వివిధ రంగాల్లో చేసిన విశిష్ట కృషిని స్మరించుకుంటూ, ఆయన సాహితీ సంపదకు వారసులుగా తెలుగువారిమైన మనమందరం ఆయన వలె మేధస్సుని పెంపొందించుకుందాం.
Today is 68th vardhanthi (death anniversary) of Suravaram Pratapa Reddy garu who is well-known to Telugus as a multi-faceted personality and a torch bearer of Telangana.
He was the editor of the journal “Golconda Patrika” which supported Telangana people who suffered under Nizam’s autocratic rule.
Upon someone making a remark that Telangana doesn’t have Telugu poets, he travelled across Telangana and compiled details of 354 poets, writers and published them under the name “Golkonda Kavula Sanchika.”
He researched and wrote a book called “Andhrula Sanghika Charitra” which highlights social history of Telugus. It’s regarded as one of the finest, authoritative books written in Telugu and it made history by becoming the first Telugu book to win Kendra Sahitya Akademi award.
Some of his other popular literary works include “Ramayana Viseshalu,” “Hinduvula Pandugalu,” “Haindava Dharma Veerulu” and “Mogalai Kathalu.”
Suravaram garu left an indelible mark as a writer, journalist, newspaper editor, social historian, social activist, freedom fighter and politician. On his vardhanthi, let’s remember his contributions to Telugus in various fields.
Let’s also cultivate our intellectual abilities like him and stay inspired by his work.
ఈరోజు విఖ్యాత తెలుగు రచయిత, బహుభాషా కోవిదుడు దాశరథి రంగాచార్య గారి ౯౩వ జయంతి. తన అన్న, ప్రఖ్యాత సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య గారి లాగానే, దాశరథి రంగాచార్య గారు కూడా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.
అహింసావాదం ప్రతిపాదకుడు మహాత్మా గాంధీ, సామ్యవాద పితామహుడు కార్ల్ మార్క్స్ లను అభిమానించే ఆయన వైష్ణవాన్ని, వేదాంత కర్మ సిద్ధాంతాల్ని కూడా నమ్మిన, పాటించిన ఒక విలక్షణ వ్యక్తి.
తన తొలి రచన "చిల్లర దేవుళ్ళు" అనే నవలతోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, ఎంతో ఖ్యాతిని అందుకున్న ఆయన నాలుగు పవిత్ర వేదాలను సంస్కృతం నుండి తెలుగులోకి పూర్తిగా అనువదించిన తొలి వ్యక్తి కూడా.
పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ భద్రాచల శ్రీరాముడికి భక్తురాలు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి అక్కడున్న ఆదివాసీ గిరిజనులకు విడదీయరాని
ఒక ప్రత్యేక అనుబంధం ఉంది.
ఈ అపూర్వమైన అనుబంధం మన తెలుగు జానపద సంస్కృతి లో ఉన్న వైవిధ్యతకు నిదర్శనం.ఇది మనకున్న అనేక జానపద సంపదల్లో ఒక అరుదైన సంపద.
Telugu lands have rich folk culture. The word ‘folk’ means a culture, tradition or lifestyle limited and specific to a group of people or a particular community. Folk culture says a lot about a community's distinctive nature and uniqueness.
Similarly, tribes of Bhadrachalam have unique and distinct folk cultures associated with their traditional identities. According to the local legend, Sthala Purana, Lord Rama idol in Bhadrachalam temple was discovered by a tribal woman namely Pokala Dammakka, a Lord Rama devotee.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎందరో సాహితీవేత్తలు తెలుగుభాషలో రచనలు చేసి ప్రాముఖ్యత పొందారు మరియు తెలుగు భాషాభివృద్ధికి పాటుబడ్డారు.
వారిలో కె.ఎన్.వై. పతంజలి, రాచకొండ విశ్వనాధశాస్త్రి, అట్టాడ అప్పలనాయుడు, "కవిశేఖరుడు"గా ప్రసిద్ధిగాంచిన గురజాడ
అప్పారావు, "కారా మాస్టారు"గా పిలవబడే కాళీపట్నం రామారావు గార్ల మాటలను చదువుదాం. At #TLM20#SomavaaramBookClub, lets learn about the least talked about; Uttarandhra (north Andhra) literature. North Andhra comprises Srikakulam, Vizianagaram and Visakhapatnam.
Among other reasons to read their work,portrayal of Uttarandhra culture and representation of Uttarandhra dialect is one.The beauty of Telugu regional dialect is best explored through its literature. Here’s an illustration made by @hungry_yadla featuring five Uttarandhra writers;