#శ్రీశైలం
4 ప్రధాన ద్వారాలు
1) తూర్పు - త్రిపురాంతకం ,ప్రకాశం జిల్లా. శివయ్య త్రిపురాసురుల వధ చేసిన చోటు. 2) దక్షిణం - సిద్ధవటం,కడప జిల్లా. విశాలమైన మర్రి చెట్టు కింద కొలువై ఉన్న దక్షిణమూర్తి. 3) పశ్చిమం - అలంపూర్,గద్వాల జిల్లా. 4) ఉత్తరం - ఉమామహేశ్వర, Nagarkarnool జిల్లా
(1/n)
#శ్రీశైలం
మహిషాసుర మర్దిని ఆలయం..
రుద్రాక్ష మఠం కి అతి దగ్గర లో ఉన్న అతి పురాతన ఆలయం. (2/n)
#శ్రీశైలం
హఠకేశ్వరం. కేసప్ప అనే భక్తుడు కి కుండ పెంకులో బంగారు శివలింగ రూపం లో దర్శనం ఇచ్చిన స్థలం.
ఇది ఫాల ధార పంచదార ల కి 200mts దూరం లో వుంటుంది.
(3/n)
#శ్రీశైలం
లలితాదేవి పీఠం.
హాటకేశ్వరం పక్కనే ఉంటుంది.
ఇక్కడే శని,రాహు,కేతుల మండపం ఉంటుంది. నవగ్రహాలు కాకుండా, ఈ మూడు విగ్రహాలు మాత్రమే ఉండడం కొత్త గా ఉంది. దోష నివారణ కి ప్రత్యేక పూజలు జరుగుతాయి అంట. గో శాల ,అన్న దాన సత్రం ఉన్నాయి.
విపరీతమైన కోతుల బెడద కూడా ఉంది
(4/n)
#శ్రీశైలం.
4 ఉప ద్వారాలు.
ఆగ్నేయం - సోమశిల
నైరుతి - పుష్పగిరి
వాయువ్యం - సంగమేశ్వరం (ముంపు కి గురి అయినది)
ఈశాన్యం -ఏలేశ్వరం (ముంపు కి గురి అయింది)
(5/n)
#శ్రీశైలం.
భూమండలానికి శ్రీశైలం ను నాభి స్థానం అంటారు. అందుకే, యే పూజ సంకల్పం లో ఐనా,మనం శ్రీశైలం కి యే పక్కన ఉన్నామో చెప్పుకుంటాం.
ఫాల ధార - శివుని నుదురు నుంచి..
పంచ దార _ శివుని పంచ ముఖముల నుంచి వచ్చిన వి.
ఆది శంకరులు ఇక్కడ గుహ లో తపస్సు చేసి, శివానంద లహరి రచించారు.
(6/n)
#శ్రీశైలం
భీముని కొలను
ఫాలదారా - పంచదార నుంచి 2 kms left లో ఉంటుంది. నేను అయితే వెళ్ళా లేదు,. చాలా దూరం గుట్ట లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అంట. పాండవుల యాత్ర లో ద్రౌపది కి దాహం వేస్తే, భీముడు తన గద తో బండ ల మీద కొట్టడం వల్ల ఏర్పడ్డ కొలను.
ఒక గుట్ట దిగి, గుట్ట ఎక్కాలి.
(7/n)
#శ్రీశైలం
గుడి ప్రాకారం 600 ఫీట్లు పొడవు,500 ఫీట్లు వెడల్పు (3 లక్షల చదరపు అడుగుల వైశాల్యం).
గుడి కి 4 దిక్కుల 4 గోపురాలు ఉన్నవి.
తూర్పు - కృష్ణదేవరాయల గోపురం
పడమర - బ్రహ్మానంద గోపురం
దక్షిణం - హరిహర రాయల గోపురం
ఉత్తరం - శివాజీ గోపురం.
(8/n)
#శ్రీశైలం
గర్భ గుడి కి నంది మండపం కి మధ్య లో *******వీర శిరో మండపం****** ఉంటుంది.
పాత రోజుల్లో,వీర శైవులు శివయ్య పై భక్తి తో, నాలుక లు, చేతులు, కాళ్ళు, శిరస్సులు నరుక్కుని శివునికి అర్పించే వాళ్ళు. (9/n)
#శ్రీశైలం.
ధూళి దర్శనం.
భక్తులు శివ లింగాన్ని స్వయం గా స్పర్షించుకునే అవకాశం కాశీ తో పాటు ఇక్కడ కూడా ఉంది.
దీని నే ధూళి దర్శనం అంటారు.
ఒకప్పుడు అందరికీ ఈ అవకాశం ఉండేది. రద్దీ పెరగడం వల్ల దీన్ని లిమిట్ చేశారు.
ప్రస్తుతం బుధ,గురు,శుక్ర వారాల్లో 2 to 3.30 pm. ఉంది
(10/n).
#శ్రీశైలం
శివాజీ స్పూర్తి కేంద్రం
శివాజీ ఇక్కడ కొంత కాలం ఉన్నారు.
గుడి కి ఉత్తరాన ఉన్న శివాజీ మండపం ఈయనే నిర్మించారు. ఈ మండపానికి ఎదురుగా ఒక భవనం లో నివసించే వారు. ఆ భవనం శిధిలమైన తర్వాత ఆ స్థానం లో ఇప్పుడు ఉన్న స్పూర్తి కేంద్రాన్ని నిర్మించారు.
(11/n)
ఓల్డ్ pic.
#శ్రీశైలం
సాక్షి గణపతి
శ్రీశైలం దర్శించే వారి కి సాక్షి గా ఈ గణపతి ఉంటారు. కైలాసం లో తండ్రి కి లెక్క చెపుతారు అంటారు. విగ్రహం కూడా, రాస్తున్నట్టు గా ఉంటుంది. అందుకే,ఇక్కడ తప్పక గోత్ర నామాలు చెప్పుకుంటారు.
ప్రతి రోజు ఉదయం 9 కి గణపతి హోమం ఉంటుంది. రుసుము Rs.1,116/-
(12/n)
#శ్రీశైలం
మల్లమ్మ కన్నీరు
హేమరెడ్డి మల్లమ్మ శివ భక్తురాలు.
అత్త,ఆడబిడ్డల పోరు తో కుటుంబాన్ని వదిలి శ్రీశైలం లో నివాసం ఉన్నారు.
తపస్సుకి శివయ్య ప్రత్యక్షమయ్యారు.
ఆనందం తో ఆమె కార్చిన కన్నీరే, మల్లమ్మ కన్నీరు.
ధ్యానం చేసిన place, రోకలి అన్నీ. Main టెంపుల్ దగ్గర చూడ వచ్చు.
(13/n)
#శ్రీశైలం
ఇంతకు ముందు వెళ్ళినప్పటిది.
My click
(14/n)
#శ్రీశైలం
12జ్యోతిర్లింగాల్లో. 2 వది
18 శక్తి పీఠాల్లో. 6వది
దశ భాస్కరాలలో 6వది.
జ్యోతిర్లింగం,శక్తి పీఠం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం.
(సతీ దేవి మెడ భాగం పడిన చోటు).
మానవుల,జంతువుల,వల్ల మరణం లేని వరం ఉన్న అరునాసురుడి ని వేలాది భ్రమరాల రూపం లో సంహరించి భ్రమరాంబిక గా వెలసారు
(15/n)
#శ్రీశైలం
ఇష్ట కామేశ్వరి.
శ్రీశైలం to డో ర్నాల road వైపు. Road నుంచి దట్టడవి లో 11 km లొపల ఉంటుంది. 2008 లో 1st time వెళ్ళాను. అప్పుడు జీపు లో Rs.600 ఒకరికి.
మట్టి దారి కూడా లేదు. రాళ్లు రప్పల్లో పోతారు. తర్వాత 2 km నడవాలి. అమ్మ చిన్న గుడి లో 4,5 మెట్లు లోపల ఉంటుంది
(16/n)
#శ్రీశైలం
ఇష్ట కామేశ్వరి.
అమ్మ ని ముట్టుకోవచ్చు. అమ్మ నుదురు మనిషి నుదురు లాగే స్పర్శ తెలుస్తుంది.
2 చేతుల లో శివ లింగాలు,జప మాల పట్టుకుని ఉంటారు అమ్మ.
పేరు లోనే ఇష్టాలను తీర్చే తల్లి అని ఉంది
(17/n)
మధ్య లో వాహనాల్ని ఆపేశారు. ఇంకొక వారం లో మళ్లీ స్టార్ట్ చేస్తారు అంట.
#Srisailam
దీప స్తంభం.
గుడి అవరణ లో సప్త మాతృక ల పక్కన 1603 వ సంవత్సరం నాటి దీప స్తంభం ఉంది.
చాలా బాగుంది. Raatri 8.45 కే లైన్ లో ఎంటర్ అవ్వడం ఆపేస్తున్నారు.
రాత్రి 9 దాటే వరకు ఉంటే, ఏకాంత సేవ లో శివయ్య నీ పల్లకి లో గుడి చుట్టూ ఊరేగిస్తారు. బాగుంటుంది.
దర్శనం
(18/n)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం.
శివుడు,విష్ణువు కి భేదం లేనప్పుడు..
శివ తత్వం బోధించిన గురువు కి, విష్ణు తత్వం బోధించిన గురువు కి భేదం ఉంటుందా??? రాముడు గొప్పా,కృష్ణుడు గొప్పా,అంటే. ఇద్దరు దేవుని అవతరలే,. రాముని అవతార పరమార్థం (1/n)
వేరు, కృష్ణ డి అవతార పరమార్థం వేరు,. రామాయణం లో రాముడు కి కృష్ణుడి లక్షణాలు ఉన్న, భారత్ లో కృష్ణుడి కి రాముడి లక్షణాలు ఉన్నా దుష్ట సంహారం జరిగేది కాదు..
ఇతర మతాల తో ఉన్న గొడవలు తో తృప్తి కలగట్లేదా,,,. హిందువు లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు పడితే కానీ, మీ పైశాచికత్వం తృప్తి (1/n)