#ఇద్దరువిద్యార్థులు కథ..మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా 🙏
ఒకానొక ఊరిలో ఒక అందమైన పాఠశాల. ఆ పాఠశాలలో చదూకోడానికి అందరిలానే ఇద్దరు విద్యార్థులు జేరి శ్రద్ధగా చదూకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉన్నారు(అ)
అలా వారి ఎదుగుదల చూసి ఉపాధ్యాయులతో సహా ఊరు ఊరంతా మెచ్చుకోసాగారు. ఊరన్న తర్వాత అన్ని రకాల మనుషులూ ఉంటారు కదా అలాగే ఈ ఊరిలోనూ ఉన్నారు..వారిలో కొంతమంది ఈ ఇద్దరినీ చూసే దృష్టిని జనాల్లో మార్చడం మొదలుపెట్టారు.(ఆ)
అంటే మంచీ చెడుల బేరీజు కాకుండా కులాల ప్రస్తావన తేవడం ద్వారా. కానీ జనాల్లో కొంతమంది దీన్ని ఖండిస్తూ ఎమోస్తుందిరా మీకు దీనివల్ల అని ఎదురు ప్రశ్నించారు..
దానికి వారి సమాధానం 1. ఒక్కరిగా ఉంటే గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్ట పడాలి..(ఇ)
కానీ మాకా ఓపిక లేదు. అందుకే గుంపులను తయారు చేస్తాం..దాన్ని కుల ప్రాతిపదికన కానీ.. మత ప్రాతిపదికన గానీ.. ప్రాంత ప్రాతిపదికన గానీ అయితే చాలా సులువు కూడా..ఎక్కడైనా ఎప్పుడైనా త్వరగా గుర్తింపు లభిస్తుంది.(ఈ)
2. అదే కులానికి సంబంధించి ఉచ్ఛ స్థితిలో ఉన్నవాళ్ల దృష్టిలో చాలా త్వరగా పడొచ్చు.. 3. ఎక్కువమంది అనుచరగణాన్ని మేము తయారుచేసుకోవచ్చు.. మా నాయకుడికి నా బలమేంటో చూపించొచ్చు..4. ఈ ప్రక్రియలో భాగంగా..కాలక్రమేణా మాకు అధికారం గానీ..ధనం గానీ..కీర్తి ప్రతిష్టలు..(ఉ)
(మేమనుకునే) గానీ..మరెవిధమైన ఆసక్తికరమైన ప్రతిఫలాన్ని గానీ మేము ఆశించవచ్చు.. 5. ఇక్కడ మాకు మా ప్రతిభతో గానీ..చదువుతో గానీ..విద్యార్హతలతో గానీ..మిగతా
మనుషుల.మనోభావాలతో గానీ నిమిత్తం లేకుండా మాకిష్టమైన పనిలో రాణించడానికి ఆస్కారం వుంటుంది..(ఊ)
ఈ సమాధానాలు విన్న ఆ ఊరి జనం ఆశ్చర్యపోయారు.. తర్వాత అసహ్యించుకున్నారు.. ఆ తర్వాత జాలిపడ్డారు.. ఇక వదిలేశారు..
ఈ తతంగమంత ఓ పక్కన జరుగుతూ ఉండగా..(ఋ)
ఆ ఇద్దరు విద్యార్థులూ కాలక్రమేణా ఉన్నతమైన పదవులు గల ఉద్యోగాల్లో స్థిరపడి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించారని తెలిసి వారి వారి కుల సంఘాల వాళ్ళు సన్మానం చెయ్యడానికి నిర్ణయించుకున్నాయి. ఇక పోటా పోటీగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు(ౠ)
ఆహ్వాన పత్రికల దగ్గర నుండీ ఫ్లెక్సీ ప్రచార కార్యక్రమాల వరకూ ఆ కుల సంఘాల సొంత ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి విపరీతమైన జనాదరణ రావడంతో ఒక టెలివిజన్ నిర్మాణ సంస్థ అది ఓటీటీ లో ప్రసారం చెయ్యడానికి ఒక మంచి మొత్తం ఆ ఇద్దరికీ ఇవ్వజూపడంతో(ఎ)
వారికి నచ్చి ఆ ప్రసార హక్కుల్ని వారికి ఇచ్చేసారు..వచ్చిన డబ్బులతో హాయిగా ఇద్దరూ ఒకే విమానంలో తిరిగి వెళ్లిపోయారు..
కొన్నాళ్ళకు తాము సంపాదించిన మెత్తంతో వారిరువురూ మంచి సంస్థని నెలకొల్పి అద్భుతమైన ప్రతిభావంతులకు..(ఏ)
ఉద్యోగాలిచ్చి ఆ సంస్థను లాభాల బాటలో నడిపించేలా చేశారు..ఈ సంస్థలో వారి ఊరి నుండి వచ్చిన వారు గానీ..వారి వారి కులాల నుండి వచ్చిన వారు గానీ పనిచేస్తున్న వాళ్ళు ఒక్క శాతం కూడా మించి లేరు..(ఐ)
అలా మళ్లీ మళ్లీ ఆ పాఠశాల నుండి ప్రతీ ఏడూ ఇద్దరు ప్రతిభావంతులుగా భావితరాలకు ఉపయోగపడే విధంగా తమను తాము తీర్చి దిద్దుకుంటూ వెళుతూనే ఉన్నారు..మిగతా 98% మంది కూడా కుల..మత..ప్రాంత సంఘాలను ఏర్పాటు చేసుకుని తమని ఎవడు ఉద్ధరించటానికి వస్తాడని ఎదురు చూస్తూ చూస్తూ..(ఒ)
తమ పొట్ట నిండక...తమ వారి కడుపులు నింపక.. కాలం గడుపుతూ అలిసిపోతూ..కాల గర్భంలో కలిసిపోయారు..
ఆ రెండు శాతం మందీ.. కాలంలో అచిరకాలంగా కలకాలం నిలిచిపోయారు.. #బరా #BreathsnReads #ఇద్దరువిద్యార్థులు
🙏🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1. ఇంట్లో పెద్దవాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలని.. అనుక్షణం వారిలో తగినంత ధైర్యాన్ని..సంతోషాన్ని నింపుతూ దగ్గరగా ఉండాలని..ఒక్కసారి ఆ మనిషిని కోల్పోతే ఆ క్షోభ ఎంత దారుణంగాఉంటుందో ..ఆ మరుక్షణం ఈలోకం ఎంత నరకంగా..శూన్యంగా అనిపిస్తుందో నాకు తెలుసు..
⬇️
2. ధూమపానం వదిలేసి చాలా మంచి పని చేశానని.. నా నరాలు.. రక్తం..చర్మం..ఊపిరితిత్తులు..శరీరం అద్భుతంగా వాటి పని అవి తిరిగి చెయ్యటంలో నేను సహకరించానని అర్ధమయ్యింది. 3. భాగ్యనగరం లాంటి కలుషిత వాతావరణంలో రోజూ తిరుగాడడంలో ఉత్పన్నమయ్యే శ్వాస సంబంధిత సమస్యలను మాస్కు ..
⬇️
అది 1979 అనుకుంటాండి..
ఒకానొక దుర్ముహూర్త సమయంలో నెల్లూరు నుండి ఐపీ పెట్టి పారిపోయిన మీ ఫామిలీ విజయవాడ చేరి ఆడ పెద బస్స్టాండ్ బాత్రూములు కడిగే పెద్ద కాంట్రాక్టు వచ్చిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి మీ అయ్య..నువ్వూ కలిసి మందుకి డబ్బుల్లేక...1
జొన్నవిత్తుల గారి పక్కింట్లోకెళ్ళి డబ్బులేమీ లేకపోవడంతో మందులోకి మాంసం దొంగతనం చేశాడట..
అది చూసినా ఓనర్ కోపంతో రగిలిపోయి పక్కనే ఉన్న జొన్నవిత్తుల వారికి చెప్పడంతో.. సరిగ్గా అదే సమయానికి పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం చదువుతుండడంతో ఆ సంఘటన ఆయన మనస్సులో..2
బలంగా నాటుకుని పోయి ఒక తిట్ల దండకం రాసేసారట..
తరువాత కొన్నాళ్ళకు జంధ్యాల గారితో జొన్నవిత్తుల గారు కలిసి ష్. గప్. చుప్ చిత్రంతో కలవడం..అందులో అప్పట్లో రాసుకున్న తిట్ల దండకం ఆ విధంగా లోకానికి తెలియడం జరిగాయి..3