ఈరోజు నిద్ర మేల్కొలిపే గోపిక శ్రీకృష్ణుని పొరుగింటి పిల్ల. ఈమె తనకు తానుగా కృష్ణుడికోసం ఎదురు చూసేది కాదు. ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడనే నమ్మకం కల చిన్నది. ఈ గోపిక ఫలితం వచ్చినా రాకున్నా దాని వల్ల వచ్చే లాభనష్టాలన్నీ భగవంతుడివే కాని తనవి కావనే నిశ్చింతతో నిద్రపోతుంది.
నిద్రపోతున్నప్పుడు మనసు తప్ప ఇంద్రియాలన్నీ పని మానేస్తాయి. కాని ఆ మనసు మాత్రం పరమాత్మనే తలుచుకుంటూ ఉంటుంది. అలా నిద్రపోతున్న గోపికను గోదా, మిగిలిన గోపికలు కాస్త వ్యంగ్యంగా మేల్కొల్పుతున్నారు.
"ఏమమ్మా! మాకంటే ముందే నోము నోచుకుని స్వర్గంలోకి ప్రవేశించావా? పోనీ వాకిలి తెరవకున్నా
పర్లేదు. ఈ ఒక్క మాటైనా చెప్పు. పరిమళించే పవిత్రమైన తులసీదళాలు ధరించిన నారాయణుడు మాచే వేనోళ్ల కొనియాడబడి మాకు పురుషార్ధాన్ని ఇస్తున్నాడు కదా. ఆ రామచంద్రుని మూలంగా మృత్యువు నోటిలోకి త్రోయబడిన కుంభకర్ణుడు నీతో అతని గాఢనిద్రను పణంగా పందెం కాచి ఓడిపోయి నీకు ఇచ్చి వెళ్ళాడా?
చెప్పమ్మా! మరీ ఇంత మొద్దు నిద్దరైతే ఎలాగమ్మా? మాకందరికి అరుదైన శిరోభూషణమైనదానివి నీవే కదా తల్లీ. ఇకనైనా నిద్ర లేచి వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
😎😎😎😎
SK : "ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది."
RK : "అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు?"
SK : "ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే..."
RK : "అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."
SK : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"
RK : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగ ఉంటుంది."
SK : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను,
వ్రాసుకోండి."
RK : "సరే చెప్పు..."
SK : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."
RK : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"
SK : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."
RK : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"
నీ మేడ ఉజ్వలము, పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. ఆ మేడలో మెత్తని పాన్పుపై కళ్ళుమూసుకుని హాయిగా నిద్రపోతున్నావు. నీ చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అగరుధూపాల పరిమళాలు వ్యాపించాయి. ఇంకా నిద్రపోతున్న ఓ అత్త కూతురా! లేచి మణికవాటము యొక్క గడియను తీయుము. అత్తా! నువ్వైనా ఆమెను
లేపరాదా? ఏం? నీ కూతురు మూగదా? లేక చెవిటిదా? లేక అలిసిపోయి ఉన్నదా? ఎవరైనా నువ్వు కదిలితే మేము ఊరుకోము అని కట్టడి చేసి కాపలాగా ఉన్నారా? అలా మొద్దు నిద్రపట్టేట్టుగా ఎవరైన మంత్రం వేసారా?అయితే మాధవా! మాయావీ! వైకుంఠవాసా! ఆని ఆ నారాయణ నామస్మరణ చేసి ఆమెను మేల్కొలుపు.
ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.
భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల
#యాగంటి_బసవయ్య లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఉంది...
బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు.... ఈ క్షేత్రనంది విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది.. ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతాడు
( ఇది ఒడ్డు, పొడుగు, ఎత్తు అన్ని వైపులా) ... ఈ విధంగా పెరిగే సరికి ప్రస్తుతం ఈ నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించుకుంది.. మొదట మండపం మధ్యలో ఉండి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉండేదట... ఇప్పుడు పూర్తిగా ఆక్రమించి.. స్తంభాలలో సరిపోవటం లేదు... దీనిని పురావస్తు శాస్త్రజ్ఞులు
నిర్థారించారు...చిత్రంలో చూడండి.. ఇది నిజంగా ఎంత అద్భుతం ... ఈ క్షేత్రంలో ఇంకా చాలా మహిమలున్నాయి.. 1. మొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలు పెట్టి విగ్రం తయారయ్యే సమయానికి స్వామి వారి కాలి బొటనవేలిలో లోపం గమనించారట... ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి ...
ఓ జనక మహారాజా ! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును.
ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు
వెళ్ళుదురు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండి
వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచితంగా పూజించి , విష్ణుమూర్తిని ధ్యానించి , ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించ వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును.