ప్రశ్న: మీరు చెప్పినట్లు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందే అనుకుందాం! ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఆయన దగ్గర మాయలు, మంత్రాలు ఉన్నాయా?
సమాధానం: మంచి ప్రశ్న వేశావ్ బ్రదర్.
పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే రాత్రికి రాత్రి అధ్భుతాలు ఏమీ జరగవు. అలా జరగడానికి ఆయన దగ్గర మంత్రదండం కూడా ఏమీ లేదు. అయితే ఆయన కొన్ని పనులు చేయగలరు.
అవి...
1. ఇప్పుడు మాదిరిగా ఇసుకపైన దోపిడీ చేసి వ్యక్తుల జేబులు నింపకుండా,సరసమైన ధరలో ప్రజలకు అందించి, ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ఖజానాకే జమ చేస్తాడు.
2 ఇప్పుడులాగా పిచ్చి మందుని అమ్మి తన జేబులు నింపుకోకుండా, నాణ్యమైన మందుని ప్రజలకు అందించి ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ఖజానాకి జమచేస్తాడు.
3. ఇక మైనింగ్ ద్వారా, మట్టి అమ్మకాల ద్వారా, ఎర్ర చందనం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా వ్యక్తులకు దోచిపెట్టకుండా రాష్ట్ర ఖజానాకి జమచేస్తాడు.
4. అంతేగాక వందల కొద్దీ సలహాదారుల్ని పెట్టుకుని రాష్ట్ర ఖజానాకి భారం కలిగించడు. చిత్ర,విచిత్రమైన పదవులు సృష్ఠించి దానికి క్యాబినెట్ హోదాలు కల్పించి రాష్ట్ర ఖజానాపై భారం మోపడు.
5.తమ పార్టీ రంగులను అన్ని చోట్లా వేయడం కోసం కోట్లు వృధా చేయరు.అసలు పార్టీ రంగులు కార్యాలయానికి వేయరు.
6.ఇంటి ఇంటికి రేషన్ అని ఇచ్చే రేషన్ బండ్లకు వేల కోట్లు , రేషన్ సంచులకు వందల కోట్లు అనవసరంగా ఖర్చు చేయరు ప్రతి రూపాయి ని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు.
7.పొదుపు చర్యలు చేపట్టి, ఆర్ధిక క్రమశిక్షణ తాను పాటిస్తూ, అందరి చేత పాటింపజేస్తాడు.
8. ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రిలాగా కేంద్రం వద్ద భయపడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతాడు. అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు, నేర చరిత్ర, క్రిమినల్ కేసులు, ఆర్ధిక పరమైన తీవ్రమైన కేసులు లేవు.
9.పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు కాబట్టి ఎన్నారైలు కూడా నిబద్దతతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. పారిశ్రామికవేత్తలు సైతం రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతారు. అప్పుడు చదువుకున్న యువతకు ఉపాది అవకాశాలు పెరుగుతాయి.
10.అన్నింటి కంటే ముఖ్యంగా వృధ్ధులకు ఇచ్చే వృధ్ధాప్య పించను, విధ్యార్ధులకు ఇచ్చే రాయితీలు,సంక్షేమ కార్యక్రమాలు తప్ప మిగతావన్నీ క్రమబద్దీకరించి క్రమేణా తొలగించడం జరగొచ్చు.ఎందుకంటే ఎప్పుడైతే యువతకి ఉపాది లభిస్తుందో ఉచితాలకు చేయి చాపరు.ప్రజలను వారి కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా చేయకుండా,
వాళ్ళని బిచ్చగాళ్ళుగా మార్చే పధకాలను రద్దు చేయడం జరుగుతుంది.
11. చివరిగా విద్యా, వైద్యానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో గణనీయమైన, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాడు.
12.మడ అడవులను కాపాడతాడు పర్యావరణాన్ని రక్షించేందుకు కృషి చేస్తారు..
13.పైవన్నీ చెయ్యాలంటే నాయకుడు నీతి,నిజాయితీలు కలవాడై ఉండాలి. ప్రజలకు ఏమైనా చేద్దామన్న చిత్తశుధ్ధి, ధృఢ సంకల్పం ఉండాలి. అవినీతిపై, లంచగొండితనంపై, అరాచకాలపై కొరడా ఝుళిపించేవాడై ఉండాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ లాంటివాడై ఉండాలి. అర్ధమైందా!
మీరు గమనించని ముఖ్యమైన అంశమేమిటంటే...
అధిక లాభాలు వచ్చే మద్యం, ఇసుక, మైనింగ్ తదితరాల నుండి అధికారపార్టీవారు దోచేస్తూ, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల పేరిట ఇస్తున్న పప్పూబెల్లాల పంపిణీకి మాత్రం ఒకప్రక్క ప్రజలపై పన్నుల భారం మోపుతూ,
మరోప్రక్క అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగానూ, ప్రజల జీవితాల్ని చిద్రం చేస్తున్నారు. ఫలితంగా నాయకులు అభివృధ్ధి పధంలో దూసుకుపోతుండగా, రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తుంది. #SaveAPfromYSRCP
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కులాలను కలిపే ఆలోచనా విధానంతో.,
మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయడానికి మహోన్నతమైన ఆశయాలతో., అత్యద్భుతమైన 7 సిద్దా౦తాలతో
2014 మార్చి 14 న JanaSena Party అనే ఒక నీతివంతమైన నిబద్దత గల జాతీయవాదంతో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుంచీ....
ఎల్లప్పుడూ ప్రజాపక్షంలో ప్రజా సమస్యలపై సావధానంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి అహర్నిశలూ తపిస్తూ శ్రమించే పార్టీ అధినాయకులవారు #శ్రీ_పవన్_కళ్యాణ్ గారిని ఈ సారి వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానంలో గనుక అధిరోహించెట్లుగా.
ముందు నుంచి అనుమానిస్తున్నది ఇదే ? దీనిపై అవగాహణ కూడా తక్కువ ! దీనిపై అవగాహణ ఉన్న మేధావులు దీనిపై వివరణ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻
గ్రామ సచివాలయాల్లో చేసే ఒన్ టైమ్ సెటిల్ మెంట్ (ఒటిఎస్ ) రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్ధం.. జగన్ రెడ్డి బొమ్మలతో తయారుచేసిన ఆ డాక్యుమెంట్లు చెల్లవు 👉 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం భారత రాజ్యాంగం 3జాబితాల్లో అధికారాలు కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా ఉండే అధికారాలతో పాటు సంయుక్తంగా ఉండే అధికారాలు నిర్దేశించబడ్డాయి. 👉 కాంకరెంట్ జాబితాలోని ఐటెమ్ నెం.6 ప్రకారం వ్యవసాయేతర భూమి బదలాయింపు, రిజిస్ట్రేషన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఈ పరిధిలోకి వస్తాయి.