తెలంగాణము వారు చదవవలసిన పుస్తకములు -1 వ భాగం.
మన #తెలంగాణ గురించి ఎన్నో విషయములు-భౌగోళిక, చారిత్రక,భాషా, కళా సాంస్కృతిక అంశములు,ఆలయాలు, ఎన్నో కారణముల వలన సరిగ్గా సమగ్రముగా గ్రంథస్తం కాలేదు. అయినప్పటికీ భిన్న మూలాల నుండి మనం మన తెలంగాణ గురించి సమగ్రముగా అర్థం జేసుకొనవచ్చు 1/n
1. మొదట మన కవుల గురించి మన భాషా అస్థిత్వం గురించి.
గోలకొండ కవుల చరిత్ర (సురవరం ప్రతాప రెడ్డి గారు): ప్రతి #తెలంగాణ విద్యార్ధి తప్పక చదివి అర్థం చేసుకొనవలసిన సంచిక
"నైజామాంధ్ర /తెలంగాణము లో కవులు పూజ్యం(లేరు)" అని ముడుంబై గారు ఏకంగా గోలకొండ పత్రికలోనే రాస్తిరి, అవగాహనాలేమితో.
అందుకు ప్రతి దూషణ చేయక, తెలంగాణలోని ఘనమయిన సారస్వత(సాహిత్య) సంపద బయటి వారలకు తెలియక పోవుట వలన, తెలంగాణ కవులకు బయట ప్రపంచముతో సంబంధము లేకపోవుట వలన ఆ అపోహ వచ్చినది అని హేతుబద్ధముగా చెప్పి. ప్రాచీన కాలము నుండి తెలంగాణము ఆంద్ర మాతకు విహార రంగస్థలమని చెప్పుచూ,
తెలంగాణ లో ఉన్న ఉత్కృష్ట కావ్య పద్య రచనలు ఆహ్వానించి, వాటిలోని ఉత్తమమయిన 354 కవుల రచనలను ఈ సంచికలో ప్రచురించిరి. తెలంగాణలున్న సాహిత్య సంపద, భాషాభిమానం తెలుపును. ఈ సంచికలో తెలంగాణ ఆస్థాన కవులయిన శేషాద్రి రమణ కవులు తెలంగాణ ప్రాచీన సాహిత్య వైభవం,కవుల గురించి ఒక వ్యాసం కూడా రచించె
2. ప్రాచీనాంధ్ర నగరములు: ఆదిరాజు వీరభద్రా రావు గారు - ప్రాచీన ఆంద్ర దేశములో సింహ భాగం ప్రస్తుత తెలంగాణనే! తెలంగాణపు సాంస్కృతిక రాజధాని ఓరుగల్లు "ఆంద్ర నగరం"గ ఖ్యాతినర్జించెను. అట్లనే కొండపావురం,కొలనుపాక, పానుగల్లు,ఆలంపురం, గోలకొండ,వేలుపుగొండ మొదలయిన ప్రాచీన తెలుగు నగరముల గూర్చి
ఎన్నో మంచి వాస్తివిక ఆధారములతో కూడిన చారిత్రక సాంస్కృతిక అంశములు ఉండును. హైదరాబాదునగరము యొక్క ప్రాచీన #తెలుగు పేరు గురించి ఇందులో సమగ్రముగా చెప్పబడినది! తప్పక చదవవలసిన పుస్తకము ఈ ప్రాచీనాంధ్ర నగరము.
3. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి- ఖండవల్లి లక్ష్మి రంజనం గారు. నాకు తెలిసినంతవరకు 1951లోనే మూడు తెలుగు ప్రాంతాల గురించి సమగ్రముగ, సహేతుకముగ భౌగోళిక, చారిత్రక, భాష, సంస్కృతీ అంశాలను, వనరులతో సహా చర్చించిన పుస్తకం ఇదే. ఆధునిక చరిత్రలో మరి కొంత చర్చ ఉండాల్సి ఉండె. But chala better book!
ఈ పుస్తకము 1951లనే తెలంగాణనలోని geography, చెరువులు, తెలంగాణ పండుగలయిన బతుకమ్మ, సంక్రాంతి నోములు, నాగ పంచమి, తెలంగాణ వేద సంస్కృతి వైభవం, తెలంగాణ&సీమ మాండలిక ప్రాచీనత, కవులు, తెలంగాణ కోటలు, వనరులు, వేలకొద్ది ఉన్న prehistoric dolemans/రాక్షస గూళ్ళు, ఇత్యాది విషయాలను చాలా చెప్పును.
4. ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1వ భాగం(1000CE- 1875CE)- సురవరం ప్రతారెడ్డి గారు.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర 2వ భాగం(400 BCE- 1000CE)- భిన్నూరి నరసింహ శాస్త్రీ గారు (శాసనాల శాస్త్రిగ ప్రసిద్ధ చెందిన బీఎన్ శాస్త్రి గారు)
తెలంగాణ ఆత్మగౌరవానికి, చారిత్రక పరిశోధనా వైభవానికి నిదర్శనం ఇరువురు.
5 నైజాము రాష్ట్ర ప్రశంస (1926)- శేషాద్రి రమణ కవులు: ఈ జంట కవులు గుంటూరు వారైనప్పటికీ, తెలంగాణ ఆస్థానకవిపండితులుగ కీర్తినర్జించిరి. వారికి తెలంగాణ చరిత్ర, రాజవంశాలు, వీరులు,కవులు, శిల్పసంపద, సాహిత్యసంపద, ఆలయాలు,నగరాలు,కళలు, ఇత్యాది అంశాలపైనున్న లోతయిన అవగాహన,ప్రేమ మనకు తెలియును
తప్పక చదవాల్సిన పుస్తకం. మల్లినాథ సూరి, పోతన, పాల్కురికి వంటి కవులు తెలంగాణ వారని ఎలుగెత్తి చాటుతరు. త్రిలింగ క్షేత్రాల్లోని కాళేశ్వరం గోదావరి తీరంలోని కాళేశ్వరమే అని చెప్పెదరు. వారి జీవితము అంతా తెలంగాణముకే అంకితము జేసిరి.
6.తెలంగాణ చరిత్ర,సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు 7. కాకతీయులు, పివి పరబ్రహ్మ శాస్త్రి గారు
8.రాచకొండ చరిత్ర, తేరాల సత్యనారాయణ శర్మ గారు 9. కుతుబ్ షాహీలు, కాకాని చక్రపాణి గారు
10.ఆధునిక ఆంధ్రప్రదెశ్ చరిత్ర పి.రఘునాథ రావు గారు
11.Ancient And Medieval History of AP పి.రఘునాథ రావు
13. తెలంగాణ సాహిత్య సౌరభాలు, భాస్కర యోగి గారు 14. పాలమురు జిల్లా వాగ్గేయ కారులు, భాస్కర యోగి గారు 15. పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం, భాస్కర యోగి గారు 16. యాదాద్రి సంకీర్తనాచార్యుడు- ఈగ బుచ్చిదాసు, భాస్కర యోగి గారు
తెలంగనాణల కర్ణాటక మరియూ హిందుస్తాని,ఈ రెండు సంగీత సాంప్రదాయాలు కలవు! మనకు ఒక రామదాసు గారు మాత్రమే తెలుసు, కాని దాస సాహిత్యంలో పాలమూరు తెలుగు నేలకు రాజపీఠం. భాస్కరయోగి గారి పరిశోధన అమోఘం అన్నట్టు!
17. కరీంనగర్ జిల్లా చరిత్రా సంస్కృతీ - జైశెట్టి రమణయ్య గారు 18. The Chalukya And The Kakatiya Temples ( A Study)
Jaishetty Ramanaiah 19. Temples of South India: A Study of Hindu, Jain and Buddhist Monuments of the Deccan
Jaishetty Ramanaiah
ఆలయాల చరిత్ర సమగ్రముగా తెలుసుకొనవలెనంటే వాటి చారిత్రక, పొరాణిక, స్థానిక, సాంస్క్రుతిక అంశాలు శాసానాధారితముగా, శాస్త్రీయ ప్రమాణాలతో సహా ఉండవలెను. అటువంటి పుస్తకాల ద్వార తెలంగాణ స్థానిక చరిత్ర ప్రాంఆణికముగ తెలుసుకొనవచ్చు
తెలంగాణములోని ప్రముఖ ఆలయాల
సమగ్ర చరిత్ర, శాసనాధారితముగా - 1. వేములవాడ చరిత్ర శాసనములు, భిన్నూరి నరసింహ శాస్త్రీ గారు 2. ధర్మపురి క్షేత్ర చరిత్ర , సంగనభట్ల నర్సయ్య గారు 3. పూత గోదావరి , సంగనభట్ల నర్సయ్య గారు
20. తెలుగు వైతాళికులు భాగం 1&2, దేవులపల్లి రామానుజరావు. 21. తెలంగాణలో అంధ్రోద్యమం, మాడపాటి హనుమంతావు.
22. చారిత్రక సామాజిక కోణంలో తెలుగు సాహిత్య చరిత్ర : సుజాత రెడ్డి గారు - సాహిత్య చరిత్ర అయినప్పటికీ తెలుగు చరిత్ర ఏంటో నిక్షిప్తం అయి ఉన్నది
ఒక మహిళ సాహిత్య చరిత్ర రాసుట అరుదు! కొత్త కోణం, సామాజిక చరిత్ర కనవడును ఇందుల !
23. పోతన పంచశతి ఉత్సవ పత్రిక
24. ఆంధ్ర కవుల చరిత్ర (రెండు భాగాలు వీరేశలింగం గారు)
25. ఆంధ్ర కవి తరంగిణి : పోతన, సింగన, మొదలయిన భాగవత కర్తల చరిత్ర గురించి 26. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం- ఖండవల్లి లక్ష్మీ రంజనం
27. తెలుగు జానపద గేయ సాహిత్యం- బిరుదురాజు రామరాజు . తెలుగు నేల జానపద సాహిత్యానికి బృహత్కోట. అందులో తెలంగాణము జానపదుల రాజ ప్రసాదము వంటిది.
మరి మన తెలుగు సాహిత్య పరిశోధనా శిఖరాగ్రులు బిరుదురాజు గారు తెలుగు నాట(ముఖ్యంగ తెలంగాణల) వందలాది పల్లెలు మూడు సంవత్సరాలు తిరిగి ఒక సమగ్ర రూపములో తెలుగు జానపదముల సాహిత్య వివరములను, వాటిపై హేతుబద్ధమయిన విశ్లేషణలను ఇందులో పొందుపర్చెను. సహజముగా తెలంగాణ జానపదములు ఇందులో సింహ భాగం!
తెలుగువీరుడు: మెదక్ రామాయమ్మపేట సంస్థానంలోని ఈ రెడ్డి వీరుని గాథ తెలుగు వారి స్వాతంత్ర్య పోరాట పటిమ కు నిదర్శనం. ఇది చారిత్రక నవల అయినప్పటికీ. సహజముగా ఆ నాటి చరిత్ర, సంస్కృతీ, ఆచారాలు, వ్యవహారాలు అన్ని ఏంటో అద్భుతముగా కండ్లకు కట్టినట్టు చూపెదరు!నాటి దసరా పండుగ తీరు గురించి కూడా!
29.ఆంధ్రుల చరిత్ర బి ఎస్ ఎల్ హనుమంత రావు:
ఇందులో ముఖ్యంగా కాకతీయుల చరిత్ర చాలా బాగా వివరించెదరు. కాకపోతే కొంచెం తెలుగు భౌగోళిక అంశాలు సరిగ్గా cover చేయక ఉండె. కానీ కాకతీయుల చరిత్ర, వారి సామ్రాజ్య విస్తరణ పటము అన్నీ చాలా బాగా చూపెను
30. కాశీ యాత్రా చరిత్ర - ఏనుగు వీరాస్వామయ్య.
తెలుగు లో తొలి యాత్రా చరిత్ర.
మద్రాస్ నుండి కాశీ పోవుచున్నప్పుడు తెలంగాణ లోని 5 పాత జిల్లాల్లో ప్రయాణం సాగును. తెలంగాణ లోని పశ్చిమ భాగం లో నాటి పరిస్థితి గురించి ఎంతో తెల్సుకోవచ్చు
31. కాకతీయ కళా దర్శనం.
ముదిగొండ శివప్రసాద్ గారు.
పరిశోధనా గ్రంథం.
కాకతీయుల నాటి సంస్కృతి, కళకు, సంగీతం, నాట్యం, సమాజం అన్నీ చాలా వివరంగా చారిత్రక ఆధారాలతో ఉండును.
32. కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్ర.
మలయశ్రీ గారు. కేవలము ఒక జిల్లా సాహిత్యకారుల directory lekka గాకుండా, అసలు చరిత్ర, భాష అంశాల్లో ముఖ్యంగా సాహిత్య చరిత్ర లో ప్రామాణికత తో కూడిన నిష్పాక్షిక విశ్లేషణ ఎట్లు ఉండాల్నో చెప్పేటి ఒక గొప్ప standard వంటిది ఈ పుస్తకం.
అందరూ చదవాలె!
Mesmerizing #NaturalBeautyOfTelangana - Part 1(Hills)
#Telangana hinterland comes alive with monsoon magic. It turns spectacular from nallamala in South to Adilabad in North to dense moist forests Warangal in East to thick woods of Sirisilla& Induru north central and west !1/n
We will see about hills in this thread. 1. Nallamala hills - #Nagarkurnool, #Nalgonda, #Wanaparty
#Nallamala hills are the only section of main Eastern ghats in TS. Has high mountains, forests,valleys, waterfalls, Amarabad tiger reserve, view points, ancient temples & caves. 2/n
2. Sahyadri hills
Nirmal ghats in normal district part of Sahyadri hill ranges. Many beautiful waterfalls like kuntala are part of it.