ఈ ఫోటోలోని వ్యక్తి ముండ్లూరి గంగప్ప గారు. బళ్ళారి నియోజకవర్గం నుండి 1952లో మద్రాసు శాసనసభకు ఎన్నికయినవారు.
బళ్ళారిని మైసూరు రాష్ట్రంలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
1955లో మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ (ఫజల్ అలీ కమీషన్) బళ్లారిని, తుంగభద్రా
ప్రాజెక్టును ఆంధ్రాలో (సీమలో) కాలపాలని చెప్పినప్పటికీ నాటి కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సును అంగీకరించక బళ్లారిని మైసూరు రాష్ట్రంలోనే కొనసాగించాలని నిర్ణయించడంతో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బళ్ళారిని ఆంధ్రాలో కలపాలి అనే నినాదం మీద ఉపఎన్నికలకు వెళ్ళారు
ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ పాల్గొనలేదు. బళ్ళారిలో ఆంధ్రుల అభ్యర్థిగా గంగప్ప గారు, కన్నడిగుల అభ్యర్థిగా HS గౌడ తలపడ్డారు.
హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికలలో గౌడగారికి 31708
వోట్లు రాగా, గంగప్ప గారికి 28917 ఓట్లు రాగా, స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఆంధ్రుల అభ్యర్థి గంగప్పగారు ఓడిపోయారు.
1. నంద్యాల ఇప్పుడు జిల్లాగా ఏర్పడినప్పటికీ, 1953 లో ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఎంపికయినప్పుడు, తాత్కాలికంగా కొంతకాలం కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పి కార్యాలయాలు నంద్యాలలో ఉన్నాయి. అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితమే నంద్యాల జిల్లా కేంద్రంగా ఉన్నదన్నమాట(కొన్ని కార్యాలయాలు)
2. రాయలసీమ ఆలయ పర్యాటకానికి పెట్టింది పేరు. జిల్లాల పునర్విభజన తరువాత దాదాపు 70% ప్రధాన ఆలయాలు 2 జిల్లాలలో కొలువైఉన్నాయి
నంద్యాల - శ్రీశైలం, అహోబిలం, మహానంది, యాగంటి, నందవరం, కొలనుభారతి, నేలమఠం మొ.
తిరుపతి - తిరుమల, తిరుపతి దేవస్థానములు, శ్రీకాళహస్తి, నాగులాపురం, నారాయణవనం మొ.
3. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత రాయలసీమ జిల్లాలలో అన్నమయ్య జిల్లా - జిల్లా కేంద్రం రాయచోటి మాత్రమే రైల్వే స్టేషన్ లేని జిల్లా కేంద్రం 4. రాయలసీమలోని క్లాస్ -1 పట్టణాలలో కనీసం రెవెన్యూ డివిజన్ కాలేకపోయిన ఏకైక పట్టణం - ప్రొద్దుటూరు
The man who once saved Bellary from an epidemic - Right Honorable Kolachalam Venkatrao
శ్రీ కోలాచలం వెంకట్రావు స్వాతంత్ర సమరయోధులు, ధర్మదాత, ప్రముఖ న్యాయవాది, ది లయన్ ఆఫ్ ది బార్, సంఘ సంస్కర్త, భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నాయకులలో ఒకరు,
రాజనీతి దురంధరులు, బళ్ళారి మాజీ మున్సిపల్ ఛైర్మన్. విజయనగర సామ్రాజ్య ఆస్థానంలోని విద్వాంసులు మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి వంశంలో కోలాచలం వెంకట్రావు గారు 1850 ఫిబ్రవరి 28న బళ్ళారి లో జన్మించారు. వీరి తండ్రి కోలాచలం సేతుపతి శాస్త్రి అనెగొంది సంస్థానంలో దివాన్ గా ఉండేవారు.
వీరి సోదరులు ఆంధ్రచరిత్రనాటకపితామహుడు కోలాచలం శ్రీనివాసరావు గారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, అనంతపురం- బళ్ళారిలలో తొలి వైద్యురాలల్లో ఒకరు అయిన డా. నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి వీరి భార్యకు మేనకోడలు.
1902 వ సంవత్సరంలో బళ్లారిలో ప్లేగు వ్యాధి దావానలంలా వ్యాపించింది.
ఈ మూడు పద్య పాదాలు వరుసగా క్రీ. శ 1465, క్రీ.శ 1369, క్రీ.శ 1344 సంవత్సరాలను సూచిస్తాయి.
ఈ విధంగా కాలాన్ని/ సంవత్సరాలను అంకెలలో కాక సంకేత పదాలతో వాక్యాలతో తెలియజేయడాన్ని chronogram అంటారు.
శాసనాలలో / కావ్యాలలో మొదట సంవత్సరం / కాలం సూచించేవారు కాదు. ఆ తరువాత పలానా రాజు పట్టాభిషిక్తుడై పలనా సంవత్సరాలు అయిన తరువాత అని వాడేవారు. ఆ తరువాత ‘శక’ సంవత్సరాలు మొదలయ్యాయి.
శాసనాలలో శాలివాహక శకంతో పాటు 1126, 1232 అంటూ అంకెలు పేర్కొని ఆయా కాలాన్ని సూచించేవారు.
అయితే కొందరు కవులు, శాసన కర్తలు తమ కావ్యాలలో, శాసనాలలో కాలాన్ని నేరుగా అంకెలలో సూచించకుండా పైన చెప్పిన విధంగా Chronograms వాడి వాక్యాలలో తెలియజేసేవారు.