ఇవాళ #రాధాష్టమి(#భాద్రపద_శుద్ధ_అష్టమి)
రాధాదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
🕉రాధాదేవి అమ్మవారి 5
పూర్ణబ్రహ్మస్వరూపాల్లో ఒకళ్ళు.(దుర్గ-లక్ష్మీ-సరస్వతి-గాయత్రి-రాధ)
🕉ఈ 5 స్వరూపాలు మనలో ఉండే 5శక్తులకి ప్రతిరూపాలు(ఇచ్చాశక్తి, ఐశ్వర్యశక్తి,జ్ఞానశక్తి,వేదశక్తి, ఆనందశక్తి)
🕉బృందావనం లో నంద,యశోదాదేవి పుత్రుడుగా
శ్రీకృష్ణుడు శ్రావణ బహుళాష్టమి రోజు జన్మించాడు.
🕉బృందావనం లోనే, వృషభానుడు & కళావతి అనే దంపతులకు రాధాదేవి భాద్రపద శుక్ల అష్టమి రోజు జన్మించింది.
🕉వృషభానుడు,కళావతి పితృదేవతల లోకానికి చెందినవాళ్ళు పూర్వ జన్మలో.
🕉అమ్మవారు 3 సార్లు ముగ్గురికి కుమార్తెగా వచ్చింది.
1.మేనాదేవి,హిమవంతులకు గౌరీదేవిగా,
2.కళావతి,వృషభానుడికి రాధాదేవిగా,
3.ధన్యా(సుమేధా),జనకమహారాజుకి సీతాదేవిగా.
🕉రాధాదేవి, ఉసీరవ మహారాజు తపస్సుకు ఫలితంగా ఒక చిన్న శిశువుగా(అయోనిజ)ప్రత్యక్షమయ్యి తనని ఒక కమలంలో ఉంచి వెళ్ళమని చెప్పి
ఆ రాజుకి మోక్షం ప్రసాదిస్తుంది.
🕉తరువాత కళావతి,వృషభానుడికి కమలంలో ఉన్న శిశువుగా దొరుకుతుంది.
🕉రాధాదేవి జన్మస్థలం ఉత్తరప్రదేశ్ లో మధురకి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న RAVAL అనే ప్రదేశంలో జరిగింది.(ఇప్పటికీ అక్కడ రాధాదేవి గుళ్లో అమ్మవారిని చిన్న శిశువుగా ఉన్న పాలరాతి విగ్రహంగా
పూజలందుకుంటోంది.)
🕉రాధాదేవి పుట్టాక కళ్ళు తెరవలేదుట,శ్రీకృష్ణుడి చేతి స్పర్శ తగిలేంత వరకు!!..
తాను కళ్ళు తెరిచి చూసే మొదటి వ్యక్తి శ్రీకృష్ణుడు అవ్వాలని ఉద్దేశంతో.
🕉యుక్తవయస్సులో ఆమె శ్రీకృష్ణుడితో వివాహం కోసం ఏమి చెయ్యాలి అని గర్గ మహామునిని అడిగితే ,ఆయన "తులసీపూజ"
చెయ్యమన్నారట.
🕉రాధాదేవి భక్తికి మెచ్చిన తులసి, వృక్షరూపం లోంచి మానవరూపం దాల్చి,రాధాదేవిని కౌగిలించుకుని, తనలోని శక్తిని ధారపోసింది.
🕉బృందావనంలో శ్రీకృష్ణుడితో నీకు వివాహం జరుగుతుంది అని ఆశీర్వదించింది.
🕉శ్రీకృష్ణ,రాధాదేవి వివాహం లౌకికమైనది కాదు.
సాక్షాత్తూ బ్రహ్మ దేవుడే
వీరిరువురికి వివాహం జరిపిస్తాడు.
🕉ఇది భక్తి లేదా భక్తుడు..భగవంతుడిలో ఐక్యం కావడంగా భావించాలే తప్ప మాములు పెళ్లి అని అనుకోకూడదు.
🕉వీరి వివాహం "పౌర్ణమాసీదేవి" జరిపించింది అని ప్రతీతి.ఈ అమ్మవారి గుడి బృందావనంలో చూడచ్చు.
🕉వివాహానంతరం అమ్మవారికి శ్రీకృష్ణుడే స్వయంగా పట్టాభిషేకం
కూడా జరిపిస్తాడు.
🕉అమ్మవారికి కిరీటాన్ని అలంకరించి #బృందావనేశ్వరి"-#మహాభావస్వరూపిణీ"అని కీర్తిస్తాడు.
🕉నిధి కుంజ్ & సేవా కుంజ్ పేర్లతో బృందావనంలో ఉన్న ఉద్యానవనాల్లో ఇప్పటికి రాత్రివేళల్లో రాధా కృష్ణులు, గోపికలు సంచరిస్తూ ఉంటారు అని భావనతో, సాయంత్రం6:30 తర్వాత లోపలికి
ఎవ్వరిని అనుమతించరు.
🕉దానికి గుర్తుగా ఇప్పటికీ ఆ వనంలో ఉన్న చెట్లు వింతకాంతితో మెరవడం, గజ్జెల శబ్దాలు వస్తాయి అని అక్కడి ప్రజలు చెప్తారు.
🕉రాధా అంటే నిరంతరం భక్తి,ప్రేమ,ఆసక్తి ...ఆ భగవంతుని మీద.
🕉రాధాశక్తి -కృష్ణప్రేమని ఇస్తుంది.
🕉లలితా సహస్రనామాల్లో --ప్రేమరూపా, ప్రియంకరి,రతిరూపా,రతిప్రియా భక్తిరూప,భక్తివశ్యా...ఇవన్నీ రాధాదేవి గురించి చెప్పినవే.
🕉రాధానామస్మరణ మనకి భగవదనుగ్రహం లభించేలా చూస్తుంది.
🕉#రాధ అక్షరాలు తారుమారు చేస్తే #ధార!!
అంటే రాధతో కూడిన కృష్ణునికి పూజ చేస్తే,స్వామి కరుణ,దయ మనమీద ధారగా
వర్షిస్తుంది,మనకి స్వామి శాశ్వత నివాసమైన #గోలోకం చేరేలా అనుగ్రహిస్తుంది🙏🏻
ఒకసారి అమెరికాలోని సబ్బులు ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది.
కవర్ ప్యాక్ అయింది కాని అందులో సబ్బు లేదు.
డీలర్లు, కస్టమర్లు గొడవతో పెద్ద గోలయింది. దానితో ఆ కంపెనీ యాజమాన్యం కంపెనీలో ఇంకెప్పుడూ ఇలాంటి సమస్యతో పరువు పోకూడదని జాగ్రత కోసం “ఆరు”కోట్లు ఖర్చు పెట్టి ఎక్సరే మిషన్
కొన్నారు.ప్యాకైన సబ్బులు లైన్ మీద వెళ్తుంటే అందులో సబ్బు ఉన్నదీ, లేనిదీ ఆ మిషన్ ద్వారా తెలుసు కుంటున్నారు. ఈ విషయం విన్న మన తెలుగోడు హైదరాబాద్లో సబ్బుల కంపెనీ వాడు,అలాంటి సమస్య రాకూడదని 3 వేలు పెట్టి పెడెస్టల్ ఫ్యాన్ కొని లైన్ మీద వెళ్తోన్న సబ్బుల వైపు ఫుల్ స్పీడ్ తో పెట్టాడు
గాలికి సబ్బు ఉన్న ప్యాక్ లు మాత్రమే ఉంటున్నాయి.. ఖాళీ కవర్లు ఆ గాలికి ఎగిరిపోతున్నాయి.
పని ఒక్కటే ఆరు కోట్లు ఎక్కడ? మూడు (3)వేలు ఎక్కడ ??
అదీ తెలుగోడి తెలివితేటలు !!
అందుకే పిజ్జాలూ, బర్గర్లూ మానేసి ఆవకాయ అన్నం, పులిహోరలూ వంటివి తినండి.
#గడ్డికి#గరిక కీ చాలా తేడా ఉందండీ.
గరిక పొడవుగా,రెండు పక్కలా చాలా పదునుగా (rajor sharpness)ఉంటుంది.
గడ్డి పొట్టిగా, మెత్తగా ఉంటుంది.
మొదటి చిత్రం గరిక,రెండోది గడ్డి
పచ్చి గరిక ని ఎండపెడితే పవిత్రమైన దర్భలు గా తయారవుతాయి.వాటికి అప్పుడు పూజల్లో వాడే #అర్హత,#పవిత్రత వస్తుంది.గరుత్మంతుడు అమృతం తెచ్చి గరిక మీద ఉంచాడు.. #పవిత్రత పోకుండా ఉండేలా...పాములు ఆత్రంగా ఆ పాత్ర ని కదిలిస్తే అమృతం గరిక మీద ఒలికి పోవడం,దానిని నాకిన పాముల నాలుక రెండు గా
చీలిన సంగతి తెల్సిందే కదా!!
అసలు గురుకులంలో చదివే విద్యార్థులకు మొట్టమొదట ఈ దర్భలు ఎంత జాగ్రత్తగా, చేతులు తెగకుండా ఎలా కోయాలో,ఎలా జాగ్రత్తగా ఎండబెట్టి దర్భలు గా తయారుచేసి నిల్వ చేయాలో నేర్పిస్తారు.చాలా నైపుణ్యం కావాలి ఆ పని చెయ్యడానికి.అందుకే ఏ పని ఐనా చాలా జాగ్రత్తగా,
మొన్న వినాయక చవితికి పాలవెల్లికి కట్టిన వెలగపండు చూస్తే ఎప్పుడో చదివిన/విన్న విషయం ఒకటి గుర్తు వచ్చింది.
"కరి మింగిన వెలగపండు" అనే మాట మీరందరూ వినే ఉంటారు.ఏనుగుకి వెలగపండు ఇస్తే గుటుక్కున మింగేస్తుంది...మర్నాడు మళ్ళీ వెలగపండు ఎలా ఉందో అలాగే
విసర్జిస్తుంది..కానీ లోపల గుజ్జు మాత్రం స్వాహా చేస్తుందిట.దానికి గొప్ప జీర్ణశక్తి ఉందిట.ఇలాంటి వివరణ కూడా వినే ఉంటారు.
కానీ ఈ మాట ఏ మాత్రం నిజం కాదు!!#కరి అనే శబ్దానికి ఉన్న నానార్థాలు ఈ పుకారుకి కారణం.
కరి అంటే నిదర్శనం,హద్దు, నియమం,లక్ష్యం,సాక్షి, ఏనుగు, నల్లటి,పురుగు...
ఇలా చాలా అర్థాలు ఉన్నాయి.
అమరకోశ వ్యాఖ్యానం ప్రకారం కరి =కరిః కపిత్థ కోసోత్థహా అని ఉంది.అంటే వెలగపండు లో కంటికి కనపడనంత సూక్ష్మ క్రిమి అని అర్థం.
వెలగ చెట్టుకి ఏదైనా చీడపీడలు సోకినప్పుడు..పండులోపల గుజ్జు మొత్తం నల్లగా మారి ఎండిపోయినట్లు అవుతుంది.బైటనుంచి పండు బాగానే ఉంటుంది
#పితృపక్షాలు
విజ్ఞప్తి:: 1. పోస్ట్ పూర్తిగా చదివి, దేశ, విదేశాల్లో
నివసించే మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయడం ద్వారా హిందూధర్మాన్ని
కాపాడండి. శ్రాద్ధకర్మల ఆవశ్యకత
గ్రహించి పూర్వీకులకు నివాళులు
అర్పించేందుకు మీవంతు కృషి చేయండి. 2. ప్రస్తుత సంవత్సరంలో అనగా శ్రీ శుభకృత్
నామ సం.లో భాద్రపద బహుళ
పాడ్యమి ది 10-09-22
నుండి బహుళ అమావాస్య
ది 25-09-22 వరకు పితృపక్షం.
3.. వారణాశి నందు సత్రములు మరియు
ఆశ్రమము వివరములు ఇచ్చుచున్నాము.
పితృపక్షం ప్రతి సంవత్సరం చంద్రమానం ప్రకారం, భాద్రపద బహుళ
పాడ్యమి నాడు ప్రారంభమై బహుళ
అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షం నందు పిండప్రదానం
స్వగృహములో చేసుకొనవచ్చును. పుణ్యక్షేత్రము లందు
చేయు అభిలాష ఉన్నవారు వారణాశి (కాశీ), గయ, ప్రయాగ
క్షేత్రములందు నిర్వహించుటకు వీలుగా క్షేత్రములలో