#గడ్డికి#గరిక కీ చాలా తేడా ఉందండీ.
గరిక పొడవుగా,రెండు పక్కలా చాలా పదునుగా (rajor sharpness)ఉంటుంది.
గడ్డి పొట్టిగా, మెత్తగా ఉంటుంది.
మొదటి చిత్రం గరిక,రెండోది గడ్డి
పచ్చి గరిక ని ఎండపెడితే పవిత్రమైన దర్భలు గా తయారవుతాయి.వాటికి అప్పుడు పూజల్లో వాడే #అర్హత,#పవిత్రత వస్తుంది.గరుత్మంతుడు అమృతం తెచ్చి గరిక మీద ఉంచాడు.. #పవిత్రత పోకుండా ఉండేలా...పాములు ఆత్రంగా ఆ పాత్ర ని కదిలిస్తే అమృతం గరిక మీద ఒలికి పోవడం,దానిని నాకిన పాముల నాలుక రెండు గా
చీలిన సంగతి తెల్సిందే కదా!!
అసలు గురుకులంలో చదివే విద్యార్థులకు మొట్టమొదట ఈ దర్భలు ఎంత జాగ్రత్తగా, చేతులు తెగకుండా ఎలా కోయాలో,ఎలా జాగ్రత్తగా ఎండబెట్టి దర్భలు గా తయారుచేసి నిల్వ చేయాలో నేర్పిస్తారు.చాలా నైపుణ్యం కావాలి ఆ పని చెయ్యడానికి.అందుకే ఏ పని ఐనా చాలా జాగ్రత్తగా,
నేర్పుతో,నైపుణ్యతతో చేసేవారికి #కుశాగ్రబుద్థి ఉంది అనే నానుడి వచ్చింది.
కుశము అంటే దర్భ. అగ్రభాగాన్ని (upper part of DARBHA)జాగ్రత్తగా,మెళుకువతో కట్ చేయడం అనే అర్థం తో.
ఇక మీరన్నట్లు బుద్ధి గడ్డి తినడం అంటే "ఒక పని చెయ్యడం తప్పు అని తెలిసి కూడా కావాలని ఆ పని
ఏదైనా లాభం వస్తుంది కదా అనో,ఎవరికీ తెలియదు కదా అనో చేయడం"
అన్నం తినే మనుషులు ఐతే
అలాంటి పని చెయ్యకూడదు,గడ్డి తినే పశువులాగా మంచీ చెడూ విచక్షణ లేకుండా చేసారు అని ,ఇంకెప్పుడూ చెయ్యవద్దు అని హెచ్చరికగా అనే మాట.పశువుతో పోల్చడం కంటే అవమానం ఇంకేం ఉంటుంది!!
పౌరుషం ఉన్న వ్యక్తి ఐతే మళ్ళీ ఆ రకమైన పని చెయ్యరు.
ఇక గణపతికి గరిక తో అలంకరణ చేస్తామే తప్ప #వండి_వడ్డించమనలేదు కదండీ!!
మన పెళ్ళిళ్ళు, ఏదైనా ఫంక్షన్లలో రకరకాల పువ్వులు, ఆకులు, గడ్డి తో అలంకరణ చేస్తారు కదా.
తినడం వేరే అలంకరణ వేరే!!
నిజానికి గరిక తో పచ్చడి చేసి తినవచ్చు కూడా..కొన్న వ్యాధులకు మందు గా గరికతో చేసిన పదార్థాలు ఆయుర్వేద చికిత్స లో ఉపయోగిస్తారు.
ఈ వివరణ అంతా ఈ ప్రశ్నకి సమాధానం
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఒకసారి అమెరికాలోని సబ్బులు ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది.
కవర్ ప్యాక్ అయింది కాని అందులో సబ్బు లేదు.
డీలర్లు, కస్టమర్లు గొడవతో పెద్ద గోలయింది. దానితో ఆ కంపెనీ యాజమాన్యం కంపెనీలో ఇంకెప్పుడూ ఇలాంటి సమస్యతో పరువు పోకూడదని జాగ్రత కోసం “ఆరు”కోట్లు ఖర్చు పెట్టి ఎక్సరే మిషన్
కొన్నారు.ప్యాకైన సబ్బులు లైన్ మీద వెళ్తుంటే అందులో సబ్బు ఉన్నదీ, లేనిదీ ఆ మిషన్ ద్వారా తెలుసు కుంటున్నారు. ఈ విషయం విన్న మన తెలుగోడు హైదరాబాద్లో సబ్బుల కంపెనీ వాడు,అలాంటి సమస్య రాకూడదని 3 వేలు పెట్టి పెడెస్టల్ ఫ్యాన్ కొని లైన్ మీద వెళ్తోన్న సబ్బుల వైపు ఫుల్ స్పీడ్ తో పెట్టాడు
గాలికి సబ్బు ఉన్న ప్యాక్ లు మాత్రమే ఉంటున్నాయి.. ఖాళీ కవర్లు ఆ గాలికి ఎగిరిపోతున్నాయి.
పని ఒక్కటే ఆరు కోట్లు ఎక్కడ? మూడు (3)వేలు ఎక్కడ ??
అదీ తెలుగోడి తెలివితేటలు !!
అందుకే పిజ్జాలూ, బర్గర్లూ మానేసి ఆవకాయ అన్నం, పులిహోరలూ వంటివి తినండి.
ఇవాళ #రాధాష్టమి(#భాద్రపద_శుద్ధ_అష్టమి)
రాధాదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
🕉రాధాదేవి అమ్మవారి 5
పూర్ణబ్రహ్మస్వరూపాల్లో ఒకళ్ళు.(దుర్గ-లక్ష్మీ-సరస్వతి-గాయత్రి-రాధ)
🕉ఈ 5 స్వరూపాలు మనలో ఉండే 5శక్తులకి ప్రతిరూపాలు(ఇచ్చాశక్తి, ఐశ్వర్యశక్తి,జ్ఞానశక్తి,వేదశక్తి, ఆనందశక్తి)
🕉బృందావనం లో నంద,యశోదాదేవి పుత్రుడుగా
శ్రీకృష్ణుడు శ్రావణ బహుళాష్టమి రోజు జన్మించాడు.
🕉బృందావనం లోనే, వృషభానుడు & కళావతి అనే దంపతులకు రాధాదేవి భాద్రపద శుక్ల అష్టమి రోజు జన్మించింది.
🕉వృషభానుడు,కళావతి పితృదేవతల లోకానికి చెందినవాళ్ళు పూర్వ జన్మలో.
🕉అమ్మవారు 3 సార్లు ముగ్గురికి కుమార్తెగా వచ్చింది.
1.మేనాదేవి,హిమవంతులకు గౌరీదేవిగా,
2.కళావతి,వృషభానుడికి రాధాదేవిగా,
3.ధన్యా(సుమేధా),జనకమహారాజుకి సీతాదేవిగా.
🕉రాధాదేవి, ఉసీరవ మహారాజు తపస్సుకు ఫలితంగా ఒక చిన్న శిశువుగా(అయోనిజ)ప్రత్యక్షమయ్యి తనని ఒక కమలంలో ఉంచి వెళ్ళమని చెప్పి
మొన్న వినాయక చవితికి పాలవెల్లికి కట్టిన వెలగపండు చూస్తే ఎప్పుడో చదివిన/విన్న విషయం ఒకటి గుర్తు వచ్చింది.
"కరి మింగిన వెలగపండు" అనే మాట మీరందరూ వినే ఉంటారు.ఏనుగుకి వెలగపండు ఇస్తే గుటుక్కున మింగేస్తుంది...మర్నాడు మళ్ళీ వెలగపండు ఎలా ఉందో అలాగే
విసర్జిస్తుంది..కానీ లోపల గుజ్జు మాత్రం స్వాహా చేస్తుందిట.దానికి గొప్ప జీర్ణశక్తి ఉందిట.ఇలాంటి వివరణ కూడా వినే ఉంటారు.
కానీ ఈ మాట ఏ మాత్రం నిజం కాదు!!#కరి అనే శబ్దానికి ఉన్న నానార్థాలు ఈ పుకారుకి కారణం.
కరి అంటే నిదర్శనం,హద్దు, నియమం,లక్ష్యం,సాక్షి, ఏనుగు, నల్లటి,పురుగు...
ఇలా చాలా అర్థాలు ఉన్నాయి.
అమరకోశ వ్యాఖ్యానం ప్రకారం కరి =కరిః కపిత్థ కోసోత్థహా అని ఉంది.అంటే వెలగపండు లో కంటికి కనపడనంత సూక్ష్మ క్రిమి అని అర్థం.
వెలగ చెట్టుకి ఏదైనా చీడపీడలు సోకినప్పుడు..పండులోపల గుజ్జు మొత్తం నల్లగా మారి ఎండిపోయినట్లు అవుతుంది.బైటనుంచి పండు బాగానే ఉంటుంది
#పితృపక్షాలు
విజ్ఞప్తి:: 1. పోస్ట్ పూర్తిగా చదివి, దేశ, విదేశాల్లో
నివసించే మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయడం ద్వారా హిందూధర్మాన్ని
కాపాడండి. శ్రాద్ధకర్మల ఆవశ్యకత
గ్రహించి పూర్వీకులకు నివాళులు
అర్పించేందుకు మీవంతు కృషి చేయండి. 2. ప్రస్తుత సంవత్సరంలో అనగా శ్రీ శుభకృత్
నామ సం.లో భాద్రపద బహుళ
పాడ్యమి ది 10-09-22
నుండి బహుళ అమావాస్య
ది 25-09-22 వరకు పితృపక్షం.
3.. వారణాశి నందు సత్రములు మరియు
ఆశ్రమము వివరములు ఇచ్చుచున్నాము.
పితృపక్షం ప్రతి సంవత్సరం చంద్రమానం ప్రకారం, భాద్రపద బహుళ
పాడ్యమి నాడు ప్రారంభమై బహుళ
అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షం నందు పిండప్రదానం
స్వగృహములో చేసుకొనవచ్చును. పుణ్యక్షేత్రము లందు
చేయు అభిలాష ఉన్నవారు వారణాశి (కాశీ), గయ, ప్రయాగ
క్షేత్రములందు నిర్వహించుటకు వీలుగా క్షేత్రములలో