టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. గుండెలోతుల్లో గూడుకట్టుకున్న భావోద్వేగం.. తెరలు తెరలుగా కంటిని కమ్మేస్తున్న వేళ.. Image
ప్రపంచాన్ని మరిచి ఏడ్చేశారు ఇద్దరూ. వాళ్ల ప్రభంజనానికి ఎర్రమట్టి కోర్టులు సాగిలపడ్డాయి. పచ్చికమైదానాలు పాహిమాం అన్నాయి. అయితే నువ్వు లేదంటే నేను ఇలానే సాగింది వాళ్ల కెరీర్ అంతా. ఆ తర్వాత నవతరం, యువరక్తం దూసుకువచ్చినా సీనియర్లుగా ఈ ఇద్దరి వాడీ వేడి ఎక్కడా తగ్గలేదు. పడిన ప్రతీసారి Image
కెరటాల్లా లేచారు. ఆడేది వేరే దేశాలకు కావచ్చు. మైదానంలో దిగితే ఇద్దరూ బద్ద శత్రువులే కావచ్చు. కానీ ఆట ముగిసిన ఆ మరుక్షణం ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. #రోజర్_ఫెదరర్, #రఫెల్_నాదల్.. టెన్నిస్ ను ఇష్టపడే ఇప్పటి తరం అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లు ఇవి. Image
భావోద్వేగంతో వీడ్కోలు ప్రసంగం :

మైదానంలో ఆడినంత కాలం బద్ద శత్రువుల్లా, కోర్టు బయట జీవిత కాల స్నేహితుల్లా తిరిగిన ఈ ఇద్దరూ, లావెర్ కప్ లో చివరి మ్యాచ్ తర్వాత పెట్టుకున్న కన్నీళ్లు చూసి క్రీడాభిమానులు కదిలిపోయారు. కారణం టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ కు ఇదే లాస్ట్ మ్యాచ్. Image
41 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఆటకు వీడ్కోలు ప్రకటించిన తర్వాత ఫెడెక్స్ #లావెర్_కప్ లో చివరి మ్యాచ్ ను తన జీవితకాల ప్రత్యర్థి రఫేల్ నాదల్ తో కలిసి ఓ జట్టుగా ఆడాడు. విధి వైచిత్రి ఏంటంటే మ్యాచ్ లో ఓడిపోయారు ఫెదరర్, నాదల్. ఇక అంతే నాదల్ ఏడుస్తూనే ఉన్నాడు. Image
రోజర్ అతన్ని సముదాయించాడు. తన ఫేర్ వెల్ స్పీచ్ ను ప్రారంభించాడు. ఎప్పుడైతే తన కుటుంబం, తన ప్రత్యర్థి #రఫేల్_నాదల్ ప్రస్తావన వచ్చిందో, #రోజర్_ఫెదరర్ కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. ఏడు నిమిషాల తన ప్రసంగాన్ని కన్నీళ్లతోనో కొనసాగించాడు, ముగించాడు. మరో వైపు రోజర్ మాట్లాడుతుంటే Image
వెనక కూర్చున్న నాదల్ కన్నీటి పర్యంతమవుతూనే కనిపించాడు. వీళ్ల తరంలోనే గ్రేట్స్ గా ఎదిగిన నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే చప్పట్లతో ఫెదరర్ ను ప్రశంసిస్తున్నా, నాదల్ కు ఫెదరర్ కు ఉన్న బంధం వేరే. అందుకే అభిమానులు ఈ దృశ్యాలు చూసి కదిలిపోతున్నారు. సోషల్ మీడియా నాదల్, ఫెదరర్ ఎమోషనల్ Image
వీడియోలతో షేక్ అయిపోతోంది.

సాహో స్విస్ దిగ్గజం :

స్విస్ ఆటగాడిగా ఫెడరర్ 1998లో ప్రొఫెషనల్ గా మారాడు. తన కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచాడు. అందులో 8 #వింబుల్డన్. ఓపెన్ ఎరా మొదలయ్యాక ఏ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు అందుకోని ఫీట్ ఇది. Image
ఆరుసార్లు #ఆస్ట్రేలియా_ఓపెన్, ఐదు సార్లు #యూఎస్_ఓపెన్ గెలుచుకుని రికార్డు నెలకొల్పాడు. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవటం ద్వారా కెరీర్ గ్రాండ్ స్లామ్ ను పూర్తి చేసిన అరుదైన ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. తన కెరీర్ లో ఏకంగా 310 వారాల పాటు వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ లో ఉన్నాడు Image
కెరీర్ లో ఎన్నో సార్లు మోకాళ్లకు శస్త్రచికిత్సలు జరిగాయి. నెలల పాటు మైదానానికి దూరంగా గడిపాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేవాడు. ఆ సర్జరీలే లేవంటే ఫెదరర్ ఇంకెంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించేవాడో. 24 ఏళ్ల కెరీర్ లో 100 పైగా టైటిళ్లు, వెయ్యికి పైగా మ్యాచ్ విజయాలు సాధించిన Image
ది గ్రేట్ ఇక సెలవంటూ టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికాడు.

మట్టికోర్టు మహారాజు :

అనుభవంలో ఫెదరర్ కంటే రఫేల్ నాదల్ చిన్నోడే. కానీ ఆటలో మాత్రం తక్కువ వాడేం కాదు. 2001 లో ప్రొఫెషనల్ గా మారిన నాదల్, ఇప్పటివరకూ 22 గ్రాండ్ స్లామ్స్ సింగిల్స్ టైటిళ్లు గెలుచుకున్నాడు. అందులో Image
14 #ఫ్రెంచ్_ఓపెన్ వే. అందుకే రఫేల్ నాదల్ ను మట్టి కోర్టు మహారాజు అంటారు. ఎర్రమట్టి కోర్టులో తనను కొట్టే ఆటగాడు ఇంకా పుట్టలేదు. ప్రత్యేకించి మట్టి కోర్టులో రఫేల్ ను ఓడించేందుకు ఫెదరర్ చూపించే పోరాటం, వింబుల్డన్ లో స్విస్ దిగ్గజాన్ని ఓడించేందుకు స్పెయిన్ బుల్ వేసిన రంకెలు, Image
ఆహా ఈ తరంలో టెన్నిస్ ఆటను చూసిన వారెవ్వరికీ మర్చిపోలేని అనుభూతి. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న నాదల్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, రెండు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ లు కైవసం చేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో ఇప్పటివరకూ నలుగురు ఆటగాళ్లు మాత్రమే Image
డబుల్ కెరీర్ గ్రాండ్ స్లామ్ ను అందుంటే, అందులో #రఫేల్_నాదల్ ఒకడు. తన కెరీర్ లో 209 వారాల పాటు నెంబర్ వన్ గా ఉన్నాడు రఫేల్ నాదల్.

నిప్పు, నీరు, ఓ దోస్తీ :

రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ ఇద్దరూ తమ కెరీర్ లో 40 మ్యాచ్ లో తలపడ్డారు. అందులో 14 గ్రాండ్ స్లామ్ టోర్నీల్లోనే అంటే Image
అర్థం చేసుకోవటం పోరాటం ఏ స్థాయిలో ఉండేదో. 24 సార్లు నాదల్ గెలిస్తే..16 సార్లు ఫెదరర్ గెలిచాడు. అందుకే ఫెదరర్ తనకు ఇష్టమైన ప్రత్యర్థి ఆటగాడు అంటే నాదల్ అనే చెబుతాడు. ఆశ్చర్యకరంగా ఇద్దరి ఎత్తు, బరువు ఒకటే. ఇద్దరూ 6.1 అడుగులు ఆజానుబాహులు. ఇద్దరి బరువు 85 కిలోలు. కానీ రోజర్ ఫెదరర్ Image
ప్రధాన బలం అతని ఫోర్ హ్యాండ్ షాట్. సాధారణంగా ఫెదరర్ ఒంటి చేత్తోనే ఆడతాడు అది కూడా కుడి చేత్తోనే. మిగిలిన క్రీడాకారులతో పోలిస్తే ఫెదరర్ ఆట చాలా ఫ్రొపెషనల్ గా కనబడటానికి కారణం అదే. కానీ నాదల్ ప్రధాన బలం బ్యాక్ హ్యాండ్ షాట్. టెన్నిస్ బంతి తనను దాటి వెళ్లిపోయే సమయంలో చేతులు వెనక్కి Image
నుంచి లాగుతూ పవర్ ను జనరేట్ చేస్తాడు నాదల్. ఎడమచేతి ఆటగాడైన నాదల్ ఆడేప్పుడు రెండు చేతులతో షాట్ ను కొడతాడు. అదే అతడిని ఛాంపియన్ గా నిలిపింది. టెక్నికల్ గా చూస్తే నాదల్ స్ట్రాంగ్, ప్రొఫెషనల్ గా చూస్తే ఫెదరర్ స్ట్రాంగ్. ఇద్దరూ ఆల్ టైం గ్రేట్స్. ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువ కాదు. Image
కానీ నెంబర్స్ పరంగా తన కంటే తక్కువైన #ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలుకుతున్న సమయంలో #నాదల్ కూడా పెట్టిన కన్నీళ్లు వాళ్లిద్దరి బంధం ఆటకంటే గొప్పదని చెప్పకనే చెబుతోంది. ఆ స్నేహం దేశాలు దాటి, పరిధులు దాటి, ఆటను దాటి భావితరాలకు స్ఫూర్తిమంతంగా నిలిచింది. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with ఆదిత్య శివశంకర కలకొండ

ఆదిత్య శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @adithyashiva23

Aug 1, 2023
#తమిళ భాషను #తెలుగువారు "#అరవం"అని ఎందుకు అంటారు?

మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.

మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
Read 5 tweets
Apr 29, 2023
#తెలుగు_భాష

తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?

డోర్ లాక్ చెయ్యకండి..

నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో..

నా కార్ కీస్ ఎక్కడ?

ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..

ఎందుకు ?

ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..

ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
వంటింటిని... #కిచెన్ చేసాం..
వసారా... #వరండాగా మారింది...
ఇలా #చావడి, #పంౘ, #ముంగిలి, #నట్టిల్లు, #తలవాకిలి, #నడవ, #పెరడు, ఇవన్నీ మరచిపోయాం..

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు..
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు..
Read 13 tweets
Mar 21, 2023
*#వదిలెయ్_మిత్రమా*

✒️ ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం
*వదిలెయ్*

✒️ పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాల పడక
*వదిలెయ్*
✒️ కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను
*వదిలెయ్*

✒️ ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా
*వదిలెయ్*
✒️ మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
*వదిలెయ్*

✒️ మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను
*వదిలెయ్*

✒️ ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చకుండా
*వదిలెయ్*
Read 4 tweets
Mar 21, 2023
ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది..
చాలా గర్వంగా ఉంది..

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
Read 8 tweets
Mar 21, 2023
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.

దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..

గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.

"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.

అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
Read 6 tweets
Mar 14, 2023
#సనాతన_ధర్మం - #పునర్జన్మ

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.

”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(