చెట్లు చేమలు
కొండలు కోనలు
వాగులు వంకలు
సెలయేళ్లు నింగి నేల అంటూ ఆకాశమే హద్దుగా ప్రపంచంలోని రంగు రంగులను స్వేచ్ఛగా ఆస్వాదించిన నీ చూపుల్లోని శక్తినంతా ఒకానొక కాళరాత్రి అదృశ్య శక్తి వచ్చి లాగేస్తుంది.

ఉదయం కళ్ళు తెరిచి చూస్తే రాత్రిలాగే ఉంటుంది.

నీ చూపు నువ్వు కోల్పోయిన ఆ క్షణం Image
నుంచి నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. కళ్ళు బలవంతంగా విప్పినా కానరాని గాఢాంధకారం

అయినా బతకాలి
ఎవరి కోసమంటే?
ఎందుకోసమంటే?

ఏమో..! నీ చూపుల మకరందాన్ని నా నుంచి బలవంతంగా లాగేసిన ఆ అదృశ్య శక్తి కరుణించకపోదా..! విముక్తి ప్రసాదించకపోదా..!

అది ఆశ కావొచ్చు
నమ్మకం కావొచ్చు Image
తీరని కోరికే అయ్యిండొచ్చు. కానీ తిరిగి పొందాలనే ప్రయత్నం మాత్రం ఏ క్షణానా విరమించకు.

అచ్చంగా ఇదే. 'ఎలెక్స్ హేలీ' అనే ఒక సంకర జాతి రక్తం పంచుకుని (రచయిత తన ఏడు తరాల ముందటి పూర్వీకుల్ని కలిసిన క్షణాన తనని తాను అలా చెప్పుకున్నాడు) పుట్టిన రచయిత సృష్టించిన 261 పేజీల Image
అద్భుతం 'ఏడు తరాలు(Roots)' చదువుతున్న ప్రతి పేజీలో, ప్రతి పేరాలో, ప్రతి అక్షరంలో నేను అనుభూతించిన భావం అచ్చంగా ఇదే.

అక్కడెక్కడో ఆఫ్రికా ఖండంలో గాంబియా అనే దేశంలో మాండింకా తెగ ప్రజలు నివసించే జపూర్ అనే ఒక కుగ్రామం. అందులో ఉమరో ఒకడు. వాళ్లది కింటే వంశం. అతని రెండవ భార్యకు పుట్టిన Image
నలుగురు కొడుకుల్లో 'కుంటా కింటే' పెద్దోడు. సాంప్రదాయ ముస్లిం పద్ధతిలో అన్ని శిక్షణలూ పూర్తి చేసుకుని బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడతాడు. శరీరంలో కూడా అప్పుడప్పుడే యవ్వనం తాలూకు చలనాలు కలుగుతుంటాయి.

ఒంటరిగా ఎప్పుడూ అడవుల్లో తిరగకు, తెల్లోళ్లు వస్తారు, ఎత్తుకుపోతారు, చంపి Image
తినేస్తారు అని పెద్దలు పదే పదే చెబుతుంటారు. అయితే ఒకనాటి ఉదయం తమ్ముడు ఆడుకోడానికి చెక్కబొమ్మ కోసమని ఏమరపాటుగా ఒంటరిగా అడివికి వెళ్లిన కుంటా ఇక తిరిగి రాడు. ఏమైందని స్పృహ వచ్చేలోపు ఓడలో ఉంటాడు.

ఓడ దిగువ అరల్లో వెలుగు మొహం ఎరుగుని చిమ్మ చీకటిలో తనలాగే కుక్కబడ్డ తొంభై అభాగ్యుల్లో Image
ఇతనూ ఒకడు. తిండీ అక్కడే, మల మూత్రాలు అక్కడే. అమెరికా దక్షిణాది రాష్ట్రంలోని ఒకానొక తారం అనాపోలిస్(నాప్లిస్) చేరే రెండున్నర నెలలపాటు అదొక నరక ప్రయాణం. దిగేసరికి పోయిన వాళ్లు పోగా మిగిలిన కొద్దిమందీ అమెరికా తెల్ల భూస్వాముల దగ్గర బానిసలుగా అమ్మబడతారు.

అక్కన్నుంచి బయటపడదామని Image
రెండడుగులు ముందుకు వేసిన ప్రతిసారీ అంతకు నాలుగింతల వేగంగా వెనక్కి తోయబడతుంటాడు కుంటా. అయినా బయటపడాలనే తన ఆశను, ప్రయత్నాన్ని ఆపడు. అలా అతని తదనంతర నాలుగు తరాల వారసులు చేసిన వీర విఫల బానిస గాథే ఈ 'ఏడు తరాలు'.

బానిసత్వం చేసే నిగ్గరోడు(నల్లోడు) మనిషే
బానిసత్వం చేయించుకునే Image
ఆ తెల్లోడు మనిషే. అయినా ఎందుకు ఈ దాష్టీకం అంటూ వేల వేల ప్రశ్నలు మదిని తరుముతూనే ఉన్నాయి పుస్తకం చదువుతున్నంతసేపూ.

ఈ బానిసత్వం లోతులు ఎంతలా ఉంటాయంటే 'గర్భవతులైన నిగ్గరు బానిస స్త్రీలు పొరపాటు చేస్తే తెల్ల యజమానులు వేసే శిక్ష ఎలా ఉంటుందంటే ఆ గర్భవతి కడుపు పట్టే మాయిన నేల మింద గుంత Image
తీసి, ఆ స్త్రీని బోర్లా పడుకోబెట్టి ఆమె పిర్రల పైన, వీపు పైనా కొరుడాలతో కొట్టేంత'.

ఇలాంటివి కొన్ని కొన్ని చదువుతున్నప్పుడు పుస్తకాన్ని పడేసి వాళ్లు అనుభవించిన నరకయాతన తలుచుకుంటూ మౌనంగా ఉండిపొయిన సందర్భాలు కోకొల్లలు. అంతలా వెంటాడింది ఈ 'ఏడు తరాలు'.

ఈ పుస్తకం చదవకముందు అమెరికా Image
ఉత్తరాది, దక్షణాడి రాజ్యాల అంతర్యుద్ధం నేపథ్యంలో దక్షిణాది భూస్వామ్య కుటుంబపు నేపథ్యంగా మార్గెరెట్ మిచెల్ రాసిన 'గాన్ విత్ ద విండ్' (తెలుగులో ఎం.వీ. రమణా రెడ్డి 'చివరకు మిగిలింది') చదవడం బాగా ఉపయోగపడింది. నిజమే బానిసత్వం తప్పే, అయితే వాళ్లకంటూ స్వేచ్ఛ రాగానేవాళ్ల తెల్ల యజమానుల Image
పట్ల ఇంత అరాచకంగా ప్రవర్తించాలా అని ఆనాడు మదిలో మెదిలిన ఆలోచనలకు 'వాళ్ల స్వేచ్ఛను కర్కషంగా హరించి వేసిన, వేస్తున్న అదృశ్య శక్తి పట్ల అన్ని నాళ్లూ వాళ్లలో కూడుగట్టుకుపోయిన ఒక తిరుగుబాటు'గా ఈ పుస్తకం సమాధానమిచ్చింది.

కొన్ని పుస్తకాలు వేటాడతాయి. ఎంతలా అంటే ఇన్నాళ్లు మనం చదివినదంతా Image
ఏంటి? అని నీలో నీకు ప్రశ్నలు సంధించేంతలా. ఇది ఆ కోవకే చెందింది.

గిటార్ ను 'కో', గాంబియాలోని నదిని 'కాంబే బో లాంగ్' అంటూ తన పూర్వీకుడైన 'కిన్-టే' మూలాలు వెతుక్కుంటూ రచయిత చేసిన ప్రయత్నం అద్భుతం. ఈ పుస్తకం రాయడం కోసం పన్నెండేళ్ల పాటు పూర్వీకులు తిరిగిన మూలాల్లో నువ్వు చేసిన Image
ప్రయాణం ఈ పుస్తక రూపంలో సజీవంగా కనపడుతోంది.

'విజేతలే చరిత్రలు విరచించే వాస్తవం తాలూకు ఆనవాయితీని బద్దలు కొట్టడానికి యీ నా ప్రజల కథ తోడ్పడుతుందని ఆశిస్తాను' - రచయిత.

తోడ్పడటము మాత్రమే కాదు మిస్టర్ ఎలెక్స్ హేలీ... వెంటాడుతోంది కూడా.

#ఏడు_తరాలు #Roots Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with శివశంకర కలకొండ

శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @janakishivasha2

Oct 7
సీనియర్ #ఎన్టీఆర్, #నాగేశ్వరరావు మధ్య ఉన్న పోలికలు !

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగానే కాక స్నేహపూర్వకంగా మెలిగిన నటులుగా ఎన్టీఆర్, ఎన్నార్ లకు పేరుంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఎన్టీఆర్, ఎన్నార్ ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. Image
#ఎన్టీఆర్, #ఎన్నార్ స్నేహం గొప్పదనం గురించి ఇప్పటికీ చిత్రపరిశ్రమ అగ్ర రచయితలు, దర్శకులు కథలుకథలుగా చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్, ఎన్నార్ కలిసి 14 సినిమాల్లో నటించారు.

వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన తొలి సినిమా #పల్లెటూరి_పిల్ల కాగా చివరి సినిమా #సత్యం_శివం. ఈ 14 సినిమాలలో దాదాపు Image
అన్నిసినిమాలు అద్భుతమైన విజయాలే కావడం గమనార్హం.

సంవత్సరంలో విడుదలయ్యే మొత్తం చిత్రాల్లో దాదాపు సగం చిత్రాలు ఎన్టీఆర్, ఎన్నార్ లవే ఉండేవని, వాళ్లకు సినిమాల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్ల తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు. Image
Read 7 tweets
Oct 7
#జంతుబలులు

కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి..?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికనీ, మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది. Image
కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం.. దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా..?

#బలి_అంటే...

గుడిలోని బలి పీఠం సనాతన ధర్మంలో భూత బలి అనే ఆచారం Image
స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ, ఇతర పదార్థమును కానీ, #గుడిలో వివిధ దిక్కులలో కానీ #బలి_పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ, ప్రకృతి లోని ఉగ్ర భూతములూ తింటాయి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది. Image
Read 14 tweets
Oct 7
#నల్లీనది #పచ్చడి
- డా. జి.వి పూర్ణచందు గారు
ఆయుర్వేద వైద్య నిపుణులు..

"నల్లీనదీ సంయుక్తం
విచారఫలమేవచ
గోపత్నీ సమాయత్తం
గ్రామ చూర్ణంచ వ్యంజనం" (చాటువు)

ఇది తెనాలి రామకృష్ణ కవి రాసినది. ఇందులో ఓ గొప్ప వంటకం తయారీని అతి రహస్యంగా చెప్పారు. ఒక్కక్క పాదాన్నే జాగ్రత్తగా Image
అర్ధం చేసుకోవాలి:
1. ‘నల్లీ నదీ సంయుక్తం’ నల్లీనది అంటే నల్లి+ఏరు=నల్లేరుకాడలతో ఈ వంటకం తయారౌతోంది.
2. “విచారఫలమేవచ” విచార ఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు.
3. “గోపత్నీ సమాయత్తం” –గో+పత్ని అంటే, ఆవు+ఆలు=ఆవాలు.
4. “గ్రామచూర్ణం” అంటే ఊరుపిండి. రుబ్బిన పిండిని ఊరుపిండి, Image
ఊరుబిండి లేక ఊర్బిండి అంటారు.

ఈ మొత్తానికి భాష్యం ఏమంటే, లేతనల్లేరు కాడలు తీసుకుని, కోణాలు చెక్కేసి చింతపండు, ఆవపిండి కలిపి మెత్తగా రుబ్బితే అది నల్లేరు కాడలపచ్చడి అవుతుందని! తింటానికి ఇంకేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనకండి. నల్లేరుకాడలు, బూడిద గుమ్మడికాయలు, Image
Read 11 tweets
Oct 7
#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు Image
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి Image
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల Image
Read 21 tweets
Oct 7
మన '#నటసార్వభౌమ_యస్వీరంగారావు' అలనాటి ఒక అపురూపమైన ఫోటోను మీకోసం...

వర్కింగ్ స్టిల్ ఫోటో: బంగారు కలలు (1974)

ప్రముఖ నవలా రచయిత్రి #యద్దనపూడి_సులోచనారాణి గారి 'బంగారు కలలు' నవలాధారంగా అదే పేరుతో అన్నపూర్ణ వారు #ఆదుర్తి_సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించారు. సంగీతం సారధ్యం Image
#సాలూరి_రాజేశ్వరరావు మాస్టారు గారు.

దయగల వాడైన గొప్ప వ్యక్తిత్వం పాత్రలో మన నాటి సింహం 'యస్వీరంగారావు' గారు పోషించారు. విధి వంచిత అయిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హిందీ నటి '#వహీదా_రెహమాన్' నటించారు. అందునా తొలిసారిగా యశస్వి #యస్వీఆర్ గారితో #వహీదా నటించారు. Image
1955 నాటి 'రోజులు మారాయి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కెరియర్ ప్రారంభించిన #వహీదా_రెహమాన్ అడపాదడపా 2-3 సినిమాలు తెలుగులోనే చేసింది. మొట్టమొదటి అవకాశం ఇచ్చింది తెలుగు పరిశ్రమే కావడం విశేషం.

#యస్వీఆర్ #వహీదా మధ్య ఎన్నో రసవంతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. Image
Read 5 tweets
Oct 7
విజయ్ సారథి వడ్డి గారి వ్యాసం

ఈ చిత్రంలో కనిపించుతున్న వ్యక్తి డాక్టర్ #కేశవరావ్_బలీరాం_హెడగేవారు. #రాష్ట్రీయస్వయంసేవకసంఘ (#RSS) స్థాపకులు. ఇప్పటికి 97 సంవత్సరాల క్రితం విజయదశమినాడు సంఘాన్ని ప్రారంభించారు. ఆయన సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా?

మనదేశం పరాయిపాలనలో ఉండటం Image
ఆయనకు చిన్ననాటినుండి భరించరానిదిగా ఉండేది. భారత సామ్రాజ్ఞి #విక్టోరియారాణి జన్మదినోత్సవం సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన లడ్డూను తినకుండా విసిరి కొట్టాడు. ఆ రాణి మరణానంతరం ఇంగ్లాండు రాజైన #ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లోని ఎంప్రెస్ మిల్లువారు తారాజువ్వలతో వెలుగుపూల Image
ప్రదర్శన ఏర్పరిచినదాన్ని పోయి చూద్దామని స్నేహితులు బలవంతపెట్టినా వెళ్లలేదు. ఆరువేల మైళ్ల దూరం నుండి కొన్నివేలమంది వ్యాపారం కోసంవచ్చి, ఇంతవిశాలమైన దేశాన్ని వశపరచుకొని, అధికారం చలాయించటమేమిటని మథనపడుతుండేవాడు.

ఆయన పెద్దవాడైన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఒక ప్రశ్న Image
Read 18 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(