#జంతుబలులు

కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి..?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికనీ, మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది. Image
కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం.. దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా..?

#బలి_అంటే...

గుడిలోని బలి పీఠం సనాతన ధర్మంలో భూత బలి అనే ఆచారం Image
స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ, ఇతర పదార్థమును కానీ, #గుడిలో వివిధ దిక్కులలో కానీ #బలి_పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ, ప్రకృతి లోని ఉగ్ర భూతములూ తింటాయి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది. Image
ఇది గృహస్తులు కూడా ఇంటివద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. ఐతే బలికి, హోమానికి తేడా ఉన్నది.. హోమం అగ్ని ద్వారా ఇస్తారు.

#ఆచరణలో_దోషం :

కొన్ని సంప్రదాయాలలో జంతు బలుల ప్రస్తావన ఉన్నది. అవి దేవతలకు ఒక పొట్టేలునో, మేకపోతునో, నల్లపిల్లినో, దున్నపోతునో బలి ఇవ్వమని చెప్పాయి. Image
ఐతే దాని అర్థం, ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు.

నల్ల పిల్లి దొంగతనానికి సంకేతం. అందుకే పిల్లిలా వచ్చాడురా అంటూ ఉంటారు. చప్పుడు చేయకుండా వచ్చి చీకట్లో దొంగతనం చేయడంలో పిల్లిని ఉదాహరణగా చెప్తారు. ఇక నల్ల పిల్లి ఐతే అసలే కనపడదు. Image
నల్ల పిల్లిని బలియ్యి అంటే నీలోని పరుల సొమ్ముపై ఉన్న #ఆశ అనే నల్ల పిల్లిని బలియ్యి అని.. అంతే కానీ.. ఒక నల్ల పిల్లిని చంపేయమని కాదు.

మేకపోతు లేక పొట్టేలు మూర్ఖత్వానికి ప్రతీకలు. ఒకటి ఎటు వెళితే మిగిలినవి కూడా అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి. నీలోని మూర్ఖత్వాన్ని బలి ఇవ్వడం ద్వారా Image
చేసిన కర్మ వలన మరలా పునర్జన్మ వస్తుంది అనే సత్యం తెలుసుకుని మోక్ష మార్గం లో ప్రయాణించవచ్చు.

దున్నపోతు పిరికితనానికీ బద్దకానికీ జడత్వానికి ( చైతన్యం లేకపోవుట) ప్రతీక.. నీలోని జడత్వాన్ని వదిలి చైతన్యం వైపూ, బద్దకాన్ని విడిచి ఉన్నతమైన జీవితం వైపూ, నాకేమౌతుందో అన్న పిరికితనంలో Image
ఉన్న శరీరం పైన మోహాన్ని త్యజించి మోక్షం వైపూ ప్రయాణించమని దాని అర్థం.

ఆ విధంగా మనలోని లోపాలను బలియ్యమని శాస్త్రాలు చెప్పాయి తప్ప జీవహింస చేయమని కాదు.

#మూఢనమ్మకం...

కోరికల కోసం జంతు బలులు ఇవ్వడం అనేది ఒక మూఢనమ్మకం మాత్రమే.

భాగవతంలో కృష్ణుడిచే.. పశూమ్ దృశ్యంతి విశబ్దా:.. అని Image
బలి పేరిట అన్యాయంగా చంపివేయబడ్డ జంతువులు స్వర్గంలో చంపిన వాడిపై పగతో ఎదురుచూస్తాయి అని చెప్పబడింది.

అదేవిధంగా భగవద్గీత (5-18) ప్రతి జీవి దేవుడి దృష్టిలో సమానం అని చెప్పినది.

ఒక కాలంలో చారిత్రక తప్పిదంగా ఏర్పడిందే తప్ప సనాతన ధర్మంలో జంతుబలి లేదు. Image
అశ్వం నైవా గజంనైవ వ్యాఘ్రం నైవచ నైవచ…
అంటూ పూర్వం చెప్పిన రీతిలో గుఱ్ఱమును, ఏనుగును, పులులను చంపలేరు కనుక లోకువగా దొరికిన మేకను దేవుని పేరుతో చంపినారు అని..

ఋగ్వేదంలో దున్నపోతుల, మేకపోతుల బలులు బ్రాహ్మణులు అర్పించి ఇంద్రుడిని తృప్తి పరిచారు అని ఉన్నది.. Image
ఇంద్రుడు ఇంద్రియములకు దేవత. అంటే వారి ఇంద్రియాలలో మనసులో లోపాలను బలిగా సమర్పించారు అనే తప్ప చంపేశారు అని కాదు.

వేదాలు, ఇతర ఐతిహాసిక గ్రంథాలు పుస్తక రూపంలో రావడం వలన, గురువు వద్ద నేర్చుకోకుండా వారి వారి సొంత అభిప్రాయాలకు రావడం వలన ఏర్పడిన తప్పిదమే తప్ప మరొకటి కాదు. Image
ఇప్పుడు మనకు జంతు బలుల యొక్క అంతరార్థం తెలిసింది. కనుక ఇకనైనా విచక్షణతో ప్రవర్తిద్దాం.

అమాయకమైన జంతువులను బ్రతకనిద్దాం. ఇకనైనా నోరులేని మూగజీవాలని మొక్కుబడుల పేరుతో దారుణంగా హింసించకండి. దైవాన్ని ప్రసన్నం చేసుకునే ఉత్తమమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆచరించండి. Image
ముందుగా బలి ఇవ్వవలసింది మనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని.

జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడనుట సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ వినుర వేమ...!

జీవుడికి, శివుడి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. Image
జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమేననీ, జీవహింస మహాపాపమని ఈ పద్యంలో చెప్పారు వేమన మహాకవి. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with శివశంకర కలకొండ

శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @janakishivasha2

Oct 7
సీనియర్ #ఎన్టీఆర్, #నాగేశ్వరరావు మధ్య ఉన్న పోలికలు !

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగానే కాక స్నేహపూర్వకంగా మెలిగిన నటులుగా ఎన్టీఆర్, ఎన్నార్ లకు పేరుంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఎన్టీఆర్, ఎన్నార్ ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. Image
#ఎన్టీఆర్, #ఎన్నార్ స్నేహం గొప్పదనం గురించి ఇప్పటికీ చిత్రపరిశ్రమ అగ్ర రచయితలు, దర్శకులు కథలుకథలుగా చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్, ఎన్నార్ కలిసి 14 సినిమాల్లో నటించారు.

వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన తొలి సినిమా #పల్లెటూరి_పిల్ల కాగా చివరి సినిమా #సత్యం_శివం. ఈ 14 సినిమాలలో దాదాపు Image
అన్నిసినిమాలు అద్భుతమైన విజయాలే కావడం గమనార్హం.

సంవత్సరంలో విడుదలయ్యే మొత్తం చిత్రాల్లో దాదాపు సగం చిత్రాలు ఎన్టీఆర్, ఎన్నార్ లవే ఉండేవని, వాళ్లకు సినిమాల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్ల తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు. Image
Read 7 tweets
Oct 7
#నల్లీనది #పచ్చడి
- డా. జి.వి పూర్ణచందు గారు
ఆయుర్వేద వైద్య నిపుణులు..

"నల్లీనదీ సంయుక్తం
విచారఫలమేవచ
గోపత్నీ సమాయత్తం
గ్రామ చూర్ణంచ వ్యంజనం" (చాటువు)

ఇది తెనాలి రామకృష్ణ కవి రాసినది. ఇందులో ఓ గొప్ప వంటకం తయారీని అతి రహస్యంగా చెప్పారు. ఒక్కక్క పాదాన్నే జాగ్రత్తగా Image
అర్ధం చేసుకోవాలి:
1. ‘నల్లీ నదీ సంయుక్తం’ నల్లీనది అంటే నల్లి+ఏరు=నల్లేరుకాడలతో ఈ వంటకం తయారౌతోంది.
2. “విచారఫలమేవచ” విచార ఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు.
3. “గోపత్నీ సమాయత్తం” –గో+పత్ని అంటే, ఆవు+ఆలు=ఆవాలు.
4. “గ్రామచూర్ణం” అంటే ఊరుపిండి. రుబ్బిన పిండిని ఊరుపిండి, Image
ఊరుబిండి లేక ఊర్బిండి అంటారు.

ఈ మొత్తానికి భాష్యం ఏమంటే, లేతనల్లేరు కాడలు తీసుకుని, కోణాలు చెక్కేసి చింతపండు, ఆవపిండి కలిపి మెత్తగా రుబ్బితే అది నల్లేరు కాడలపచ్చడి అవుతుందని! తింటానికి ఇంకేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనకండి. నల్లేరుకాడలు, బూడిద గుమ్మడికాయలు, Image
Read 11 tweets
Oct 7
#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల
Read 21 tweets
Oct 7
మన '#నటసార్వభౌమ_యస్వీరంగారావు' అలనాటి ఒక అపురూపమైన ఫోటోను మీకోసం...

వర్కింగ్ స్టిల్ ఫోటో: బంగారు కలలు (1974)

ప్రముఖ నవలా రచయిత్రి #యద్దనపూడి_సులోచనారాణి గారి 'బంగారు కలలు' నవలాధారంగా అదే పేరుతో అన్నపూర్ణ వారు #ఆదుర్తి_సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించారు. సంగీతం సారధ్యం
#సాలూరి_రాజేశ్వరరావు మాస్టారు గారు.

దయగల వాడైన గొప్ప వ్యక్తిత్వం పాత్రలో మన నాటి సింహం 'యస్వీరంగారావు' గారు పోషించారు. విధి వంచిత అయిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హిందీ నటి '#వహీదా_రెహమాన్' నటించారు. అందునా తొలిసారిగా యశస్వి #యస్వీఆర్ గారితో #వహీదా నటించారు.
1955 నాటి 'రోజులు మారాయి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కెరియర్ ప్రారంభించిన #వహీదా_రెహమాన్ అడపాదడపా 2-3 సినిమాలు తెలుగులోనే చేసింది. మొట్టమొదటి అవకాశం ఇచ్చింది తెలుగు పరిశ్రమే కావడం విశేషం.

#యస్వీఆర్ #వహీదా మధ్య ఎన్నో రసవంతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.
Read 5 tweets
Oct 7
విజయ్ సారథి వడ్డి గారి వ్యాసం

ఈ చిత్రంలో కనిపించుతున్న వ్యక్తి డాక్టర్ #కేశవరావ్_బలీరాం_హెడగేవారు. #రాష్ట్రీయస్వయంసేవకసంఘ (#RSS) స్థాపకులు. ఇప్పటికి 97 సంవత్సరాల క్రితం విజయదశమినాడు సంఘాన్ని ప్రారంభించారు. ఆయన సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా?

మనదేశం పరాయిపాలనలో ఉండటం
ఆయనకు చిన్ననాటినుండి భరించరానిదిగా ఉండేది. భారత సామ్రాజ్ఞి #విక్టోరియారాణి జన్మదినోత్సవం సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన లడ్డూను తినకుండా విసిరి కొట్టాడు. ఆ రాణి మరణానంతరం ఇంగ్లాండు రాజైన #ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లోని ఎంప్రెస్ మిల్లువారు తారాజువ్వలతో వెలుగుపూల
ప్రదర్శన ఏర్పరిచినదాన్ని పోయి చూద్దామని స్నేహితులు బలవంతపెట్టినా వెళ్లలేదు. ఆరువేల మైళ్ల దూరం నుండి కొన్నివేలమంది వ్యాపారం కోసంవచ్చి, ఇంతవిశాలమైన దేశాన్ని వశపరచుకొని, అధికారం చలాయించటమేమిటని మథనపడుతుండేవాడు.

ఆయన పెద్దవాడైన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఒక ప్రశ్న
Read 18 tweets
Oct 7
మన #ఎస్వీయార్ గారి ఆరాధ్య నటుడు #గోవిందరాజు_సుబ్బారావు గారు

తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యారు.

గోవిందరాజు సుబ్బారావు 1895
సంవత్సరంలో జన్మించారు. ఇతను మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించారు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి,
కొన్ని పరిశోధనలు నిర్వహించారు.

అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు.

అయితే గోవిందరాజు సుబ్బారావు నటునిగానే
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(