ప్రతి మనిషిలోనూ తప్పనిసరిగా ఉండాల్సిన గుణం "కృతజ్ఞత".. అది రానురానూ ప్రజలలో తగ్గిపోతుంది. తనకు సహాయం చేసినవారి పట్ల ఎలా కృతజ్ఞత చూపాలో తెలియజేసిన ఒక ఆదర్శపురుషుడి గురించి తెలుసుకుందాం!!
సన్నగా వుండేవాడు పిల్లాడు. అయితే బాగా హుషారుగా వుండేవాడు. బుర్రకథలంటే ఇష్టం. అందువలన పాఠశాలలో చదివేకాలంలోనే బుర్రకథలు చెప్పడం నేర్చుకున్నాడు. బుర్రకథలను తనదైన స్టైల్ లో రిక్షావాళ్ళకు చెప్పేవాడు. వారు ఆ అబ్బాయి చెప్పే జోక్స్ కు నవ్వుతూ అభినందించేవారు. వారు అలా మెచ్చుకోవడంతో ఇంకా
రెచ్చిపోయేవాడు ఆ అబ్బాయి.
పదవ తరగతి అయిపోయింది. ఇంటర్ కు కళాశాలలో చేరాడు. ఇంటర్ అయిన తరువాత టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగు పంతులుగా చేరాడు. అయినా నాటకాలపై మక్కువ తగ్గలేదు. మళ్ళీ కళావేదికపై కాలుమోపాడు. అద్భుతంగా నటిస్తుండటంతో ఒక స్నేహితుడు సినిమాలలో చేరమన్నాడు. అంతే
సినిమాలలో నటించాలని కలలు కనసాగాడు. ఒకరోజు ఇంట్లో చెప్పాపెట్టకుండా చెన్నై చెక్కేశాడు.
అయితే అక్కడేమీ అవకాశాలు తన్నూకురాలేదు. సార్ పర్సనాలిటీ చూసి పెదవి విరిచారు సినీపెద్దలు. ఒకప్రక్క ఆకలిబాధ. సినిమాలు లేవు. ఊరికి వెళ్ళలేడు. అలా ఆలోచిస్తూ నటి రాజసులోచన ఇంటిదగ్గరకు
వచ్చాడో రోజు. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె ఇంటి ముందుకొచ్చి నీరసంగా కుర్చొండిపోయాడు. అది గమనించి ఆ ఇంటి వాచ్ మన్ ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పరిస్థితి జాలేసి త్రాగడానికి నీళ్ళు, బిస్కెట్ ఇచ్చాడు. కృతజ్ఞతగా చూసాడు అతని వైపు అప్పలరాజు. ఇంతలో రాజారావు అనే నటుడి పిల్లలకు ట్యూషన్
చెప్పేందుకు చేరాడు. అయితే నాటకాలు మాత్రం మానలేదు..
ఒకరోజు రాజారావు అతనికి ఒక సినిమాలో అవకాశం ఇప్పించాడు. చాలా సంతోషపడిపోయాడు. సినిమా పేరు "సమాజం". అది ఫెయిల్యూర్. తర్వాత కులగోత్రాలు, పుణ్యవతిలాంటి సినిమాలలో చిన్న, చిన్న పాత్రలు వేశాడు. పేరురాలేదు.
అయితే 1960లో జగపతి ఆర్ట్స్
అధినేత వి.బి రాజేంద్రప్రసాద్ తన సొంతసినిమా "అంతస్థులు" లో అప్పలరాజుకు ఒకపాత్ర ఇచ్చారు. పారితోషికం ₹1300. అంతస్థులు సూపర్ హిట్ అయింది. అప్పలరాజు #రాజబాబు గా మారిపోయాడు. అంతే ఇంక వెనుక తిరిగి చూడలేదతను. తనకే సొంతమైన, ఎవరూ అనుకరించలేని హాస్యనటనతో తెలుగుప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
ఒకానొక సమయంలో అగ్రహీరోలతో సమానంగా పారితోషికం తీసుకొనే స్థాయికి ఎదిగారు రాజబాబు.
ఉదాహరణకు యన్ టి రామారావు, రాజబాబు గారు ఒక సినిమాలో నటిస్తున్నారు. రామారావుగారికి పారితోషికం₹ 30000 కాగా, రాజబాబుకు ₹20000 ఇస్తామన్నారు. కానీ రాజబాబు నాకూ ₹30000 కావాల్సిందేనని పట్టుబట్టాడు.
ఇవ్వక తప్పింది కాదు నిర్మాతకి. అంత స్థాయికి ఎదిగాడు ఆయన.
ఎంత ఎత్తుకెదిగినా తనకు సహాయం చేసినవారిని మరిచిపోలేదు. తనకు నీళ్ళు ఇచ్చి దప్పిక తీర్చిన వాచ్ మేన్ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు, తనకు నటనలో మెళకువలు నేర్పిన బాలకృష్ణ(అంజిగాడు)ను సన్మానించి ,ఆర్థికంగా చాలా సహాయం చేశాడు.
అలాగే ఒక ట్రష్ట్ ను ఏర్పరిచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నటుడిని సన్మానించేవాడు. రేలంగి, సావిత్రి, రాజనాల, రాజారావు, చిత్తూరు నాగయ్యలాంటివారు సన్మానం పొందినవారిలో వున్నారు.
అంతేకాకుండా చిన్నప్పడు తమ చప్పట్లతో ప్రోత్సహించిన రిక్షావాళ్ళకు కొత్తరిక్షాలు, నగదు అందజేశాడు.
రాజమండ్రిలో వీధులు ఊడ్చే పనివాళ్ళకు "దానవాయిపేటలో పొలం కొని వారికి ఇచ్చాడు". కోరుకొండలో జూనియర్ కళాశాలను కట్టించాడు. అది ఆయన పేరు మీదనే "రాజబాబు జూనియర్ కళాశాల"గా ఉంది.
నటుడిగా నిలదొక్కుకునే సమయంలో తనకు సహాయపడిన వాళ్ళందరినీ గుర్తుంచుకొని కృతజ్ఞతాభావం చూపిన మహామనిషి రాజబాబుగారు.
పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడు రాజబాబుగారే. ఏడుసార్లు ఉత్తమ హాస్యనటుడి అవార్డు పొందారు. 1983లో అకస్మాత్తుగా ఆనారోగ్యం పాలై మరణించారు. 20 వ శతాబ్ధపు ఉత్తమ హాస్యనటుడిగా గుర్తింపుపొందిన రాజబాబు, నిజజీవితంలో "రాజునే".. ఆయనలోని "కృతజ్ఞత" మనందరికీ ఆదర్శం....
వారికి జయంతి నివాళులు..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్తుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీలో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ
మాట్లాడేవాడు కాదు. కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది.
ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వచ్చి వ్యక్తి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం
విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు.
#జనక మహారాజు గొప్ప వేదాంతి. అలాంటి జనకుడి దగ్గర వేదాంత విషయాలు నేర్చుకుని రావలసిందిగా ఓ గురువు తన శిష్యుడైన ఓ యువకుడిని పంపించాడు. ఆ యువకుడు ఎంతో దూరం ప్రయాణం చేసి జనకుడిని వెదుక్కుంటూ వచ్చాడు. అతను వచ్చే సమయానికి జనకుడు కొలువులో ఉన్నాడు.
ఆ సమయంలో లోనికి వెళ్లడం భావ్యం కాదు కనుక ఈ యువకుడు బయట ద్వారం దగ్గర ఉన్న కాపరి వారికి ఒక చీటీ మీద ‘మీ వద్ద వేదాంత విషయాలను నేర్చుకుని రమ్మని మా గురువు గారు పంపించగా నేను వచ్చాను’ అని రాసి లోపలకు పంపించాడు. జనకుడు ఆ చీటీ చూసి, దాని వెనకాల ‘నేను చచ్చిన తర్వాత రండి’ అని రాసి
తిరిగి పంపించాడు.
ఆ యువకుడికి మతిపోయినంత పనైంది. ఇదేంటి.. నేను ఈయన దగ్గర వేదాంత రహస్యాలను తెలుసుకుందామని వస్తే ఈయనేమో తాను చచ్చిన తర్వాత రమ్మని అంటున్నాడు అనుకుని నిరాశతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
అక్కడ ఒక చెట్టు కనిపిస్తే ప్రయాణ అలసట, ఆకలి, దప్పికలతో
వాడు పుడితే
ఇరుకు తడికిల్లు ఖాళీ లేక మూలిగింది...!!
వాడు కడుపు తడుంకుంటే
పేగుల్లో విశ్వం విశ్వరూపం దాల్చింది..!!
వాడు బట్ట కడితే,
వెలుతురూ, గాలీ వంటిమీద కొట్లాడుకున్నాయి..!
వాడు పడుకుంటే,
గోనేపట్టా, ఇంటికప్పూ పడీ పడీ నవ్వుకున్నాయి..!
చెరువుగట్టు మీద నిలిచి
“నీళ్ళో” అని అరిచాడు..
చెరువు ప్రతిధ్వనించింది..
అడవిలో కూర్చుని
“కూడో” అని పొలికేక పెట్టాడు..
అడవిలో వెన్నెల కాచింది...
దొర్లే పేలికలు చుట్టుకుంటే
పొడుగు కొమ్ములతో ఎద్దు పొడిచింది..
తాటాకు క్రింద తల దాచుకుంటే
మొరట గిట్టలతో దున్న తొక్కింది..
రాలిపడ్డ మెతుకులు తినబోతే
కోరపళ్ళతో కుక్క కరిచింది..
ఊపిరి లేక యాలగిలబడితే
బ్రతికుండగానే పీక్కుతింటుంది నక్క..
శబ్ధంలేని నోరు తెరిచి
బలం లేని చేతులెత్తి
చూపులేని కళ్ళు విప్పి
అరిస్తే,
పిలిస్తే,
చూస్తే,
మబ్బుముక్క ఘోషించింది
మట్టిగడ్డ రోదించింది
*నోబెల్ బహుమతులను ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? స్వీడిష్ శాస్త్రవేత్త #ఆల్‌ఫ్రెడ్_నోబెల్.
ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల
తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు.
#ఆల్‌ఫ్రెడ్_నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21, 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్ తండ్రి ఇమాన్యుయెల్ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో
సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.
ఈయనకు రసాయనశాస్త్రం, అనేక భాషలపై అత్యంత అభిరుచి. ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ భాషల్లో ఎంతో ప్రావీణ్యం ఉంది. జీవితం మొత్తం మీద ఆల్ఫ్రెడ్
ఇటీవలి మా ఈశాన్య రాష్ట్రాల పర్యటన సందర్భంగా మేము పలు ప్రాంతాలలో అశోక వృక్షాలు చూశాము. ముఖ్యంగా అస్సామ్ లోని #గువాహాటిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చాలా అశోక వృక్షాలు కనిపించాయి.
'అశోక' అనే సంస్కృత పదానికి శోకము
లేనిది (Sorrow-less) అని అర్థం. రామాయణ కథనం ప్రకారం సీతను చెరబట్టిన రావణుడు ఆమెను లంకా నగరంలోని #అశోకవనం లోనే బందీగా ఉంచాడంటారు. 'అశోకవనమున సీత .. శోకించె వియోగము చేత' అనే పాట మనందరం విన్నదే.
మన్మథునికి 'పంచేషుడు',' పంచబాణుడు', 'పంచశరుడు' అనే పేర్లున్నాయి. సంస్కృతంలో 'పంచ'
అంటే ఐదు అనీ, 'ఇషు' అన్నా 'శర' అన్నా 'బాణము' అని అర్థం. మన్మథుడికి 'పుష్పశరుడు', ' సుమశరుడు' అనే పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఆయన పూవులనే బాణాలుగా వేస్తాడన్నమాట. యువతీయువకులపై మన్మథుడు ఐదు రకాల పూలను బాణాలుగా ప్రయోగించి వారిలో కామతాపాన్ని రగులుస్తాడట. ఆయన అమ్ముల పొది(Quiver) లో
పరిశోధకుడు, విమర్శకుడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు వీరి పినతండ్రి. బాల్యంలోనే ఇతని ప్రతిభాపాటవాలు వెలుగు చూశాయి. సహజ ధారణాశక్తితో చిన్నప్పుడే తిరుపతి వెంకటకవుల అవధాన పద్యాలను కంఠస్తం చేశారు.. ఎనిమిదవ తరగతి చదివే
సమయంలోనే ఇతని పద్యాలు భారతి మాస పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈయన నలభైకిమించి గ్రంథాలను రచించారు.. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. శ్రీ ఖండవిల్లి లక్ష్మీరంజనం గారితో కలిసి ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశాడు
తెలంగాణాలోని మారుమూల గ్రామాలకు పిలవగానే వెళ్లి ఉపన్యాసాల ద్వారా అక్కడి ప్రజలకు తెలుగు భాషాసాహిత్య చైతన్యాన్ని కలిగించారు. అనేక కవిపండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను, సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించాడు. ఇతనికి అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది. వాటిలో