శుభోదయం 🙏 Image
#గోవర్ధన_పూజ/#అన్నకూట్_పూజ/#ఛప్పన్_భోగ్

ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను #ఇంద్రయాగం అనేవారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు.వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.అందుకే ఈ పండుగ రోజు
ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల,గోపాలకుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పించే వారు. అందుకే ఈపూజకు #అన్నకూటం అని మరొక పేరు కూడా ఉంది.
ఈ పూజ వెనుక కథ
శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వం అణిచి, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కథ మనకు తెలుసు కదా..ఆ నాటి నుండి ‘ఇంద్రయాగం’ ‘గోవర్ధనపూజ’గా మారిపోయింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్న రోజు ‘కార్తీక శుద్ధ పాడ్యమి’. అందుకనే ఈ రోజున  రైతాంగమంతా ఈ గోవర్ధన పూజను ImageImage
నిర్వహిస్తారు. ఈ రోజున ఉదయమే తలస్నానం చేసి, ఆవుపేడతో శ్రీకృష్ణుని విగ్రహాన్ని,గోవర్ధన పర్వతాన్ని  తయారుచేసి, షోడశోపచారాలతో శ్రీకృష్ణుని ఆరాధించి, అన్నపు రాశులు, రకరకాల పిండివంటలు, పదార్ధాలు శ్రీకృష్ణునకు నివేదనగా సమర్పిస్తారు. తర్వాత  ఆట పాటలతో శ్రీకృష్ణుని సంతోష పరిచి ImageImageImage
ఆ ప్రసాదాన్ని సామూహికంగా భుజిస్తారు. ఇదీ ‘గోవర్ధన పూజ’ కథ.

యాభై ఆరు ఆహార పదార్థాలు (చప్పన్ భోగ్) తయారు చేసి నైవేద్యం గా సమర్పిస్తారు.మథుర నగరంలోని ఆవుల కాపరులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తారు, ఆవు మరియు ఎద్దుతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, ImageImageImage
పోతన భాగవతంలోని గోవర్ధనగిరిని  ఎత్తిన ఘట్టం లోని పద్యాలు చూడండి..ఎంత బావున్నాయో!!

బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతో గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేల దాల్చి విపులచ్ఛత్త్రంబుగా బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోప గోపంక్తికిన్!
బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం బ్రమోదంబునన్!
Pic courtesy Google Image
BAPS ,Swamy Narayan Temple,Houston లో అన్నకూట్
Pic courtesy by my niece ImageImage

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with లక్ష్మి

లక్ష్మి Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @jayahanuma

Oct 26
#కార్తీకమాసం🙏
#పరమ_శివుని_అవతారాలు.

విష్ణుమూర్తి లాగానే ఈశ్వరుడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తాడు.అవి ఏంటో తెలుసుకుందాం.
1.పంచముఖ రూపం.(ఈశాన,తత్పురుష,అఘోర,వామదేవ,సద్యోజాత)
2.అష్టమూర్తి రూపం.(శర్వ,భవ,రుద్ర,ఉగ్ర,భీమ,పశుపతి,మహాదేవ)
3.అర్థనారీశ్వర రూపం.(స్త్రీ, పురుష)
4.నందీశ్వరావతారం.
5.భైరవ అవతారం.
6.వీరభద్రుని శరభావతారం.
7.గృహపత్యావతారం.
8.యక్షేశ్వరావతారం.
9.దశావతారములు.(మహా కాలావతారం, తార,బాల భువనేశుడు,షోడశ శ్రీ విద్యేశుడు,భైరవుడు,ఛిన్నమస్తకుడు,ధూమవంతుడు,బగళాముఖుడు, మాతంగుడు,కమలుడు)
10.ఏకాదశ రుద్రులు (కపాలి, పింగలుడు, భీముడు,విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త,అజపాత్, అహిర్బుధ్న్యుడు, శంభుడు, చండుడు,భవుడు)
11.దుర్వాసావతారం.
12.హనుమ అవతారం.
13.వృషభావతారం.
14.పిప్పలాదుడి అవతారం.
15.వైద్యనాథ అవతారం.
16.ద్విజేశ్వరావతారం.
17.యతినాథ హంసావతారం.
18.కృష్ణ దర్శనావతారం.
Read 4 tweets
Oct 25
#కార్తీక_మాసం
#Dos_Donts.
ఈ సంవత్సరం 26-10-2022 నుంచి 23-11-2022 వరకూ కార్తీక మాసం.
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు;
గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

🕉అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.

🕉శివ కేశవులకి ప్రీతికరమైన మాసం.

🕉రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు చేస్తారు ఆలయాల్లో.

🕉#అభిషేక_ప్రియః_శివః
రకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తారు.
🕉#ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం,ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులమవుతాం.
Read 11 tweets
Oct 25
#కార్తీకమాసం_ముఖ్యమైన_రోజులు
26-10-2022 ఆకాశదీపం ప్రారంభం.(శుద్ధపాడ్యమి)
27-10-2022 భాతృవిదియ/యమ ద్వితీయ/భగినీ హస్త భోజనం (సోదరి ఇంట్లో భోజనం చెయ్యాలి)
28-10-2022 సోదరీ తృతీయ(సోదరికి బహుమతులు ఇవ్వడం)
29-10-2022 నాగులచవితి (పుట్టలో పాలు పొయ్యడం,నాగేంద్రుడికి పూజ,ఒక పూట ఉపవాసం,పొట్లకాయ కత్తి, చాకు లాంటివి వాడటం నిషిద్ధం,నువ్వులతో,చలిమిడితో నైవేద్యం)
31-10-2022 కార్తీక సోమవారం
1-11-2022 గోష్ఠాష్టమి (గో పూజ)
4-11-2022 ఉత్థాన/బోధన ఏకాదశి.(విష్ణు పూజ,ఉపవాసం)
5-11-2022 క్షీరాబ్ధి ద్వాదశి (కార్తీక దామోదర పూజ, తులసీ కల్యాణం) శని త్రయోదశి ప్రదోషం
7-11-2022 కార్తీక సోమవారం,365 వత్తుల దీపారాధన,జ్వాలాతోరణం, సత్యనారాయణ వ్రతం.
8-11-2022 చంద్ర గ్రహణం.
14-11-2022 కార్తీక సోమవారం.
20-11-2022 మత త్రయ ఏకాదశి.
Read 4 tweets
Oct 13
1st Answer

#భాగవతం_అష్టమ_స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది అండీ.(అందుకే పురాణాలు చదవాలి, అది మన కర్తవ్యం. ఋషి ఋణం అని ఒకటి ఉంటుంది అది తీరాలి అంటే వారు రాసినవి చదివి అర్థం చేసుకుంటేనే తీరుతుంది..రామాయణం భారతం,భాగవతం,భగవద్గీత లో లేని విషయం ఇంకేం లేదు ఈ ప్రపంచంలో..మీరు
కూడా ఆ పుస్తకాలు చదివితే అన్ని సందేహాలకీ సమాధానం లభిస్తుంది 🙏🙏)

నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము"లో27 మహాయుగాలు ఐపోయి,28వ మహాయుగంలో కృత,త్రేతా,ద్వాపరయుగాలు ఐపోయి,కలియుగములో ఉన్నాము.ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు
ఇంద్రుడు, సురలు మారుతుంటారు.(పేర్లు మాత్రమే)  చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. తరువాత వైవస్వత మన్వంతరం మొదలయ్యింది.
Read 5 tweets
Oct 12
#యుగం_మన్వంతరం_కల్పం.
కృత యుగం-17,28,000 సంవత్సరాలు.
త్రేతాయుగం-12,96,000 సంవత్సరాలు.
ద్వాపరయుగం-8,64,000 సంవత్సరాలు.
కలియుగం- 4,32,000 సంవత్సరాలు.
కలియుగం 5,123 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుతం 2022 (ఇది క్రీస్తుశకం లెక్కల ప్రకారం!!) సంవత్సరానికి ఇంకా 4,26,877 సంవత్సరాలు మిగిలివుంది.428,899లో అంతమవుతుంది.

3101 +present year =కలియుగం ప్రారంభం అయ్యింది.ఇదే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన సంవత్సరం కూడా!!
ఆయన అవతారం చాలించిన మర్నాటి నుంచి కలియుగం ప్రారంభం అయ్యింది.(ఇది NASA వారు కూడా ధృవీకరించారు.)

కలియుగం కిdouble/రెట్టింపు ద్వాపర యుగం (432000×2=864000)

కలియుగం కి మూడు రెట్లు =త్రేతాయుగం.(432000×3=1296000)

కలియుగం కి నాలుగురెట్లు=కృతయుగం (432000×4=1728000)
Read 9 tweets
Oct 12
#అట్లతద్దె
ఇవాళ  అట్లతద్దె /చంద్రోదయ ఉమా వ్రతం 13-10-2022.
ఆశ్వీయుజ బహుళ తదియ నాడు ఈ పండగ జరుపుకుంటాం.ఇది కూడా ఉండ్రాళ్ళతద్దె లాగానే ఉంటుంది దాదాపు. నివేదన,వాయనదానాల్లో అట్లు(దోసెలు కాదు😃)ఇస్తారు.

ఈ నోము ఆడపిల్లలు(పెళ్లి కాని వారూ, పెళ్ళైన వారు)నోచుకుని 3,5,7 ఇలా బేసి సంఖ్య గల
ఏడాది ఉద్యాపన చెయ్యాలి.
ముందు రోజు సాయంత్రం గోరింటాకు రుబ్బి చేతులకి,కాళ్ళకి పెట్టుకోవాలి.
ఒక వెడల్పాటి ప్లేటులో  గోరింటాకు ముద్ద వేసి నీళ్లు కలిపి రెండు పాదాలు సగం వరకు  దాన్లో మునిగేలా ఉంచి,
కొంత సేపు అయ్యాక తీస్తే చక్కగా పాదాలు,వేళ్ళు,అరికాలు మొత్తం పండుతుంది ఎర్రగా...
వీటినే "సిరిపాదాలు"/"లక్ష్మీ పాదాలు" అంటారు.ఈ మాసం కూడా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి,గోరింటాకు పెట్టుకుంటే నీళ్ళల్లో తడవడం వల్ల వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
గోరింటాకు బహిష్టు సంబంధిత దోషాలు (irregular periods)   పోగొడుతుంది.
Read 14 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(